India: విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? శుభ్‌మన్ గిల్ ఏం చేయబోతున్నాడు?

Published : Jun 18, 2025, 07:53 PM IST

Team india: టెస్టు క్రికెట్ కు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో భారత జట్టులో విరాట్ కోహ్లి 4వ స్థానిన్ని భర్తీ చేసేది ఎవరు అనే కొత్త చర్చ మొదలైంది. ఈ స్థానికి చాలా ప్రాధాన్యత ఉంది? ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
అప్పుడు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ.. ఇప్పుడు ఎవరు?

Who will replace Virat Kohli: భారత జట్టు ప్రస్తుతం ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ తో భారత టెస్టు జట్టుకు కెప్టెన్ శుభ్ మన్ గిల్ ఎంపికయ్యాడు. వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ ఉన్నాడు. 

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ కొత్త సైకిల్ ను భారత్ ఈ సిరీస్ తోనే ప్రారంభిస్తోంది. అలాగే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి లెజెండరీ ప్లేయర్లు లేకుండా భారత్ జట్టు ఆడుతున్న తొలి విదేశీ టెస్టు సిరీస్ ఇది కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

మరీ ముఖ్యంగా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన తర్వాత భారత జట్టులో అతని స్థానాన్ని ఎవరు భార్తీ చేస్తారనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఇండియాలో భారత జట్టు కూర్పును గమనిస్తే గత కొన్నేండ్లుగా విరాట్ కోహ్లీ ఆడిన నాల్గో స్థానానికి చాలా ప్రాధాన్యత ఉంది.

26
భారత జట్టులో 4వ స్థానంలో ఆడిన కోహ్లీ, సచిన్

భారత టెస్టు జట్టులో నాల్గో స్థానంలో ఇదివరకు ఆడిన ప్లేయర్లు రికార్డుల మోత మోగించారు. పరుగుల వరద పారించారు. టీమిండియాకు అద్భుతమైన విజయాలు అందించారు. గతంతో ఈ స్థానంలో గత 33 ఏళ్లుగా సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేయడం విశేషం. 

ఈ ఇద్దరు ప్లేయర్లు 4వ స్థానంలో బ్యాటింగ్ చేసి అనేక రికార్డులు సాధించారు. గొప్ప ఇన్నింగ్స్ లను ఆడారు. భారత జట్టుకు ఎప్పటికీ గుర్తుండిపోయే కొన్ని నాక్ లు ఆడారు. భారత జట్టును విజయపథంలో నడిపించారు.

సచిన్ తర్వాత కోహ్లీ టీమిండియాలో 4వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. ఇప్పుడు కోహ్లీ లేకపోవడంతో కొత్త కెప్టెన్ శుభ్ మన్ గిల్ బ్యాటింగ్ ఆర్డర్ పై టీమ్ తో కలిసి ఆలోచనలు చేస్తున్నారు. అయితే, భారత టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ కీలక ప్రకటన చేశారు. 

జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే ఐదు టెస్టుల ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు జరిగిన ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పంత్ మాట్లాడుతూ.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నంబర్ 4గా బ్యాటింగ్ చేయనున్నట్లు ధృవీకరించారు.

సచిన్, కోహ్లీలు 4వ స్థానంలో బ్యాటింగ్ చేశారు. ఇప్పుడు అదే ప్లేస్ లో శుభ్ మన్ గిల్ బ్యాటింగ్ కు రానున్నాడు. రిషబ్ పంత్ తన స్వంత బ్యాటింగ్ స్థానం అయిన నంబర్ 5లో కొనసాగనున్నట్లు కూడా స్పష్టం చేశారు. గిల్ పై భారీ అంచనాలు పెట్టుకున్న భారత్ కు ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తాయో రావో వేచి చూడాలి.

కానీ, గిల్ వ్యూహాలు, అతని ఆటలో కొత్తగా కనిపిస్తున్న నైపుణ్యాలు గమనిస్తే గిల్ భారత జట్టును కొత్త శిఖరాలకు తీసుకెళ్తాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తోటి ప్లేయర్లకు ఆదర్శంగా నిలుస్తూ గిల్ నుంచి కెప్టెన్సీ ఇన్నింగ్స్ లు చూస్తామని చెబుతున్నారు.

36
భారత టెస్టు జట్టు: నంబర్ 3లో బ్యాటింగ్ కు వచ్చేది ఎవరు?

4వ స్థానంలో శుభ్ మన్ గిల్ బ్యాటింగ్ చేయనున్నాడు. అయితే, 3వ స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రిషబ్ పంత్ ప్రకారం.. “నంబర్ 3 స్థానంపై చర్చలు జరుగుతున్నాయి. గిల్ నంబర్ 4లో ఆడతారు. నేను నా స్థానం అయిన నంబర్ 5లో కొనసాగుతాను” అని పంత్ పేర్కొన్నారు.

మూడో స్థానం కోసం కొత్తగా జట్టులోకి వచ్చిన ప్లేయర్లు పోటీ పడుతున్నారు. ఈ స్థానం కోసం అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, సాయి సుదర్శన్ మధ్య పోటీ నెలకొంది. వీరిలో ఎవరు ఆఖరికి స్థానం దక్కించుకుంటారో మ్యాచ్ రోజు పిచ్ పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఎక్కువగా ఐపీఎల్ లో అదరిపోయే ఇన్న్నింగ్స్ లను ఆడిన సాయి సుదర్శన్ కు అవకాశాలు ఉన్నాయి.

46
భారత టెస్టు జట్టు: ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్-కేఎల్ రాహుల్

ఇదివరకు భారత టెస్టు జట్టుకు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసేవారు. అయితే, రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత ఓపెనింగ్ భాగస్వామ్యంగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో వీరిద్దరూ మంచి ప్రదర్శన చేశారు. 

కేఎల్ రాహుల్ ఇటీవల ఇంగ్లాండ్ లయన్స్‌పై సెంచరీతో అదరగొట్టాడు. యశస్వి జైస్వాల్ గత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. అలాగే, ఇంగ్లాండ్ పై జైస్వాల్ కు అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. ఇంగ్లాండ్ బాజ్ బాల్ కు జైస్వాల్ జైస్ బాల్ సమాధానంగా నిలిచిన సందర్భాలు ఇదివరకే చూశాం.

56
భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ గిల్ పై దినేష్ కార్తీక్ ఏమన్నారంటే?

భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.. “శుభ్ మన్ గిల్ ఇంకా భారత టెస్ట్ కెప్టెన్సీ బాధ్యత ప్రాముఖ్యతను పూర్తిగా గ్రహించలేదు. అతను ఒక సింహాల గూడు లోకి అడుగుపెడుతున్నాడు” అని పేర్కొన్నారు. అంటే టీమిండియా కెప్టెన్సీ తీసుకోవడం అంటే ఎలాంటి ఓత్తిడిని అధిగమించాలనే విషయాన్ని ఈ కామెంట్స్ స్పష్టం చేస్తున్నాయి.

ఇంగ్లాండ్ పర్యటనలో గిల్ ఇప్పటివరకు 3 టెస్టుల్లో 88 పరుగులే చేశాడు. 14.66 సగటుతో ఇంగ్లాండ్ గడ్డపై బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడ్డాడు. కార్తీక్ అభిప్రాయం ప్రకారం శుభ్ మన్ గిల్ తన కెప్టెన్సీకి ముందు తన బ్యాటింగ్‌పై దృష్టి పెట్లాల్సి ఉంటుంది.

“కెప్టెన్సీ గురించి ఫీల్డింగ్ సమయంలో మాత్రమే ఆలోచించు. బ్యాటింగ్ మీద దృష్టి పెట్టి, మొదటి టెస్ట్‌లో పరుగులు చేయడం అత్యవసరం. ఇది అతనితో పాటు జట్టులో కూడా కొత్త ఉత్సాహం నింపుతుంది” అని కార్తీక్ Sky Sports పోడ్‌కాస్ట్‌లో పేర్కొన్నారు.

66
ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు ఇదే

ఇంగ్లాండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్ & వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, షార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ క్రిష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ లు ఉన్నారు.

ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో భారత జట్టు ప్లేయింగ్ 11 అంచనా

 యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ / కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్ & వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, షార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.

ఈ జూన్ 20న ప్రారంభమయ్యే సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మార్పులతో పాటు శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీతో భారత జట్టు ప్రయాణంలో శకం ప్రారంభం కానుంది. టెస్ట్ కెప్టెన్‌గా తన తొలి ప్రయత్నంలోనే ఇంగ్లాండ్‌ వంటి బలమైన జట్టును ఢీ కొట్టబోతున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories