టీమిండియా స్టార్ సూర్య‌కుమార్ యాద‌వ్ బోల్డ్ కామెంట్స్ వైర‌ల్

First Published | Aug 11, 2024, 1:28 PM IST

Suryakumar Yadav : టీమిండియా స్టార్ హిట్ట‌ర్ సూర్యకుమార్ యాదవ్ భారత్ తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అయితే, ప్ర‌స్తుతం సూర్యను టీ20లకు మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇటీవల మంచి ప్రదర్శనలు చేసినప్పటికీ వన్డే జట్టులో చోటు దక్కలేదు.
 

Suryakumar Yadav

Suryakumar Yadav : భారత క్రికెట్‌లో మాజీ ఓపెన‌ర్ గౌతమ్ గంభీర్ మెన్ ఇన్ బ్లూకు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడంతో భారత క్రికెట్ లో కొత్త శకం ప్రారంభమైంది. గంభీర్ నాయ‌క‌త్వంలో భార‌త్ జ‌ట్టు శ్రీలంక ప‌ర్య‌ట‌నలో తొలి సిరీస్ ఆడింది. టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ నియమితులయ్యారు. 

Suryakumar Yadav

పొట్టి ఫార్మాట్ లో భార‌త జ‌ట్టును సూర్య‌కుమార్ యాద‌వ్ విజ‌య‌వంతంగా న‌డిపించాడు. శ్రీలంక ప‌ర్య‌ట‌న‌లో టీ20 సిరీస్ ను అందించాడు. కానీ, సూర్య‌ను కేవ‌లం టీ20కే ప‌రిమితం చేశాడు.. వ‌న్డే, టెస్టు టీమ్ లోకి తీసుకోవ‌డంలో లెక్టర్‌లు అత‌నివైపు చూడ‌టం లేదు. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ తాను 3 ఫార్మాట్‌లలో ఆడ‌ల‌నుకుంటున్న త‌న ఉద్దేశాన్ని స్పష్టం చేశాడు.

Latest Videos


Suryakumar Yadav

ఇటీవ‌ల ఒక మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ.. క్రికెట్ 3 ఫార్మాట్‌లలో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకుంటున్నట్లు పేర్కొన్నాడు. "భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడాలనుకుంటున్నాను. బుచ్చిబాబు టోర్నీలో ఆడడం వల్ల ఈ సీజన్‌లో రెడ్ బాల్ టోర్నీలకు మంచి ప్రాక్టీస్ లభిస్తుందని" సూర్య అన్నాడు. అంతకుముందు, ప్రస్తుతం సూర్యను టీ20 ప్లేయర్‌గా సెలక్షన్ కమిటీ పరిశీలిస్తోందనీ, శ్రీలంకతో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లో అతను స్థానం కోసం పోటీలో లేడని భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు.

Rohit Sharma, Suryakumar Yadav,

శ్రీలంక సిరీస్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో అగార్కర్ మాట్లాడుతూ.. "లేదు, మేము ఈ సమయంలో సూర్యను వన్డేలు ఆడించాల‌నే చ‌ర్చించ‌లేదు. ఎందుకంటే శ్రేయాస్ అయ్యర్ తిరిగి వచ్చారు.. కేఎల్ రాహుల్ తిరిగి వచ్చారు. వ‌న్డేల్లో మంచి ట్రాక్ రికార్డు ఉంది వారికి. కాబట్టి సూర్య‌ను ప్ర‌స్తుతం టీ20 ప్లేయ‌ర్ గా చూస్తున్నామ‌ని" తెలిపాడు. 

కాగా, సూర్య‌కుమార్ యాద‌వ్  గత సంవత్సరం వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ సందర్భంగా చివరిసారిగా భారత వ‌న్డే జ‌ట్టులో భాగంగా ఉన్నాడు. ఆశించిన స్థాయిలో రాణించ‌క‌పోవ‌డం, పెద్ద ఇన్నింగ్స్ లు ఆడ‌ని కార‌ణంగా అత‌ని వైపు సెల‌క్ట‌ర్లు చూడ‌టం లేదు. 33 ఏళ్ల బ్యాటర్ ఇప్పటివరకు ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడాడు. 2023లో విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో అరంగేట్రం చేశాడు. ఇక మూడు ఫార్మాట్లలో తనను జట్టులోకి తీసుకోవాలనే స్టేట్ మెంట్ ను సెలక్టర్లు పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి.. !

click me!