బంగ్లాదేశ్ సిరీస్‌లో సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసేది ఎవరు?

First Published | Sep 13, 2024, 11:17 PM IST

Cricket : భారత లెజెండరీ ప్లేయర్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డుకు ఎసరు పెట్టారు భారత ప్లేయర్లు. సచిన్ రికార్డును బ్రేక్ చేయడానికి పోటీ పడుతున్నారు. ఆ రికార్డు ఏంటి?  పోటీ ప‌డుతున్న ఆ భార‌త ప్లేయ‌ర్లు ఎవ‌రు? అనే వివ‌రాలు మీకోసం. 
 

Cricket : భార‌త జ‌ట్టు దాదాపు రెండు నెల‌ల త‌ర్వాత మ‌ళ్లీ క్రికెట్ గ్రౌండ్ లోకి దిగుతోంది. భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ 19 నుండి చెన్నైలోని ఏంఏ చిదంబరం స్టేడియంలో ప్రారంభం కానుంది.

ఈ సిరీస్‌లో భారత జట్టు సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి టెస్ట్ క్రికెట్ ఆడుతుండ‌గా, బంగ్లాదేశ్ జట్టు పాకిస్తాన్ ను త‌న సొంత గ్రౌండ్ లోనే చిత్తుగా ఓడించి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను గెలుచుకున్న ఫుల్ జోష్ లో ఉంది. ఇప్ప‌టికే బీసీసీఐ బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ కోసం భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. 

చాలా కాలం తర్వాత ఈ ఫార్మాట్‌లో అడుతుపెడుతున్నారు ర‌న్ మిష‌న్ విరాట్ కోహ్లీ, వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మ‌న్ రిషబ్ పంత్‌. దీంతో రాబోయే సిరీస్ లో ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్ల‌పై అందరి చూపు ప‌డింది. ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్ల‌తో పాటు భార‌త జ‌ట్టులోని ప‌లువురు బ్యాట‌ర్ల నుంచి భారీ ఇన్నింగ్స్ ల‌ను క్రికెట్ ల‌వ‌ర్స్ ఆశిస్తున్నారు. ఇదిలావుండ‌గా, ఈ సిరీస్ లో లెజెండ‌రీ ప్లేయ‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డుకు ఎస‌రు పెట్టారు భార‌త ప్లేయ‌ర్లు. 

Latest Videos


క్రికెట్ గాడ్ స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును బ్రేక్ చేయ‌డంపై భార‌త ప్లేయ‌ర్ల‌తో పాటు బంగ్లాదేశ్ ప్లేయ‌ర్లు కూడా దృష్టి సారించారు. ఈ మెగా రికార్డును 20 ఏళ్ల క్రితం సచిన్ టెండూల్కర్ సృష్టించారు. అదేమీటంటే.. భారత్-బంగ్లాదేశ్ మధ్య జ‌రిగిన ఒక‌ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్. 

2004-05లో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో 284 పరుగులు చేశాడు. అప్పటి నుంచి భారత్, బంగ్లాదేశ్ మధ్య 6 టెస్టు సిరీస్‌లు జరిగినా సచిన్‌ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేకపోయారు. రెండో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా అతని పేరిటే ఉంది. 2010లో స‌చిన్ రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో 264 పరుగులు చేశాడు.

ఈ రికార్డుతో పాటు భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో అత్యధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ గా కూడా స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డు సృష్టించాడు. భార‌త్-బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ లో 820 పరుగులతో స‌చిన్ టెండూల్క‌ర్ అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ గా కొన‌సాగుతున్నాడు. మ‌రి ఈ రెండు రికార్డుల‌ను బ్రేక్ చేయ‌డానికి పోటీ ప‌డుతున్న‌ది ఎవ‌రు? 

భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును భారత యంగ్ ప్లేయ‌ర్ యశస్వి జైస్వాల్ బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే జైస్వాల్ స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జ‌రిగిన సిరీస్ లో సంచ‌ల‌న ఇన్నింగ్స్ ల‌ను ఆడాడు. 

Cricketer virat

5 మ్యాచ్‌ల సిరీస్‌లో యశస్వి 2 డబుల్ సెంచరీలతో 700కు పైగా పరుగులు చేశాడు. ఇప్పుడు బంగ్లాదేశ్ సిరీస్ లో కూడా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేయాల‌ని చూస్తున్నాడు. బంగ్లాదేశ్‌పై కూడా అత‌ని గొప్ప ఫామ్‌లో కనిపించవచ్చు. యశ‌స్వి జైస్వాల్ తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా సచిన్ టెండూల్కర్ రికార్డుపై క‌న్నేశారు.

యశస్వి, రోహిత్, విరాట్ కాకుండా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టగల మరో ఇద్దరు బ్యాట్స్‌మెన్ లు కూడా ఉన్నారు. వారిలో రిషబ్ పంత్, శుభమన్ గిల్ ముందుంటారు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్లు ఫామ్‌లో ఉన్నప్పుడు తుఫాను వేగంలో ప‌రుగులు చేస్తారు. 

అయితే, 20 నెలల సుదీర్ఘ కాలం తర్వాత పంత్ మళ్లీ రెడ్ బాల్ క్రికెట్‌లోకి వస్తున్నాడు. దీంతో అతని ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. అదే సమయంలో గత కొంత కాలంగా ఈ ఫార్మాట్‌లో తడబడుతూ కనిపిస్తున్న గిల్‌పై కూడా అందరి చూపు ఉంటుంది.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ లు ఇదివ‌రకు బంగ్లాదేశ్‌తో టెస్ట్ మ్యాచ్‌లు ఆడారు. యశస్వి జైస్వాల్ రాబోయే సిరీస్ మొద‌టిది. ప్రస్తుత భారత జట్టులో బంగ్లాదేశ్‌పై అత్యధిక టెస్టు పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ. 6 మ్యాచ్‌ల్లో 437 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్ (2 మ్యాచ్‌లు-157 పరుగులు) రెండో స్థానంలో ఉన్నాడు. రిషబ్ పంత్ (2 మ్యాచ్‌లు-148 పరుగులు) మూడో స్థానంలో ఉన్నాడు. 

click me!