ప్రపంచంలోని అత్యంత భయంకరమైన బ్యాట్స్‌మెన్లు కూడా ఈ గొప్ప రికార్డులను బ్రేక్ చేయలేయలేరు !

First Published Sep 13, 2024, 10:16 PM IST

extraordinary cricket records : అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి ఎన్నో రికార్డులు నమోదయ్యాయి. మ‌ళ్లీ గ‌మ‌నిస్తే వాటిని బద్దలు కొట్టడం అసాధ్యం అనిపిస్తుంది. గొప్ప బ్యాట‌ర్లు కూడా సాధించ‌లేక‌పోయారు. అలాంటి అసాధార‌ణ‌మై గొప్ప బ్యాటింగ్ రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 
 

AB de Villiers, Virat Kohli , Rohit Sharma

extraordinary cricket records : అంతర్జాతీయ క్రికెట్ ను గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా మారిపోయింది. ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ లు ఆడుతూ అనేక రికార్డులు న‌మోద‌వుతున్నాయి. ఇప్పుడు టీ20 క్రికెట్, వన్డే క్రికెట్, టెస్టు క్రికెట్ ఇలా మూడు ఫార్మాట్లలో బ్యాట్స్‌మెన్ దంచికొడుతూ ప‌రుగుల వ‌ర‌ద‌తో సందడి చేస్తున్నారు.

Virat Kohli, RohitSharma

ఇలా అనేక రికార్డులు న‌మోద‌య్యాయి. చాలా రికార్డులు బ‌ద్ద‌లు కూడా అయ్యాయి. ఇదే స‌మ‌యంలో కొన్ని అసాధ్యం అనుకున్న ఇన్నింగ్స్ లు కూడా వ‌చ్చాయి.  కానీ, లెజెండ‌రీ ప్లేయ‌ర్లు సైతం బ్రేక్ చేయ‌ని రికార్డులు కూడా న‌మోద‌య్యాయి. 

ఇప్పుడు వాటిని గుర్తు చేసుకుంటే మ‌ళ్లీ జ‌రుగుతుందా? అనే ప్ర‌శ్న వ‌స్తుంది. ఈ రికార్డుల గురించి ఆలోచించిన తర్వాత కూడా వాటిని ఎప్పటికీ బద్దలు కొట్టలేమని అనిపిస్తుంది. బద్దలు కొట్టడం దాదాపు అసాధ్యం అయిన అలాంటి రికార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Latest Videos


264 పరుగుల రోహిత్ శ‌ర్మ తుఫాను ఇన్నింగ్స్

13 నవంబర్ 2014 క్రికెట్ చ‌రిత్ర‌లో ఎవ‌రూ ఊహించ‌ని రికార్డు న‌మోదైంది. భారత క్రికెట్‌లో ఈ రోజును ఎవరూ మర్చిపోలేరు. ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ రోజునే చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. 

ఆ రోజు రోహిత్ ఇన్నింగ్స్ ఆడే ముందు, వన్డే మ్యాచ్‌లో ఇలాంటిది జరుగుతుందని ఎవరూ ఊహించలేరు. శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో రోహిత్ డ‌బుల్ సెంచ‌రీ కొట్టాడు. ఏకంగా 264 పరుగులు చేసి వన్డే ఫార్మాట్‌లో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడి ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఒక ప్లేయ‌ర్ ఒక ఇన్నింగ్స్ లో సాధించిన అత్య‌ధిక స్కోర్ ఇదే. 

బ్రియాన్ లారా 400 పరుగులు*

అంతర్జాతీయ క్రికెట్‌లో గొప్ప బ్యాట్స్‌మెన్‌లలో బ్రియాన్ లారా ఒక‌రు. అనేక గొప్ప ఇన్నింగ్స్ లు ఆడిన లారా పేరు వినగానే అంద‌రికీ అతని 400 పరుగుల ఇన్నింగ్స్ గుర్తుకు వస్తుంది. ఈ వెస్టిండీస్ లెజెండ్ లారా ఏప్రిల్ 2004లో వెస్టిండీస్-ఇంగ్లండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో అజేయంగా 400 పరుగులు చేశాడు.

టెస్టు క్రికెట్ లో ఒక‌ బ్యాట్స్‌మెన్ సాధించిన అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోర్ ఇదే.  అలాగే, ఒక టెస్ట్ మ్యాచ్‌లో 400 పరుగులు చేసిన ప్రపంచంలోనే మొదటి, ఇప్ప‌టివ‌ర‌కు ఏకైక బ్యాట్స్‌మెన్ బ్రియాన్ లారా. 

Sahil Chauhan

27 బంతుల్లోనే సెంచరీ కొట్టిన సాహిల్ చౌహాన్

టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ విషయానికి వస్తే ఫాస్టెస్ట్ సెంచరీలు అన‌గానే ముందుగా గొప్ప‌గొప్ప లెజెండ‌రీ ప్లేయ‌ర్ల పేర్లు గుర్తుకు వ‌స్తాయి. కానీ, ఈ రికార్డును ఏ పెద్ద జట్టు బ్యాట్స్‌మెన్ చేయలేదు. సాహిల్ చౌహాన్ అనే బ్యాట‌ర్ ఎస్టోనియా తరపున ఆడుతున్నప్పుడు సైప్రస్‌పై కేవలం 27 బంతుల్లో సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. 

టీ20 అంతర్జాతీయ సెంచరీని అత్యంత వేగంగా సాధించిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో సాహిల్ 41 బంతులు మాత్రమే ఎదుర్కొని 18 సిక్సర్లతో 144 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో ఆరు ఫోర్లు కూడా ఉన్నాయి.

AB de Villiers

ఏబీ డివిలియర్స్ తుఫాను

ప్రపంచ క్రికెట్‌లో బ్యాట్ తో విధ్వంసం చేసే బ్యాట్స్‌మెన్‌లలో ఏబీ డివిలియర్స్ ఒకరు. ఈ దక్షిణాఫ్రికా లెజెండ్ 2015లో పెను తుఫాను సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్ ను క్రికెట్ అభిమానులు ఇప్ప‌టికీ మ‌ర్చిపోలేరు.. ఇప్పుడు చూసినా ఆశ్చర్యపోతారు. కేవలం 31 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. 

వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏబీ డివిలియ‌ర్స్ కేవలం 5.1 ఓవర్లలోనే సిక్సర్ల మోత మోగించి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో వ‌న్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీని సాధించిన బ్యాట్స్‌మన్ ఘ‌న‌త సాధించాడు. ఇప్ప‌టికీ ఈ రికార్డు ఏబీ డివిలియ‌ర్స్ పేరుతోనే ఉంది. ఈ మ్యాచ్‌లో డివిలియర్స్ 44 బంతులు ఆడి 16 సిక్సర్లు, 9 ఫోర్లతో అజేయంగా 149 పరుగులు చేశాడు.

click me!