ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన భారత్.. అమ్మాయిలు అదరగొట్టారు

Published : Sep 17, 2025, 09:11 PM IST

India Women vs Australia Women : స్మృతి మంధాన సెంచరీతో భారత్ మహిళల జట్టు 2వ వన్డేలో ఆస్ట్రేలియాపై 102 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో భారత్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

PREV
15
ఆస్ట్రేలియాపై భారత్ ఆల్ రౌండ్ షో

ఆస్ట్రేలియాను భారత్ చిత్తుగా ఓడించింది. ముల్లాన్‌పూర్ మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ మహిళల జట్టు ఆస్ట్రేలియాతో రెండో వన్డే మ్యాచ్ లో తలపడింది. ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుత ప్రదర్శన చేసి 102 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించింది.

25
స్మృతి మంధాన అద్భుత సెంచరీ నాక్

భారత్ ఇన్నింగ్స్‌లో స్మృతి మంధాన అదరగొట్టారు. ధనాధన్ బ్యాటింగ్ తో సెంచరీ సాధించారు. కేవలం 91 బంతుల్లో 117 పరుగుల నాక్ తో భారత జట్టు మంచి స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. మంధాన సెంచరీ ఇన్నింగ్స్ తో భారత్ 292 పరుగులు చేసింది. అలాగే, దీప్తి శర్మ 40 పరుగులతో విలువైన భాగస్వామ్యం అందించారు.

35
భారత్ బౌలర్ల ఆధిపత్యం

లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా జట్టు భారత్ బౌలింగ్ ముందు నిలవలేకపోయింది. రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి ఆసీస్ ఆటగాళ్లను తమ బౌలింగ్ తో దెబ్బకొట్టారు. రాధా యాదవ్, స్నేహ్ రాణా స్పిన్ బౌలింగ్‌తో పరుగులు రాకుండా అడ్డుకున్నారు. క్రాంతి గౌడ్ 3, దీప్తి శర్మ 2 వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో డార్సీ బ్రౌన్ 42 పరుగులకు 3 వికెట్లు తీసినా ఆ జట్టుకు ఫలితం దక్కలేదు. భారత్ బౌలర్లు వరుసగా వికెట్లు తీయడంతో ఆస్ట్రేలియా 190 పరుగులకే ఆలౌట్ అయింది.

45
ఆస్ట్రేలియా బ్యాటింగ్ కష్టాలు

ఆస్ట్రేలియా ఓపెనర్లు ప్రారంభంలో బాగానే ఆడినా, తరువాత క్రమంగా వికెట్లు కోల్పోయింది. ఫీబీ లిచ్‌ఫీల్డ్ 80 బంతుల్లో 88 పరుగులతో మంచి నాక్ ఆడారు. అయితే, ఎల్లీస్ పెర్రీ గాయం కారణంగా రిటైర్ హర్ట్ కావడంతో కంగారు టీమ్ కు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ మరింత నెమ్మదించింది. భారత్ బౌలర్లు ఒత్తిడిని కొనసాగించి 190 పరుగులకే కట్టడి చేశారు. టీమిండియా మహిళలు 102 పరుగుల తేడాతో ఆసీస్ పై విజయాన్ని సాధించారు.

55
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ స్మృతి మంధాన

ఈ గెలుపుతో భారత్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. చివరి వన్డే సిరీస్ ఫలితాన్ని నిర్ణయించనుంది. రాబోయే మహిళల వన్డే వరల్డ్ కప్ 2025కు ముందు ఈ విజయం భారత్ మహిళల జట్టుకు మానసిక బలాన్ని ఇచ్చింది. సెంచరీ నాక్ ఆడిన స్మృతి మంధాన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు.

Read more Photos on
click me!

Recommended Stories