టీమిండియా బెస్ట్ కెప్టెన్ ఎవరు? రోహిత్ శ‌ర్మ - ఎంఎస్ ధోనిలపై హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

First Published Oct 4, 2024, 10:08 AM IST

Team India : భార‌త క్రికెట్ లో ఎంఎస్ ధోని, రోహిత్ శ‌ర్మ‌లు గొప్ప ప్లేయ‌ర్లు. కెప్టెన్ గా భార‌త జ‌ట్టును ఉన్న‌త శిఖ‌రాల‌కు చేర్చారు. అయితే, వీరిద్ద‌రిలో బెస్ట్ కెప్టెన్ ఎవ‌రు? అనే విషయంపై హ‌ర్భ‌జ‌న్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 
 

Rohit Sharma,MS Dhoni

Team India : స్పోర్ట్స్ యారీకి ఇచ్చిన ప్ర‌త్యేక‌ ఇంటర్వ్యూలో భార‌త మాజీ స్టార్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ టీమిండియా, భార‌త ఆట‌గాళ్లు, భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి  (బీసీసీఐ) గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భార‌త క్రికెట్ టీ20 జ‌ట్టుకు సూర్య‌కుమార్ యాద‌వ్ ను కెప్టెన్ గా చేయ‌డం గురించి కూడా ప్ర‌స్తావించిన భ‌జ్జీ.. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణ‌యం షాక్ కు గురిచేసింద‌ని తెలిపాడు. ఇక హార్దిక్ పాండ్యాకు ఇది పెద్ద ఎదురుదెబ్బ‌గా పేర్కొన్నాడు.

MS dhoni - Team india

భార‌త క్రికెట్ లో రోహిత్-ధోని గొప్ప కెప్టెన్లు 

భార‌త క్రికెట్ లో ఎంఎస్ ధోని, రోహిత్ శ‌ర్మ‌లు గొప్ప ప్లేయ‌ర్లు. కెప్టెన్ గా భార‌త జ‌ట్టును ఉన్న‌త శిఖ‌రాల‌కు చేర్చారు. అయితే, వీరిద్ద‌రిలో బెస్ట్ కెప్టెన్ ఎవ‌రు? అని ప్ర‌శ్నించ‌గా హ‌ర్భ‌జ‌న్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మహేంద్ర సింగ్ ధోని భారతదేశానికే కాకుండా ప్రపంచానికే అత్యుత్తమ కెప్టెన్‌గా క్రికెట్ వ‌ర్గాలు పేర్కొంటాయి. ధోని కెప్టెన్సీలోనే భార‌త్ మూడు ఐసీసీ టైటిళ్లను గెలుచుకుంది. 

భార‌త్ కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మొదటి - ఏకైక కెప్టెన్ ఎంఎస్ ధోని. అతని నాయకత్వంలో టీమిండియా చాలా కష్టతరమైన మ్యాచ్‌లను కూడా గెలుచుకున్నందున ధోని కెప్టెన్సీపై అన్ని వ‌ర్గాల నుంచి ప్ర‌శంస‌లు వెల్లువెత్తాయి. ప్రతి ఆటగాడు అతని కెప్టెన్సీలో ఆడాలని కోరుకుంటాడు. 

Latest Videos


Rohit sharma - Indian team

ఇక రోహిత్ శ‌ర్మ విష‌యానికి వ‌స్తే భార‌త్ కు గొప్ప విజ‌యాలు అందించిన కెప్టెన్ గా గుర్తింపు పొందాడు. అత‌ని నాయ‌క‌త్వంలో టీమిండియా క్రికెట్ ఆట తీరును మార్చాడు. రోహిత్ శర్మ  మంచి కెప్టెన్ మాత్ర‌మే కాదు గొప్ప ప్లేయ‌ర్ కూడా. యువ ఆటగాళ్ళకు రోహిత్ అంటే చాలా గౌరవం. అయితే, కొంత మంది క్రికెట్ ల‌వ‌ర్స్ ఎంఎస్ ధోని, రోహిత్ శర్మల  కెప్టెన్సీని గురించి చాలా సార్లు పోలిక‌లను ప్ర‌స్తావించారు. 

ఎంఎస్ ధోని-రోహిత్ శ‌ర్మ ల‌లో గొప్ప కెప్టెన్ ఎవ‌రు? హ‌ర్భ‌జ‌న్ సింగ్ ఏం చేప్పారంటే?

ఇదే స‌మ‌యంలో ఎవ‌రు గొప్ప కెప్టెన్ అనే చ‌ర్చ కూడా సాగింది. ఇదే విష‌యం గురించి  ప్ర‌స్తావించిన హర్భజన్ సింగ్ తన స్టాండ్ ఏంటో చెప్పాడు. ధోనీ కంటే రోహిత్ శర్మ మెరుగ్గా ఉంటాడని భ‌జ్జీ అభిప్రాయపడ్డాడు. ధోని కంటే రోహిత్ శ‌ర్మ గొప్ప కెప్టెన్ అని కొనియాడాడు. స్పోర్ట్స్ యారీతో హర్భజన్ సింగ్ మాట్లాడుతూ రోహిత్ శర్మ-ధోనీలు అన్ని విధాలుగా ఒకే విధమైన పోలిక‌లు ఉన్న కెప్టెన్లని చెప్పాడు. కెప్టెన్లందరూ తమ సమయానికి భారత జట్టును ముందుకు తీసుకెళ్లి జట్టును మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తారు. ఈ విష‌యంలో ఇద్ద‌రు బెస్ట్ కెప్టెన్లు అని చెప్పాడు. 

Harbhajan Singh

అలాగే, "నా అభిప్రాయం ప్రకారం జట్టుకు విజయాలు అందుకోవ‌డం నేర్పించేవాడు మెరుగైన కెప్టెన్. మహేంద్ర సింగ్ ధోనీ చాలా విజయాలు సాధించాడు. అత‌ని కెప్టెన్సీ లో జట్టు చాలా బాగా ఆడింది. రోహిత్ శర్మ కూడా తక్కువ చేయలేదు. అతని విజయాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది రోహిత్ ను ధోనితో స‌మంగా నిల‌బెడుతుంది. కొన్ని విష‌యాల్లో ధోని  కంటే రోహిత్ మెరుగ్గా ఉంటాడ‌ని తెలిపాడు.  

కెప్టెన్ ఎవ‌రైనా భారత జట్టుగా ముందుకు సాగడం చాలా ముఖ్యమ‌ని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. "జట్టుకు ఎవరు కెప్టెన్ అయినా జట్టు ముందుకు సాగాలి, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో మేము ప్రపంచ కప్ గెలవకపోయినా, భారత జట్టు మనస్తత్వం చాలా మారిపోయింది. అతని కెప్టెన్సీలో భారత జట్టు నాల్గవ ఇన్నింగ్స్‌లో ఛేజింగ్‌కు సిద్ధంగా ఉంది. చివరి క్షణం వరకు పోరాడే శక్తిని కలిగివుంద‌ని" చెప్పాడు.

హర్భజన్ సింగ్ ఇంకా మాట్లాడుతూ  "ప్రతి కెప్టెన్ నాయకత్వంలో భార‌త‌ జట్టు ఆలోచనలో మార్పు వ‌చ్చింది. ధోనీ కెప్టెన్సీలో మార్పు ఉంది, కోహ్లీ కాలంలో మార్పు వచ్చింది, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆలోచనలో మార్పు వచ్చింది. ఇప్పుడు భారత జట్టు దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి. దీని కంటే మెరుగ్గా చేయాలని" పేర్కొన్నాడు. 

Rohit Sharma and Harbhajan Singh

రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్.. వినయం, దయగలవాడు : హర్భజన్ సింగ్

వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ రోహిత్ శ‌ర్మ ఎందుకు గొప్ప కెప్టెన్ అనే విష‌యాలు ప్ర‌స్తావిస్తూ.. "రోహిత్ శర్మ అద్భుతమైన కెరీర్ కలిగి ఉన్నాడు. టీ20 నుంచి వ‌న్డే, టెస్టు క్రికెట్ వ‌ర‌కు.. ఎప్పుడూ కూడా అత‌ను ఆట‌లో మార్పులను తీసుకువ‌స్తూనే ఉన్నాడు. అందరూ మెచ్చుకునే వారసత్వాన్ని సృష్టించాడు. అత‌ని కంటే ఎవరూ బాగా చేయలేదు. రోహిత్ ను విమర్శించవద్దు, అతను వినయం, దయగలవాడు. భారతదేశానికి గొప్ప కెప్టెన్. మైదానంలోనే కాదు వెలుపల కూడా రోహిత్ ఎప్పుడూ ప్రశాంతంగా, సాదాసీదాగా ఉంటాడు" అని హర్భజన్ చెప్పాడు.

ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో రోహిత్ ప్రదర్శన అద్భుతమని హర్భజన్ సింగ్ అన్నాడు. "రోహిత్ తన ఆలోచనలలో స్పష్టంగా ఉంటాడు. ఇతరులను అడగడం కంటే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటాడు" అని చెప్పాడు. ''రోహిత్ నెలకొల్పిన ఉదాహరణ అందరికీ స్ఫూర్తిదాయకం. అతను సంపాదించిన గౌరవం కారణంగా అతను లెజెండ్ అయ్యాడ‌ని" చెప్పాడు. ఆట‌లోనే కాదు స‌మాజంలో కూడా అత‌ని జీవ‌న శైలీ, న‌డ‌వ‌డి, సాధార‌ణ మ‌నిషిగా ఉంటే తీరు గొప్ప వ్య‌క్తిగా రోహిత్ ను నిల‌బెట్టాయ‌ని భజ్జీ రోహిత్ స్వీట్‌నెస్‌ను ప్రశంసించాడు. 

click me!