Virat Kohli
Virat Kohli : ఇటీవల శ్రీలంక పర్యటనను ముగించిన భారత్ వచ్చే నెలలో బంగ్లాదేశ్ లో టెస్టు సిరీస్ ఆడనుంది. టీ20 ప్రపంచకప్ ఫైనల్లో కోహ్లీ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్‌లో ఆడిన అతని నుంచి పెద్ద ఇన్నింగ్స్ రాలేదు. ఇప్పుడు దులీప్ ట్రోఫీలో ఆడతాడని వార్తలు వచ్చాయి, కానీ అది జరగలేదు. విరాట్ కోహ్లీ దులీప్ ట్రోఫీకి ఎంపిక కాలేదు. దీంతో బంగ్లాదేశ్‌తో జరిగే సిరీస్‌లో నేరుగా అడుగుపెట్టనున్నాడు.ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ పలు రికార్డులు సృష్టించే ఛాన్స్ ఉంది.
Virat Kohli,Sachin Tendulkar
బంగ్లాదేశ్ సిరీస్ లో విరాట్ కోహ్లీ పలు రికార్డులు సృష్టించనున్నాడు. బంగ్లాదేశ్‌పై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల లిస్టులో పుజారా, ద్రవిడ్‌ల కంటే కోహ్లీ కాస్త వెనుకబడి ఉన్నాడు. ఈ సిరీస్‌లో మంచి ప్రదర్శనతో వీరిని అధిగమించే అవకాశముంది. బంగ్లాదేశ్‌పై అత్యధిక టెస్టు పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్లలో కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు. 6 మ్యాచ్‌ల్లో 9 ఇన్నింగ్స్‌ల్లో 437 పరుగులు చేశాడు. అతని కంటే ముందు చెతేశ్వర్ పుజారా (468 పరుగులు), రాహుల్ ద్రవిడ్ (560 పరుగులు), సచిన్ టెండూల్కర్ (820 పరుగులు) ఉన్నారు. విరాట్ 32 పరుగులు చేస్తే, పుజారా 124 పరుగులు చేస్తే ద్రవిడ్‌ను అధిగమిస్తాడు. ఇదే సమయంలో సచిన్ టెండూల్కర్ ను అధిగమించాలంటే బంగ్లాదేశ్ తో జరిగే సిరీస్ లో కోహ్లీ 384 పరుగులు చేయాల్సి ఉంటుంది.
టెస్టు సిరీస్‌లో గ్రేట్ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డాన్ బ్రాడ్‌మన్‌ను కూడా విరాట్ అధిగమించనున్నాడు. బ్రాడ్‌మాన్ 52 టెస్టు మ్యాచ్‌ల్లో 99.94 సగటుతో 6996 పరుగులు చేశాడు. అలాగే, 29 సెంచరీలు కొట్టాడు. విరాట్ కోహ్లి 113 టెస్టు మ్యాచ్‌లు ఆడి 191 ఇన్నింగ్స్‌ల్లో 49.15 సగటుతో 8848 పరుగులు చేశాడు. 29 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు సాధించాడు. బంగ్లాదేశ్‌పై విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే బ్రాడ్‌మన్‌ను అధిగమిస్తాడు. అలాగే, ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ హేడెన్, వెస్టిండీస్‌కు చెందిన శివనారాయణ్ చందర్‌పాల్‌ల 30 సెంచరీల రికార్డును సమం చేస్తాడు.
బంగ్లాదేశ్‌పై అత్యధిక సెంచరీలు సాధించిన జట్టులో కోహ్లీ ప్రస్తుతం టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, మాజీ ఓపెనర్ మురళీ విజయ్‌లతో సమానంగా ఉన్నాడు. మరో సెంచరీతో వీరిద్దరినీ అధిగమించనున్నాడు. బంగ్లాదేశ్‌పై కోహ్లి, గంభీర్, విజయ్ చెరో 2 సెంచరీలు చేశారు. రాహుల్ ద్రవిడ్ 3, సచిన్ టెండూల్కర్ 5 సెంచరీలతో ముందున్నారు.
Virat Kohli
విరాట్‌తో పాటు గౌతమ్ గంభీర్‌కు ఈ సిరీస్ ప్రత్యేకం. కోచ్‌గా అతనికి ఇదే తొలి టెస్టు సిరీస్. టీ20లో విజయం సాధించినా వన్డేల్లో సిరీస్ లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఇక టెస్టు సిరీస్‌లో టీమిండియా ఎలా రాణిస్తుందో చూడాలి. ఓవరాల్‌గా బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్ భారత క్రికెట్‌కు చాలా కీలకం. ఎన్నో రికార్డులను బద్దలు కొట్టేందుకు విరాట్ కోహ్లీకి ఇది సువర్ణావకాశం. అలాగే, కోచ్‌గా గౌతమ్ గంభీర్ తన సత్తాను నిరూపించుకోవడానికి మంచి ఛాన్స్.