Who is Andy Pycroft : ఆసియా కప్ 2025లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన పేరు ఆండీ పైక్రాఫ్ట్. ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌కు పాకిస్థాన్‌తో చాలా చరిత్రనే ఉంది. ఆయన కెరీర్, వివాదాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఆసియా కప్ షేక్ హ్యాండ్ వివాదంతో ఆండీ పైక్రాఫ్ట్ హాట్ టాపిక్
ఆసియా కప్ 2025లో షేక్ హ్యాండ్ వివాదం కారణంగా ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ పేరు మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఆయనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్‌కు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపిస్తూ, ఆసియా కప్ మ్యాచ్‌లలో ఆయనను తొలగించాలని డిమాండ్ చేసింది. అయితే ఐసీసీ పాకిస్తాన్ డిమాండ్‌ను తిరస్కరించింది. పైక్రాఫ్ట్ యూఏఈతో జరిగిన పాకిస్థాన్ మ్యాచ్‌తో పాటు మిగతా టోర్నమెంట్‌లోనూ రిఫరీగా కొనసాగుతారని స్పష్టం చేసింది.
25
ఎవరీ ఆండీ పైక్రాఫ్ట్? ప్లేయర్ నుంచి రిఫరీ వరకు
ఆండీ పైక్రాఫ్ట్ జింబాబ్వే క్రికెటర్. 1983 జూన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశారు. 1992 నవంబర్ వరకు జింబాబ్వే తరఫున 3 టెస్టులు, 20 వన్డేలు ఆడారు. వన్డేల్లో 295 పరుగులు, టెస్టుల్లో 152 పరుగులు చేశారు. దేశీయ క్రికెట్‌లో 72 ఫస్ట్ క్లాస్, 100 లిస్ట్ ఏ మ్యాచ్‌లు ఆడారు. దేశవాళీ క్రికెట్ లో 4374 పరుగులు, లిస్ట్ ఏ క్రికెట్ లో 2576 పరుగులు సాధించారు. క్రికెట్ కు వీడ్కోలు చెప్పిన తర్వాత మ్యాచ్ రిఫరీగా మారారు.
35
మ్యాచ్ రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్
ఆండీ పైక్రాఫ్ట్ 2009 నుంచి ఐసీసీ మ్యాచ్ రిఫరీగా కొనసాగుతున్నారు. పైక్రాఫ్ట్ ఇప్పటివరకు 103 టెస్టులు, 284 వన్డేలు, 185 టీ20లు, 21 మహిళల టీ20లకు రిఫరీగా వ్యవహరించారు. దాదాపు అన్ని ప్రధాన టోర్నమెంట్లలో ఆయన ఉన్నారు. ఈ అనుభవంతో పాటు ఆయన పలు వివాదాస్పద ఘటనలతో కూడా పలుమార్లు హాట్ టాపిక్ గా మారారు.
పాకిస్థాన్ స్పిన్నర్ సయీద్ అజ్మల్ బౌలింగ్ యాక్షన్‌పై అనుమానం వచ్చినప్పుడు పైక్రాఫ్ట్ రిఫరీగా ఉన్నారు. ఆ తర్వాత అజ్మల్ యాక్షన్‌ను పలుమార్లు మార్చుకోవాల్సి వచ్చింది. ఇదే తరహాలో మహ్మద్ హఫీజ్ కూడా అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా ఆండీ పైక్రాఫ్ట్ చేతనే రిపోర్టును అందుకున్నారు. ఈ రెండు సందర్భాల్లోనూ పైక్రాఫ్ట్ రిఫరీగా వ్యవహరించారు.
55
ఆండీ పైక్రాఫ్ట్ క్రికెట్ వివాదాలు
2018లో ఆస్ట్రేలియా vs ధక్షిణాఫ్రికా మధ్య జరిగిన “సాండ్‌పేపర్ స్కాండల్” సమయంలో కూడా ఆయన మ్యాచ్ రిఫరీగా ఉన్నారు. ఆ ఘటన ప్రపంచ క్రికెట్‌లో సంచలనంగా మారింది. అలాగే 2024 డిసెంబర్ లో మెల్‌బోర్న్ టెస్టులో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా ఆటగాడు శామ్ కాంటాస్ ను తాకిన ఘటనపై కోహ్లీకి జరిమానా విధించింది కూడా పైక్రాఫ్ట్‌నే కావడం గమనార్హం.