మ‌రో చ‌రిత్ర సృష్టించ‌డానికి సిద్ధంగా విరాట్ కోహ్లీ..

First Published | Aug 12, 2024, 1:57 PM IST

Virat Kohli : భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 19 నుండి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్‌, ర‌న్ మిష‌న్ విరాట్‌ కోహ్లి ఈ మ్యాచ్ లో మ‌రో రికార్డు సృష్టించ‌డానికి సిద్దంగా ఉన్నాడు.
 

Virat Kohli :శ్రీలంక ప‌ర్య‌ట‌న త‌ర్వాత భార‌త జ‌ట్టు చాలా స‌మ‌యం విరామం తీసుకుని మ‌ళ్లీ గ్రౌండ్ లోకి అడుగుపెట్ట‌నుంది. ఈ విశ్రాంతి త‌ర్వాత‌ తొలి సిరీస్ లో బంగ్లాదేశ్ తో త‌ల‌ప‌డ‌నుంది. భారత్-బంగ్లాదేశ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 19 నుండి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతుంది.

ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్‌ కోహ్లి మ‌రో రికార్డు సృష్టించ‌నున్నాడు. ఇప్పటి వరకు భారత్‌ నుంచి కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్ మాత్రమే ఈ గొప్ప రికార్డును నమోదు చేయగలిగారు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లి 152 పరుగులు చేస్తే, టెస్టు క్రికెట్‌లో 9,000 పరుగులు పూర్తి చేసిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకెక్కుతాడు.


ప్రస్తుతం ఆడుతున్న బ్యాట్స్‌మెన్‌లలో జో రూట్, స్టీవ్ స్మిత్ మాత్రమే 9,000 కంటే ఎక్కువ టెస్టు పరుగులు చేయగలిగారు. టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్‌కు చెందిన జో రూట్ 12,027 పరుగులు, ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ 9,685 పరుగులతో ఉన్నారు. 

బంగ్లాదేశ్‌తో జరిగే తొలి టెస్టు మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 152 పరుగులు చేస్తే, భారత క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లలో ఈ రికార్డు సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ ఘ‌న‌త సాధిస్తాడు. టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 8,848 పరుగులు చేశాడు. ఈ లిస్టులో మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ సచిన్ టెండూల్కర్ టెస్టు క్రికెట్‌లో ప్రపంచంలోనే అత్యధికంగా 15,921 పరుగులతో టాప్ లో ఉన్నాడు. 

టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ లు వీరే   

1. సచిన్ టెండూల్కర్ - 15,921 పరుగులు

2. రాహుల్ ద్రవిడ్ - 13,288 పరుగులు

3. సునీల్ గవాస్కర్ - 10,122 పరుగులు

4. విరాట్ కోహ్లీ - 8,848 పరుగులు

Latest Videos

click me!