ఆసియా కప్‌ : పాక్‌ నెట్‌ బౌలర్లకు దూరంగా భారత్.. ఎందుకంటే?

Published : Sep 17, 2025, 07:50 PM IST

India Cricket Team: షేక్‌ హ్యాండ్‌ వివాదం నేపథ్యంలో ఆసియా కప్‌లో భారత జట్టు ఆటగాళ్లకు పాక్‌ నెట్‌ బౌలర్లతో దూరం పాటించాలని కఠిన ఆదేశాలు జారీ అయ్యాయని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
16
షేక్‌ హ్యాండ్‌ వివాదం తర్వాత భారత జట్టుకు కొత్త ఆదేశాలు

ఆసియా కప్‌ 2025లో కొనసాగుతున్న షేక్‌ హ్యాండ్‌ వివాదం మరింత ముదురుతోంది. ఈ క్రమంలోనే తాజాగా భారత జట్టుకు కఠిన ఆదేశాలు అందినట్టు సమాచారం. మంగళవారం దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీకి చేరుకున్న సూర్యకుమార్‌ యాదవ్‌ నాయకత్వంలోని జట్టుకు, పాక్‌ నెట్‌ బౌలర్లతో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదని మేనేజ్‌మెంట్‌ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని పలు మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.

DID YOU KNOW ?
ఆసియా కప్ లో భారత్
ఇప్పటివరకు భారత్ 8 సార్లు ఆసియా కప్ ఛాంపియన్ గా నిలిచింది. 2025 టోర్నీలోనూ ట్రోఫీని సాధించాలని టార్గెట్ తో ముందుకు సాగుతోంది.
26
నెట్‌ బౌలర్లతో ఎందుకు దూరంగా ఉండమన్నారు?

ఐసీసీ అకాడమీలో పాక్, ఆఫ్ఘాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, భారత్‌ నెట్‌ బౌలర్లు ప్రాక్టీస్‌ కోసం అందుబాటులో ఉంటారు. గతంలో కూడా భారత ఆటగాళ్లు దేశం సంబంధం లేకుండా వారితో మాట్లాడేవారు. 2018/19 ఆస్ట్రేలియా టూర్‌లో హారిస్‌ రౌఫ్‌ భారత్‌ జట్టుకు నెట్‌ బౌలర్‌గా ఉండగా విరాట్‌ కోహ్లీతో సహా పలువురు ఆటగాళ్లతోనూ కలిశారు. కానీ ఈ సారి ఆ అవకాశం లేకుండా పోయింది. 

ఎందుకంటే పహాల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే, ఆసియా కప్ లో భారత్ – పాక్ మ్యాచ్ భారత ఆటగాళ్లు కరచాలనం చేయడానికి కూడా ఇష్టపడలేదు. దీని గురించి కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ముందే మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తాను షేక్ హ్యాండ్ ఇవ్వననీ, మిగతా ప్లేయర్లకు వారి ఇష్టమని పేర్కొంన్నారు.

36
మొబైల్‌ ఫోన్లపై కూడా ఆంక్షలు

జియో న్యూస్‌ నివేదిక ప్రకారం, పాక్ నెట్‌ బౌలర్లు ప్రాక్టీస్‌ సమయంలో మొబైల్‌ ఫోన్లు సమర్పించాల్సి ఉంటుంది. సెషన్‌ పూర్తైన తర్వాతే తిరిగి ఇస్తారు. అలాగే భారత ఆటగాళ్లు పాక్‌ నెట్‌ బౌలర్లతో మాట్లాడకూడదని, ఫోటోలు దిగకూడదని కఠినంగా ఆదేశాలు జారీ అయ్యాయని కూడా రిపోర్టులు పేర్కొన్నాయి.

46
ప్రాక్టీస్‌, ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ రద్దు

బుధవారం (సెప్టెంబర్‌ 17న) జరగాల్సిన మూడు గంటల ప్రాక్టీస్‌ సెషన్‌, ప్రీ-మ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ను భారత్‌ రద్దు చేసింది. బీసీసీఐ అధికారిక ప్రకటన ప్రకారం, ఆ రోజును విశ్రాంతి రోజుగా నిర్ణయించారు. ప్రాక్టీస్‌, ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ సమయాలు గురువారం వెల్లడిస్తామని బోర్డు తెలిపింది.

56
పాకిస్తాన్‌ పాల్గొనడంపై అనిశ్చితి

మరోవైపు పాకిస్తాన్‌ యూఏఈ మ్యాచ్‌లో ఆడుతుందా అన్న అనుమానాలు కొనసాగుతున్నాయి. రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తప్పించాలని పీసీబీ రెండోసారి ఐసీసీకి లేఖ రాసింది. కానీ ఐసీసీ ఈ డిమాండ్‌ను అంగీకరించలేదు. మధ్యవర్తిత్వం కోసం యూఏఈ బోర్డు అధికారులు జోక్యం చేసుకున్నారని సమాచారం. రిచీ రిచర్డ్సన్‌ను ఆ మ్యాచ్‌ రిఫరీగా నియమించే ప్రతిపాదన చర్చకు వచ్చినా, తుది నిర్ణయం స్పష్టంగా తెలియరాలేదు.

66
స్పాన్సర్లు, టికెట్ల హోల్డర్ల ఆందోళన

పీసీబీ బహిష్కరణ హెచ్చరికతో స్పాన్సర్లు, టికెట్‌ హోల్డర్లకు సమస్యలు తలెత్తే అవకాశముందని యూఏఈ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల సమస్య పరిష్కారం కోసం ఐసీసీ, పీసీబీ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఆసియా కప్‌ భవిష్యత్తుపై ఈ వివాదం ప్రభావం చూపనుంది. పాక్ మ్యాచ్ ను ఆడకపోతే టోర్నీ నుంచి అవుట్ అవుతుంది. యూఏఈ సూపర్ ఫోర్ కు చేరుంది. ఇప్పటికే ఈ గ్రూప్ నుంచి భారత్ సూపర్ ఫోర్ కు చేరుకుంది.

Read more Photos on
click me!

Recommended Stories