ధోనీ కాదు, రాహుల్ ద్రవిడ్ కాదు మ‌రి యువరాజ్ సింగ్ బెస్ట్ కెప్టెన్ ఎవ‌రు?

First Published | Sep 13, 2024, 9:34 PM IST

Yuvraj Singh's favourite captain : భారత క్రికెట్ జట్టు మాజీ వెటరన్ ఆల్ రౌండర్, యువరాజ్ సింగ్ తన అభిమాన కెప్టెన్ గురించి చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి. అయితే, యువ‌రాజ్ సింగ్ త‌న బెస్ట్ అభిమాన కెప్టెన్ గా లెజెండ‌రీ ప్లేయ‌ర్లు రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనిల‌ను తీసుకోలేదు. మ‌రి ఎవ‌రు?
 

MS Dhoni, Rahul Dravid, Yuvraj Singh,

Yuvraj Singh's favourite captain : యువ‌రాజ్ సింగ్.. భార‌త క్రికెట్ లో ఒక సంచ‌ల‌నం. అంత‌ర్జాతీయ క్రికెట్ లో టాప్ ఆల్ రౌండ‌ర్ల‌లో ఒకరు. అంత‌ర్జాతీయ వేదిక‌పై భార‌త‌కు అనేక అద్భుత‌మైన విజ‌యాలు అందించాడు. భార‌త క్రికెట్ కు మ‌ర‌పురాని క్ష‌ణాలు అందించాడు. క్రికెట్ స్టార్ ఎదగ‌డంతో పాటు క్యాన్స‌ర్ భూతంలో ఫైట్ చేసి గెలిచాడు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు.

భార‌త జ‌ట్టు ప‌లుమార్లు ఐసీసీ ట్రోఫీలు గెల‌వ‌డంలో యువ‌రాజ్ సింగ్ పోషించిన పాత్ర భార‌త క్రికెట్ ఎప్ప‌టికీ మ‌రిచిపోదు. అయితే, భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కు ఇష్ట‌మైన‌, త‌న అభిమాన బెస్ట్ కెప్టెన్ గురించి వెల్ల‌డించాడు. భారత క్రికెట్ జట్టు కోసం అతని అద్భుతమైన కెరీర్‌లో యువరాజ్ సింగ్ ప‌లువురు గొప్ప కెప్టెన్లతో ఆడాడు.

వారిలో భార‌త క్రికెట్ జ‌ట్టును మూడు ఫార్మాట్ల‌లో నెంబ‌ర్ వ‌న్ గా నిల‌బెట్టిన మహేంద్ర సింగ్ ధోనీల‌తో పాటు లెజెండ‌రీ ప్లేయ‌ర్లు రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీలు కూడా ఉన్నారు. అలాగే, ర‌న్ మిష‌న్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో కూడా యువరాజ్ సింగ్ భారత్ తరఫున క్రికెట్ ఆడాడు. 


అయితే, త‌న‌కు బెస్ట్ కెప్టెన్ గా విరాట్ కోహ్లీని గాని తీసుకోలేదు. ఎంఎస్ ధోనిని కూడా తీసుకోలేదు. అలాగే, రాహుల్ ద్ర‌విడ్ ను కూడా తీసుకోలేదు. వీరి కెప్టెన్సీలో యువ‌రాజ్ సింగ్ చాలా కాల‌మే ఆడాడు. మ‌రి యువ‌రాజ్ సింగ్ బెస్ట్ కెప్టెన్ ఎవ‌రు? 

యువరాజ్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో తన అభిమాన కెప్టెన్‌గా గురించి వెల్ల‌డించాడు. సంబంధిత  ఇంటర్వ్యూలో గంగూలీ, ధోనీ, ద్రవిడ్‌లలో ఎవరో ఒకరిని ఎన్నుకోవాలనీ, వారిలో 'బెటర్ కెప్టెన్' ఎవరో చెప్పమని అడిగారు.

Yuvraj with Rahul Dravid and Harbhajan Singh

2011 ప్రపంచకప్ విజేత యువరాజ్ ధోనీ నేతృత్వంలో చాలా సంవత్సరాలు ఆడానని చెప్పాడు. ధోని అద్భుత‌మైన కెప్టెన్ గా పేర్కొన్నాడు. కానీ, బెంగాల్ టైగ‌ర్, దాదా అంటూ ముద్దుగా పిలుచుకునే గంగూలీనే తన తొలి కెప్టెన్‌గా ఎంపిక చేసుకుంటానని యూవీ చెప్పాడు.

యువరాజ్ ఇంకా మాట్లాడుతూ, 'వారందరూ కెప్టెన్లుగా ఉన్నారు. ధోనీ, గంగూలీల నేతృత్వంలో చాలా కాలం ఆడాను. నేను గంగూలీ నాయకత్వంలో నా క్రికెట్ కెరీర్ ప్రారంభించాను, అందుకే నా మొద‌టి కెప్టెన్, బెస్ట్ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ' అని చెప్పాడు.

భార‌త అండ‌ర్-19 ప్రపంచ కప్ విజయంలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ (POTM)గా యువ‌రాజ్ సింగ్ ఎంపికైన త‌ర్వాత భార‌త సీనియ‌ర్ జ‌ట్టులోకి వ‌చ్చే అవ‌కాశం ల‌భించింది. యువరాజ్ 2000 ఐసీసీ నాకౌట్ ట్రోఫీకి (తరువాత ఛాంపియన్స్ ట్రోఫీగా పేరు మార్చారు) భారత జట్టుకు ఎంపికయ్యాడు. 

గంగూలీ కెప్టెన్సీలో యువరాజ్ కెన్యాపై రౌండ్ ఆఫ్ 16లో అరంగేట్రం చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో యువరాజ్ తన బ్యాట్ తో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. 80 బంతుల్లో 84 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి తాను జ‌ట్టుకు ఎంత అవ‌స‌ర‌మైన ప్లేయ‌ర్ అనే విష‌యాన్ని స్ప‌ష్టం చేశాడు. 

అప్ప‌టి నుంచి వెనుతిరిగి చూడ‌లేదు. భార‌త జ‌ట్టుకు అనేక అద్భుత విజ‌యాలు అందించ‌డంతో పాటు ఐసీసీ ట్రోఫీలు గెల‌వ‌డంలో యువ‌రాజ్ సింగ్ బ్యాట్, బాల్ తో కీల‌క పాత్ర పోషించాడు. 

ఎంఎస్ ధోని సారథ్యంలో 2007 లో టీ20 ప్ర‌పంచ క‌ప్ భారత్ అద్భుత విజయం సాధించడంలో యువరాజ్ కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లాండ్ స్టార్ బౌల‌ర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఒక ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి చ‌రిత్ర సృష్టించాడు ఈ మ్యాచ్ లో కేవ‌లం 30 బంతుల్లో 70 పరుగులు చేసి చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. 

యువీ ఇంగ్లండ్‌పై అతని అద్భుతమైన ప్రదర్శనతో 2007 టీ20 ప్రపంచ కప్ విజయానికి భారత స్టార్‌గా నిలిచాడు. 2011 ప్రపంచకప్‌లో కూడా యువరాజ్ అద్భుత ప్రదర్శన చేసి 28 ఏళ్ల తర్వాత భారత్‌ ప్రపంచకప్‌ గెలవడంలో పెద్ద పాత్ర పోషించాడు. అతను టోర్నమెంట్‌లో 362 పరుగులు చేశాడు. అలాగే, 15 వికెట్లు తీసుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచాడు.

Latest Videos

click me!