ఎన్నిసార్లు విఫలమైనా రహానేకు మరో ఛాన్సిస్తాం : విక్రం రాథోడ్.. మరి విహారి సంగతేంటి అంటున్న టీమిండియా ఫ్యాన్స్

First Published Jan 12, 2022, 4:26 PM IST

Vikram Rathour Backs Ajinkya Rahane:  టీమిండియా మాజీ టెస్టు సారథి రహానే కు ఇప్పటికే టీమ్ మేనేజ్మెంట్  బోలెడన్ని అవకాశాలిచ్చింది. అయినా అతడు వరుసగా విఫలమవుతూనే ఉన్నాడు. 
 

టీమిండియా సీనియర్ ఆటగాడు, టెస్టులలో మాజీ సారథి అజింక్యా రహానేకు ఇప్పటికే లెక్కకు మించిన అవకాశాలిచ్చినా అతడి ఆటతీరులో మార్పులేదు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో చూపించిన తెగువ, మిడిలార్డర్ లో అతడు ఆడిన కీలక ఇన్నింగ్స్ గత కొద్దికాలంగా మిస్ అయ్యాయి. 

గడిచిన ఏడాది కాలంగా టెస్టులలో అతడి బ్యాటింగ్ సగటు 20 కి మించలేదు.  దీంతో పాటు  అతడు  తప్పక రాణిస్తాడని భావించిన స్వదేశంలోని న్యూజిలాండ్ సిరీస్ తో పాటు ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా రహానే దారుణంగా విఫలమవుతున్నాడు. 
 

రహానే అత్యంత పేలవంగా ఆడుతున్నా  టీమ్ యాజమాన్యం అతడికి బోలెడన్నీ అవకాశాలు ఇస్తుంది. అతడితో పాటు ఛతేశ్వర్ పుజారా కూడా వరుసగా విఫలమవతున్నా ఈ ఇద్దరిపై వేటు వేయలేదు. 
 

కాగా ఇదే విషయమై తాజాగా భారత బ్యాటింగ్ కోచ్  విక్రమ్ రాథోడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రహానే విఫలమైనా కూడా అతడికి మరిన్ని ఛాన్సులు ఇస్తామని వ్యాఖ్యానించాడు. 
 

రాథోడ్ మాట్లాడుతూ.. ‘నెంబర్లు (రహానే చేసిన స్కోరు) మాకు ముఖ్యం కాదు. నెట్స్ లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రహానే బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు.   ఈ సిరీస్ లో కూడా రహానే  బాగానే రాణించాడు. 

అయితే ఇక్కడ వస్తున్న ఒకే సమస్య..  మంచి ఆరంభాలను  భారీ స్కోర్లుగా మలచలేకపోవడం.. దీనిని  రహానే త్వరగానే అధిగమిస్తాడని భావిస్తున్నాం..

మేం (టీమ్ మేనేజ్మెంట్) అతడికి మద్దతుగా ఉన్నాం. ఒక మంచి ఇన్నింగ్స్ తో రహానే తిరిగి ఫామ్ ను అందుకుంటాడని మేం నమ్ముతున్నాం. అతడికి మరో ఛాన్సు ఇస్తామని నేను అతడికి హామీ ఇస్తున్నాను...’ అని అన్నాడు. 
 

రాథోడ్ వ్యాఖ్యలపై భారత అభిమానులు మండిపడుతున్నారు. రహానే కు ఇన్ని అవకాశాలిస్తున్న టీమిండియా యాజమాన్యం.. టెస్టులలో నిలకడగా రాణిస్తున్న హనుమ విహారిని ఎందుకు పక్కకు పెడుతుందని  ప్రశ్నిస్తున్నారు. విహారితో పాటు న్యూజిలాండ్ తో కాన్పూర్ టెస్టులో సెంచరీ చేసిన శ్రేయస్ అయ్యర్ ను ఎందుకు పక్కనబెడుతుందని మండిపడుతున్నారు.

దక్షిణాఫ్రికా పర్యటనలో విహారిని ఎంపిక చేసినా తొలి టెస్టులో అతడికి అవకాశం రాలేదు. రెండో టెస్టులో  సారథి కోహ్లి గాయపడటంతో విహారికి ఛాన్సు ఇచ్చారు. మళ్లీ మూడో టెస్టులో అతడిని పక్కనబెట్టారు. దీనిపై టీమిండియా అభిమానులు..  భారత  క్రికెట్ జట్టు యాజమాన్యంపై  విమర్శలు గుప్పించారు. 

ఈ సిరీస్ లో తొలి టెస్టులో విఫలమైన రహానే.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయ్యాడు. కానీ రెండో ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇక కేప్టౌన్ లో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్సులో 12 బంతుల్లో 9 పరుగులే చేసి రబాడ బౌలింగ్ లో నిష్క్రమించాడు. 

ఈ సిరీస్ లో తొలి టెస్టులో విఫలమైన రహానే.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయ్యాడు. కానీ రెండో ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇక కేప్టౌన్ లో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్సులో 12 బంతుల్లో 9 పరుగులే చేసి రబాడ బౌలింగ్ లో నిష్క్రమించాడు. 

click me!