Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ కొత్త ఇన్నింగ్స్.. రెడిట్ కొత్త ప్రయాణం సూపర్ సిక్సర్ అవుతుందా?

Published : Jun 18, 2025, 06:19 PM IST

Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ ను రెడిట్ ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్ గా ప్రకటించింది. భారత క్రీడాభిమానులతో అనుబంధాన్ని మరింత బలపరిచేందుకు కీలక అడుగు వేసింది.

PREV
17
రెడిట్ సచిన్ టెండూల్కర్ కొత్త ప్రయాణం

Sachin Tendulkar: లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. రెడిట్ ప్రపంచవ్యాప్తంగా తన బ్రాండ్‌ను మరింత బలోపేతం చేసుకునే దిశగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను గ్లోబల్ బ్రాండ్ అంబాసడర్‌గా నియమించినట్లు బుధవారం (జూన్ 18, 2025) వెల్లడించింది.

 ఈ కొత్త ఇన్నింగ్స్ లో సచిన్ టెండూల్కర్, రెడిట్‌లోని క్రీడాభిమానుల కమ్యూనిటీలతో నేరుగా చర్చలో పాల్గొంటారు. ఆటపై తన అనుభవాలను, వ్యక్తిగత అభిప్రాయాలను, ప్రత్యేక కంటెంట్‌ను తన అధికారిక ప్రొఫైల్‌ ద్వారా పంచుకుంటారు.

27
రెడిట్ సంచలన నిర్ణయం.. సహజమైన అనుసంధానం

గాడ్ ఆఫ్ క్రికెట్ గా గుర్తింపు పొందిన సచిన్ టెండూల్కర్‌ను బృందంలోకి తీసుకోవడమనే నిర్ణయం ఆశ్చర్యకరమైనప్పటికీ, రెడిట్‌ ఫిలాసఫీకి సముచితంగా అనిపిస్తోంది. "నాకు క్రికెట్ అనేది ప్రజలతో ఉన్న స్వచ్ఛమైన అనుబంధమే" అని సచిన్ అన్నారు. "రెడిట్‌ను పరిచయం చేసుకుంటున్నప్పుడు, ఈ వేదికలోని కమ్యూనిటీలను ఏకం చేసే ఉత్సాహం స్పష్టంగా కనిపించిందని" తెలిపారు.

రెడిట్ అంతర్జాతీయ వ్యాపార విస్తరణ విభాగం వైస్ ప్రెసిడెంట్ దుర్గేశ్ కౌశిక్ మాట్లాడుతూ.. “ సచిన్ టెండుల్కర్.. ఈ పేరు క్రికెట్ ప్రపంచంలో ఎప్పటికీ మర్చిపోలేనిది. ఈ పేరు క్రికెట్ శ్రేష్ఠతకు ప్రతీక. అతడి ఆట శైలిలో ఉన్న సామర్ధ్యం అతన్ని సరిహద్దులను దాటి ప్రజల హృదయాలను ఆకర్షించే స్థాయికి తీసుకెళ్లింది" అన్నారు.

అలాగే, సచిన్ టెండూల్కర్ క్రికెట్ గ్రౌండ్ క్రీజులో ఉన్నపుడు అతడిపట్ల ఉన్న భక్తి, అభిమానుల మధ్య కమ్యూనిటీ భావాన్ని పెంపొందించిందని తెలిపారు.

37
బ్రాండ్ భాగస్వామ్యాల్లో విశ్వసనీయతకు గుర్తింపుగా సచిన్ టెండూల్కర్

సచిన్ టెండూల్కర్ ఇప్పటిదాకా అనేక ప్రముఖ బ్రాండ్‌లతో కలిసి పని చేశాడు. ఎంఆర్ ఎఫ్ (MRF), బూస్ట్, అడిదాస్ మొదలైన బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించాడు. ఇటీవల BMW ఇండియా, అపోలో టైర్స్, స్మార్ట్రాన్ వంటి ఆధునిక కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. 

టెక్నాలజీ ఆధారిత ప్లాట్‌ఫాంలతో సంబంధాలు పెంచుకోవడంలో అతని దృష్టి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ లిస్టులో Smaaash, Paytm First Games లాంటి సంస్థలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో, రెడిట్‌తో కలిసిన ఈ భాగస్వామ్యం కూడా వ్యాపార ఒప్పందం కంటే ఎక్కువగా భావిస్తున్నారు. మొత్తంగా రెడిట్ తో సచిన్ టెండుల్కర్ ప్రయాణం మరో ఇన్నింగ్స్‌ అని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

47
భారత మార్కెట్‌లో మరింతగా విస్తరణ లక్ష్యంలో రెడిట్

భారత్‌ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు ప్రధాన యుద్ధభూమిగా మారింది. వేల కోట్ల యువ జనాభా, ఆటల పట్ల ఆసక్తి, ఆన్‌లైన్ కంటెంట్ వినియోగంలో పెరుగుదల.. ఇవన్నీ భారత మార్కెట్‌ను కీలకంగా మార్చాయి. రెడిట్ ఇప్పటివరకు అమెరికాలో ప్రముఖమైన స్థానంలో ఉంది. ఇప్పుడు భారతదేశంలో తన విస్తరణ మార్గంలో వ్యూహాలతో ముందుకు సాగుతోంది.

Sensor Tower సమాచారం ప్రకారం, 2024 చివరి వరకు రెడిట్‌కు భారతదేశంలో నెలసరి యాక్టివ్ యూజర్లు 3.8 మిలియన్లు కాగా, రోజువారీ యాక్టివ్ యూజర్లు 1.3 మిలియన్లు. 2023తో పోలిస్తే ఇది దాదాపు 20% వృద్ధిగా నమోదైంది. 

అదే సమయంలో X (మునుపటి ట్విట్టర్) భారతదేశంలో 25 మిలియన్ MAUs కలిగి ఉంది. రెడిట్ యాప్ 2024లో భారతదేశంలో 3.5 మిలియన్ల డౌన్‌లోడ్‌లను రికార్డు చేయగా, Apple App Storeలో ‘న్యూస్’ విభాగంలో టాప్ 3లో నిలిచింది.

57
క్రీడల వేదికగా రెడిట్..భారీ సంఖ్యలో వ్యూస్‌

రాయిటర్స్ జూలై 2024 నివేదిక ప్రకారం, రెడిట్ క్రీడల విభాగంలో 2023-24లో 20.4 బిలియన్ స్క్రీన్ వ్యూస్ నమోదు చేసింది, ఇది గత ఏడాదితో పోలిస్తే 26% పెరుగుదలను నమోదుచేసింది. NFL, NBA, MLB, PGA Tour, నాస్కార్, ఇటలీకి చెందిన Serie A లాంటి క్రీడా సంస్థలతో కూడా రెడిట్ భాగస్వామ్యం కలిగి ఉంది.

ఈ క్రమంలో, సచిన్‌ టెండూల్కర్ ను గ్లోబల్ అంబాసిడర్‌గా నియమించడం, రెడిట్‌కు భారత మార్కెట్‌ను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు, విస్తరణను పెంచుకునేందుకు కొత్త అవకాశాలను కల్పించనుంది.

67
సచిన్‌తో రెడిట్‌ సిక్సర్ కొడుతుందా?

ప్రపంచ క్రీడల్లో సచిన్ టెండూల్కర్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. క్రికెట్ లో గాడ్ ఆఫ్ క్రికెట్ గా గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి చాలా కాలం అవుతున్నా టెండూల్కర్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కాబట్టి సచిన్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా చేసుకోవడం రెడిట్ కు క్రికెట్ గ్రౌండ్ లో లభించే సిక్సర్ లాంటిదని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ భాగస్వామ్యం విజయవంతమైతే, రెడిట్‌కు భారతీయ వినియోగదారుల్లో భాగస్వామ్యం మాత్రమే కాదు, భారతీయ డిజిటల్ సంభాషణలో ఒక ప్రత్యేక స్థానం కూడా లభించవచ్చు. దేశం మొత్తం అతడిని పిచ్‌కు వచ్చే ప్రతిసారి ఒక ఆశగా చూసింది. ఇప్పుడు అదే ఆశతో, డిజిటల్ ప్రపంచంలోనూ అతడి పాత్ర ప్రారంభమవుతోందని చెప్పవచ్చు.

77
గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్

అంతర్జాతీయ క్రికెట్ లో అసాధ్యం అనుకున్న అనేక అంశాలను సుసాధ్యం చేసిన సచిన్ టెండూల్కర్ అనేక రికార్డులు సాధించాడు. కొత్త రికార్డులు నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్ లో మొత్తం 34,357 పరుగులు చేశాడు. ఇది ఒక ప్రపంచ రికార్డు. అలాగే, అంతర్జాతీయంగా 100 సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్ టెండూల్కర్.

సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్ గణాంకాలు గమనిస్తే.. టెస్టు క్రికెట్ లో 200 మ్యాచ్ లను ఆడి 15,921 పరుగులు పూర్తి చేశాడు. 53.78 బ్యాటింగ్ సగటుతో 51 సెంచరీలు బాదాడు. అలాగే, 68 హాఫ్ సెంచరీలు కూడా కొట్టాడు. టెస్టుల్లో సచిన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 248* (నాటౌట్) పరుగులు.

ఇక వన్డేల్లో సచిన్ టెండూల్కర్ రికార్డులు గమనిస్తే.. మొత్తం 463 మ్యాచ్ లను ఆడి 18,426 పరుగులు చేశాడు. 44.83 బ్యాటింగ్ సగటుతో అతని ఆటతో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు బాదాడు. 

వ్యక్తిగత అత్యధిక స్కోరు 200* పరుగులను 2010లో దక్షిణాఫ్రికా మీద సాధించాడు. ఇక టీ20 క్రికెట్ లో ఒకే ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ ను ఆడాడు. ఆ మ్యాచ్ లో 10 పరుగులు చేశాడు. భారత జట్టు 2011లో వరల్డ్ కప్ గెలవడంతో సచిన్ కీలక పాత్ర పోషించాడు.

Read more Photos on
click me!

Recommended Stories