ఐపీఎల్ 2025లో బిగ్ ఛేంజెస్.. రెండు ఛాంపియన్ జట్లకు కొత్త కోచ్‌లు

First Published | Aug 11, 2024, 10:14 AM IST

IPL 2025: రాబోయే ఐపీఎల్ సీజన్ కు ముందు కోచ్ పదవి నుంచి ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ రికీ పాంటింగ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తొలగించింది. అలాగే, పంజాబ్ కింగ్స్ ట్రెవర్ బేలిస్‌తో తన ఒప్పందాన్ని పొడిగించలేదు. ఇలా రాబోయే ఐపీఎల్ సీజన్ లో చాలానే మార్పులు కనిపించనున్నాయి. 
 

Virat Kohli, RohitSharma, Gill

IPL 2025: ఐపీఎల్ 2025 కోసం అన్ని జట్లు సన్నాహాలు ప్రారంభించాయి. ఈ క్ర‌మంలోనే చాలా జ‌ట్ల‌లో బిగ్ ఛేంజెస్ తీసుకువ‌స్తున్న సూచ‌న‌లు పంపుతున్నాయి. కోచ్, కెప్టెన్, ప్లేయ‌ర్లు ఇలా చాలానే మార్పుల‌ను ఐపీఎల్ 2025లో చూడ‌వ‌చ్చు. ఇప్ప‌టికే పంజాబ్ కింగ్స్ ట్రెవర్ బేలిస్‌తో తన ఒప్పందాన్ని పొడిగించలేదు. ఐపీఎల్ 2024 తో బేలిస్ కాంట్రాక్ట్ గడువు ముగిసింది. మరోవైపు కోచ్ పదవి నుంచి ఆస్ట్రేలియా వెటరన్ క్రికెటర్ రికీ పాంటింగ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ తొలగించింది. 

Gautam Gambhir

ఈ రెండు జట్లతో పాటు రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా కొత్త కోచ్ ల కోసం చూస్తున్నాయి. ఈ ఏడాది కోల్‌కతా ట్రోఫీని గెలుచుకుంది. దానికి మెంటార్ ఉన్న‌ గౌతమ్ గంభీర్ ఇప్పుడు జట్టులో లేరు. అలాగే, బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ కూడా టీమ్ ఇండియాలో అసిస్టెంట్ కోచ్‌గా చేరాడు. ఇలాంటి పరిస్థితుల్లో కోల్‌కతా కేవలం మెంటార్‌ కోసమే కాకుండా బ్యాటింగ్ కోచ్ కోసం కూడా వెతుకుతోంది. జట్టు ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్ ఇప్పటికీ తన పదవిలో కొనసాగుతున్నాడు.

Latest Videos


Ashish Nehra, hardik pandya

గుజరాత్ టైటాన్స్‌లో కూడా మార్పులు క‌నిపించ‌నున్నాయి. గుజరాత్ జట్టు 2022 ఐపీఎల్‌తో ఎంట్రీ ఇచ్చింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కోచ్ ఆశిష్ నెహ్రా నేతృత్వంలో మొదటి సీజన్‌లో ట్రోఫీని గెలుచుకుని చ‌రిత్ర సృష్టించింది. త‌ర్వాతి సీజన్‌లో ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే, 2024 సీజ‌న్ లో హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు మార‌డంతో గుజరాత్ కెప్టెన్సీని శుభ్‌మన్ గిల్‌కు అప్పగించింది. గుజ‌రాత్ ప్రధాన కోచ్ ఆశిష్ నెహ్రా, మెంటార్-బ్యాటింగ్ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్. కిర్‌స్టన్ ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు వ‌న్డే, టీ20 కోచ్‌గా ఉన్నారు.

Shubman Gill IPL

క్రిక్‌బజ్ నివేదికల‌ ప్రకారం, గుజరాత్ టైటాన్స్ కూడా రాబోయే సీజన్‌లో తన కోచింగ్ సిబ్బందిని మార్చాలని ఆలోచిస్తోంది. నెహ్రా స్థానంలో కొత్త వారు రానున్నార‌ని స‌మాచారం. యువరాజ్ సింగ్‌ను ప్రధాన కోచ్‌గా నియమించాలని ఫ్రాంఛైజీ భావిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రీసెంట్ గా వస్తున్న వార్తలను చూస్తుంటే నెహ్రా కు వీడ్కోలు ప‌ల‌క‌డం ఖాయంగా భావిస్తున్నారు. 

Shah Rukh Khan , Rahul Dravid

ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ECB)  వ‌న్డే-టీ20 జట్టు కోసం కుమార సంగక్కరను కోచ్ గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి ప‌రిస్థితుల్లో రాజస్థాన్ రాయల్స్ ప్రధాన కోచ్ పదవి ఖాళీ కావచ్చు. తాజా నివేదిక‌ల ప్ర‌కారం.. సంగక్కర స్థానంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు భారత మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌ను తీసుకోవాల‌ని చూస్తోంది. ఇదివ‌ర‌కు ద్రవిడ్ కెప్టెన్‌గా, కోచ్‌గా వ్యవహరించాడు. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టును విజయపథంలో నడిపించాడు. ద్రవిడ్ ప్రస్తుతం ఏ జాతీయ జట్టుకు కోచ్‌గా లేడు. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ కు సరైన ఎంపికగా భావిస్తోంది. 

click me!