ఆసియా కప్ 2025 : ఇండియా vs పాకిస్తాన్.. రికార్డుల మోత మోగించారు

Published : Sep 15, 2025, 01:40 AM IST

IND vs PAK: ఆసియా కప్ 2025లో భారత్ పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అభిషేక్ శర్మలు అద్భుత ప్రదర్శనలతో అదరగొట్టారు.

PREV
16
పాకిస్తాన్ చిత్తుచేసిన భారత్

సెప్టెంబర్ 14న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఆసియా కప్ 2025 గ్రూప్–ఏలోని 6వ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 128 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం 15.5 ఓవర్లలోనే చేధించింది. 7 వికెట్ల తేడాతో గెలిచి గ్రూప్‌లో భారత్ తన స్థానం బలపరుచుకుంది. ఈ విజయం తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య టీ20ల్లో గెలుపు-ఓటముల రికార్డు 11-3గా మారింది.

26
భారత బౌలింగ్ దెబ్బకు కుప్పకూలిన పాకిస్థాన్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ జట్టు మ్యాచ్ ఆరంభం నుంచే ఇబ్బంది పడింది. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 127 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ సహిబ్‌జాదా ఫర్హాన్ 44 బంతుల్లో 40 పరుగులు చేసి కొంత ప్రతిఘటన చూపగా, చివర్లో షాహీన్ అఫ్రిదీ నాలుగు సిక్సర్లతో 16 బంతుల్లో 33* పరుగులు చేశాడు. భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3/18తో మరోసారి అదరగొట్టాడు. అక్షర్ పటేల్ 2/18, జస్ప్రిత్ బుమ్రా 2/28 వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి చెరో వికెట్ తీసి పాకిస్థాన్‌ను దెబ్బకొట్టారు.

36
ఛేజింగ్ లో భారత్ దూకుడు

భారత్ ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే దూకుడుగా సాగింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 13 బంతుల్లో 31 పరుగులు చేసి శుభారంభం ఇచ్చాడు. శుభ్‌మన్ గిల్ (10 పరుగులు) వెంటనే ఔటవగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లో 47* పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. తిలక్ వర్మ 31 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచాడు. శివం దూబే 10* పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పాకిస్థాన్ తరఫున అయూబ్ 3/35తో బౌలింగ్‌లో ఆకట్టుకున్నా, అది విజయం సాధించడానికి చాలలేదు. భారత్ 25 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది.

46
IND vs PAK: అదరగొట్టిన ప్లేయర్లు

• కుల్దీప్ యాదవ్ (భారత్): 4 ఓవర్లలో 3/18తో మిడిల్ ఓవర్లలో పాకిస్థాన్ ఇన్నింగ్స్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు.

• సూర్యకుమార్ యాదవ్ (భారత్): కెప్టెన్‌ నాక్ తో 47* పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

• అభిషేక్ శర్మ (భారత్): 31 (13 బంతులు)తో పవర్‌ప్లేలో భారత్ ఇన్నింగ్స్ ను దూకుడుగా ముందుక తీసుకెళ్లడు.

• సహిబ్‌జాదా ఫర్హాన్ (పాకిస్థాన్): 40 పరుగులు చేసి పాక్ జట్టులో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

• షాహీన్ అఫ్రిదీ (పాకిస్థాన్): 33* (16 బంతులు, 4 సిక్సర్లు)తో పాక్ స్కోరు 125 పరుగులు దాటేలా చేశాడు.

56
హార్దిక్ పాండ్యా, బుమ్రా ఆరంభంలోనే పాక్ ను దెబ్బకొట్టారు

మ్యాచ్ ప్రారంభంలోనే హార్దిక్ పాండ్యా తొలి బంతికే అయూబ్ ను డక్‌కు ఔటయ్యేలా చేశాడు. తరువాత బుమ్రా, హారిస్‌ను ఔట్ చేయడంతో పాకిస్థాన్ 6/2 కష్టాల్లో పడింది. 13వ ఓవర్‌లో కుల్దీప్ రెండు వికెట్లు తీసి పాక్ ఇన్నింగ్స్‌ను పతనం దిశగా మార్చాడు. భారత్ ఛేజ్‌లో మొదటి ఓవర్‌లోనే అభిషేక్ శర్మ, షాహీన్ బౌలింగ్‌లో వరుసగా ఫోర్, సిక్స్ బాది దూకుడుగా ఇన్నింగ్ ను మొదలుపెట్టాడు. చివరగా సూర్యకుమార్ యాదవ్ భారీ సిక్స్‌తో భారత్ కు విజయం అందించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత సూర్య మాట్లాడుతూ.. భారత సైనికులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్టు తెలిపారు.

66
ఇండియా vs పాకిస్తాన్ ఆసియా కప్ 2025 రికార్డులు

• భారత్‌కు ఇది పాకిస్థాన్‌పై ఆసియా కప్ టీ20ల్లో వరుసగా మూడో విజయం.

• కుల్దీప్ యాదవ్‌కు పాకిస్థాన్‌పై టీ20ల్లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ ను నమోదుచేశాడు.

• సూర్యకుమార్ యాదవ్, ఆసియా కప్ ఛేజ్‌లో పాకిస్థాన్‌పై కెప్టెన్‌గా 40+ నాటౌట్ చేసిన తొలి భారత ఆటగాడు.

• 127/9 – పాకిస్థాన్ భారత్‌పై ఆసియా కప్ టీ20ల్లో తొలిసారి ఇంత తక్కువ స్కోరు చేసింది.

• 7 వికెట్ల తేడా భారత్‌కు పాకిస్థాన్‌పై టీ20ల్లో అతిపెద్ద గెలుపు మార్జిన్‌కు సమంగా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories