Published : Sep 14, 2025, 11:17 PM ISTUpdated : Sep 14, 2025, 11:29 PM IST
India vs Pakistan Asia Cup 2025: ఆసియా కప్ 2025లో భాగంగా ఆదివారం భారత్ vs పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. దుబాయ్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత ప్లేయర్లు అద్భుతమైన ఆటతో పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించారు.
ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ పోరులో భారత జట్టు అన్ని విభాగాల్లో ఆధిపత్యం చూపించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో దుమ్మురేపింది. ఈ విజయంతో ఆసియా కప్ చరిత్రలో భారత్ మరోసారి పాకిస్తాన్‌పై తన దూకుడు ఆధిపత్యాన్ని నిరూపించింది.
25
టాస్ గెలిచి పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది
ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. పాక్ కు ఇది పెద్దగా కలిసి రాలేదు. ఉన్న పిచ్‌పై భారత బౌలర్లు ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించారు. పవర్‌ప్లేలోనే సైమ్ అయూబ్, మహ్మద్ హారిస్‌ను పెవిలియన్ పంపి పాకిస్తాన్‌పై ఒత్తిడి తెచ్చారు. మొదటి 10 ఓవర్లలో భారత్ బౌలర్లు 37 డాట్ బాల్స్ వేశారు.
35
భారత్ బౌలర్ల దెబ్బకు 127/9 కే పరిమితమైన పాకిస్తాన్
మిడిల్ ఓవర్లలో కూడా భారత బౌలర్లు అద్భుతంగా రాణించారు. మధ్య ఓవర్లలో పాకిస్తాన్ బ్యాటింగ్ పూర్తిగా కుప్పకూలింది. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కీలక వికెట్లు తీశారు. ఫఖర్ జమాన్ (17), కెప్టెన్ సల్మాన్ అఘా (3) త్వరగా వెనుదిరగగా, ఫర్హాన్ (40) కొంత ప్రతిఘటించినా నిలువలేకపోయాడు. కుల్దీప్ తన నాలుగు ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.
చివరి ఓవర్లలో షాహీన్ అఫ్రిదీ, ఫహీమ్ అష్రఫ్ కొంత ప్రతిఘటించినా, భారత బౌలర్లు రాణించడంతో పెద్ద స్కోర్ చేయలేకపోయింది. వరుణ్ చక్రవర్తి, బుమ్రా కీలక వికెట్లు తీశారు. దీంతో పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 127/9 స్కోరుకే పరిమితమైంది. మొత్తం మీద కుల్దీప్ యాదవ్ (3/18), అక్షర్ పటేల్ (2 వికెట్లు) భారత బౌలింగ్‌కి హైలైట్‌గా నిలిచారు.
అభిషేక్ శర్మ పాకిస్తాన్ ను షేక్ చేశాడు.. బౌండరీల వర్షం
ఆసియా కప్ 2025లో భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌లో యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన దూకుడు బ్యాటింగ్‌తో మరోసారి మెరిశాడు. 128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తరఫున శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన అభిషేక్ కేవలం 13 బంతుల్లో 31 పరుగుల సునామీ నాక్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో నాలుగు బౌండరీలు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. 238.46 స్ట్రైక్‌రేట్ తో ఆడిన ఈ ఇన్నింగ్స్ భారత జట్టుకు బలమైన ఆరంభాన్ని ఇచ్చింది.
షాహీన్ అఫ్రిదీ వేసిన తొలి ఓవర్‌లోనే అభిషేక్ ఒక బౌండరీ, ఒక సిక్స్ బాదాడు. దీంతో పాకిస్తాన్ స్టార్ పేసర్‌పై ఒత్తిడి పెరిగింది. తరువాత అయూబ్ బౌలింగ్‌లో కూడా వరుసగా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డు వేగం పెంచాడు.
అయితే నాలుగో ఓవర్‌లో అయూబ్ వేసిన క్యారమ్ బాల్‌ను లాంగ్ ఆఫ్ మీదుగా కొట్టగా.. అష్రఫ్ చేతికి క్యాచ్ గా చిక్కాడు. దీంతో అభిషేక్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత్ స్కోరు అప్పటికి 42/2గా ఉంది.
55
భారత్ కు విజయాన్ని ఖాయం చేసిన తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్
శుభ్ మన్ గిల్, అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత తిలక్ వర్మ, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ భారత్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. నిలకడగా ఆడుతూ భారత్ స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. తిలక్ వర్మ 31 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు.
కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ చివరి వరకు క్రీజులో ఉండి భారత్ కు విజయాన్ని అందించాడు. సూర్య 47 పరుగుల కెప్టెన్ ఇన్నింగ్స్ ను ఆడాడు. 131-3 (15.5 Ov) స్కోర్ తో 7 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది.