century on his odi debut: అంతర్జాతీయ క్రికెట్ లో అసాధ్యం అనుకున్న రికార్డులను సుసాధ్యం చేశారు పలువురు ప్లేయర్లు. అలాంటి రికార్డుల్లో వన్డే క్రికెట్ అరంగేట్రంలోనే సెంచరీ కొట్టిన భారత ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
century on his odi debut: అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో అరంగేట్రం అంటే ఎప్పుడూ ఒక ప్రత్యేక అనుభవం. జాతీయ జెర్సీ వేసుకొని తొలి అడుగు వేయడం, ఆటగాడి జీవితంలో ఎంతో భావోద్వేగం నింపుతుంది. అయితే, అటువంటి అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ కొడితే.. అది అసాధారణం.. కొత్త చరిత్ర. వన్డే అరంగేట్రంలోనే సెంచరీ కొట్టిన ప్లేయర్లు కొద్దిమందే వున్నారు. ఈ ప్రత్యేక లిస్టులో భారత ప్లేయర్ కూడా ఉన్నాడు.
25
వన్డేల్లో తొలి మ్యాచ్ లోనే సెంచరీ కొట్టిన ప్లేయర్లు
ఈ అరుదైన ఘనత సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఇంగ్లాండ్ నుంచి డెనిస్ అమ్మిస్, వెస్టిండీస్ నుంచి డెస్మండ్ హేన్స్, న్యూజిలాండ్ నుంచి మార్టిన్ గప్టిల్, పాకిస్తాన్ నుంచి ఇమామ్ ఉల్ హక్, ఇంకా మన భారతదేశం నుంచి కేఎల్ రాహుల్ వంటి ఆటగాళ్లు ఉన్నారు.
35
KL రాహుల్: భారత అభిమానుల గర్వకారణం
భారత క్రికెట్ అభిమానులకు గర్వకారణంగా నిలిచిన కేఎల్ రాహుల్, 2016లో జింబాబ్వేపై తన వన్డే అరంగేట్రంలోనే 100 నాటౌట్ పరుగులు చేసి చరిత్రలోకి అడుగుపెట్టారు. ఇది అంతర్జాతీయ వేదికపై భారత ఆటగాడు చేసిన అద్భుతమైన క్రికెట్ అరంగేట్రం.
కేఎల్ రాహుల్ సెంచరీ ప్రయాణం చరిత్రలో నిలిచిపోతుంది. మొత్తంగా కేఎల్ రాహుల్ ఇప్పటివరకు 85 మ్యాచ్ లలో 79 ఇన్నింగ్స్ లను ఆడి 49.08 సగటుతో 3043 పరుగులు చేశాడు. ఇందులో 18 హాఫ్ సెంచరీలు, 7 సెంచరీలు ఉన్నాయి.
వెస్టిండీస్ కు చెందిన డెస్మండ్ హేన్స్ చేసిన 148 పరుగులు ఇప్పటికీ అరంగేట్రం మ్యాచుల్లో అత్యధిక స్కోర్‌లలో ఒకటిగా నిలచింది. అలాగే, జింబాబ్వే క్రికెటర్ ఆండీ ఫ్లవర్ 1992లో శ్రీలంకపై 115 పరుగులతో అరంగేట్రం అదిరిపోయింది. న్యూజిలాండ్ క్రికెటర్ మైకేల్ బ్రేస్‌వెల్ 2022లో నెదర్లాండ్స్‌పై 127 పరుగులు చేసి ఈ జాబితాలోకి చేరిన తాజా ఆటగాడిగా నిలిచాడు.
55
వన్డేలో తొలి మ్యాచ్ సెంచరీ ఎందుకు ప్రత్యేకం?
ఒక ఆటగాడు తన తొలి వన్డే మ్యాచ్‌లోనే సెంచరీ కొట్టడం కేవలం గొప్ప రికార్డు మాత్రమే కాదు.. మానసిక ధైర్యానికి, అతని నైపుణ్యానికి కూడా నిదర్శనం. అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి అడుగుపెడుతున్నప్పటికీ ఒత్తిడిని జయించి, పెద్ద ఇన్నింగ్స్ ఆడడం అత్యద్భుతం.