Triple Century Destroys Pakistan: 2004లో పాకిస్తాన్‌పై వీరేంద్ర సెహ్వాగ్ చేసిన 309 పరుగుల ట్రిపుల్ సెంచరీతో భారత్ చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయం సాధించింది. పాకిస్తాన్ ను భారత ప్లేయర్ చితక్కొట్టిన ఆ క్షణాలు క్రికెట్ లో ఎప్పటికీ గుర్తుంటాయి.
2004 మార్చి 29న ముల్తాన్ మైదానంలో భారత క్రికెట్ జట్టు చరిత్రను తిరగరాసింది. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో భారత జట్టు పాకిస్తాన్ పర్యటనలో ముల్తాన్ టెస్ట్ మ్యాచ్ అత్యంత స్మరణీయంగా నిలిచింది.
49 సంవత్సరాల తర్వాత తొలిసారిగా భారత జట్టు పాకిస్తాన్ గడ్డపై టెస్ట్ సిరీస్‌ను గెలిచింది. ఈ ఘన విజయానికి ప్రధాన కారకుడు ఎవరో తెలుసా? అతను ఎవరో కాదు, భారత్‌కు తొలి టెస్ట్ ట్రిపుల్ సెంచరీని అందించిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.
27
సెహ్వాగ్ దెబ్బకు పాక్ బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు
వీరేంద్ర సెహ్వాగ్ ఆ మ్యాచ్‌లో 375 బంతుల్లో 309 పరుగులు చేశాడు. ఈ ధనాధన్ ఇన్నింగ్స్‌లో 39 బౌండరీలు, 6 సిక్సర్లు బాదాడు. ప్రత్యర్థి బౌలర్లు తన వికెట్ కోసం ఎంత ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. సెహ్వాగ్ ముందు పాకిస్తాన్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. ఈ ఇన్నింగ్స్ అనంతరం సెహ్వాగ్‌కు ‘ముల్తాన్ కా సుల్తాన్’ అనే బిరుదు లభించింది.
37
సెహ్వాగ్ దెబ్బకు పాక్ బౌలర్ కెరీర్ ఖతం
ఆ మ్యాచ్‌లో పాకిస్తాన్ తరఫున షోయబ్ అక్తర్, సక్లైన్ ముస్తాక్, అబ్దుల్ రజాక్, షబ్బీర్ అహ్మద్ బౌలింగ్ చేశారు. అయితే వీరెవ్వరూ సెహ్వాగ్ బ్యాటింగ్ పవర్ ను అడ్డుకోలేకపోయారు.
ప్రత్యేకంగా సక్లైన్ ముస్తాక్ విషయం చెప్పుకోవాల్సిందే. సెహ్వాగ్ తన ట్రిపుల్ సెంచరీ సక్లైన్ బౌలింగ్‌లో సిక్సర్‌తో పూర్తి చేశాడు. ఆ మ్యాచ్ తరువాత సక్లైన్ ముస్తాక్ ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో కనిపించలేదు. సెహ్వాగ్ ఇన్నింగ్స్ అతని కెరీర్‌కు ముగింపు పలికిందని చెప్పవచ్చు. అతని బౌలింగ్ ను సెహ్వాగ్ దంచికొట్టాడు.
భారత క్రికెట్ చరిత్రలో అత్యధిక టెస్ట్ వ్యక్తిగత స్కోర్లు సాధించిన ప్లేయర్లలో వీరేంద్ర సేహ్వాగ్ టాప్ లో ఉన్నారు.
1. వీరేంద్ర సెహ్వాగ్ - 319 పరుగులు vs దక్షిణాఫ్రికా (2008)
2. వీరేంద్ర సెహ్వాగ్ - 309 పరుగులు vs పాకిస్తాన్ (2004)
3. కరుణ్ నాయర్ - 303 పరుగులు vs ఇంగ్లండ్ (2016)
4. వీరేంద్ర సెహ్వాగ్ - 293 పరుగులు vs శ్రీలంక (2009)
5. వీవీఎస్ లక్ష్మణ్ - 281 పరుగులు vs ఆస్ట్రేలియా (2001)
57
సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీతో భారత్ ఘన విజయం
భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 675 పరుగులు చేసింది. సెహ్వాగ్ 309 పరుగులతో కదం తొక్కగా, సచిన్ టెండూల్కర్ 194 పరుగులతో అజేయంగా నిలిచాడు. పాకిస్తాన్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 407 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత్ ఈ మ్యాచ్‌ను ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో గెలిచింది. చివరకు 3 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1తో గెలిచి చరిత్రను సృష్టించింది.
67
రాహుల్ ద్రావిడ్ డిక్లరేషన్ పై వివాదం
ఈ మ్యాచ్‌లో భారత్ 675/5 వద్ద డిక్లేర్ చేయగా, ఆ సమయంలో సచిన్ టెండూల్కర్ 194 పరుగులతో ఆడుతున్నాడు. కెప్టెన్ గంగూలీ గైర్హాజరీలో అప్పుడు స్టాండ్-ఇన్ కెప్టెన్ అయిన రాహుల్ ద్రావిడ్ డిక్లరేషన్ నిర్ణయం తీసుకున్నాడు.
సచిన్ తన డబుల్ సెంచరీ పూర్తవకముందే ఇన్నింగ్స్ డిక్లేర్ కావడంతో నిరాశకు లోనయ్యాడు. అదే విషయాన్ని ఆయన 2014లో తన ఆటోబయోగ్రఫీ 'Playing It My Way' లో పేర్కొన్నాడు. "నేను ఎంతో బాధపడ్డాను" అని సచిన్ తన పుస్తకంలో రాసుకొచ్చాడు.
77
భారత క్రికెట్ చరిత్రలో మైలురాయి
ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. పాకిస్తాన్ గడ్డపై విజయం, సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ, టెండూల్కర్ అజేయ ఇన్నింగ్స్, సక్లైన్ కెరీర్ ముగింపు ఇవన్నీ కలసి ముల్తాన్ టెస్ట్‌ను ఒక చారిత్రక ఘట్టంగా నిలిపాయి.