ఆర్జీవీ మేనకోడలితో బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ నిశ్చితార్థం.. ఫోటోలు ఇవిగో.. పెళ్లి ఎప్పుడంటే?

First Published | Aug 11, 2024, 3:17 PM IST

Kidambi Srikanth Shravya Varma : భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ నిశ్చితార్థం జరిగింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, నిర్మాత రామ్ గోపాల్ వ‌ర్మ మేన‌కోడ‌లు, ఫ్యాష‌న్ డిజైన‌ర్ శ్రావ్య వర్మను పెళ్లి చేసుకోబోతున్నాడు. 
 

Kidambi Srikanth, Shravya Varma

Kidambi Srikanth Shravya Varma : పారిస్ ఒలింపిక్స్ 2024 లో భార‌త జ‌ట్టు ప్ర‌యాణం ఇలా ముగిసిందో లేదో స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయ‌ర్ కిదాంబి శ్రీకాంత్ త‌న నిశ్చితార్థంతో గుడ్ న్యూస్ చెప్పాడు. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. 

కిదంబి శ్రీకాంత్ తన నిశ్చితార్థానికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సినీ నిర్మాత‌, ప్రముఖ స్టైలిష్ శ్రావ్య వర్మతో నిశ్చితార్థం చేసుకున్నాడు. వారిద్దరూ తమ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంగేజ్‌మెంట్ ఫోటోను పంచుకున్నారు. "ఔను ఆమె ఒకే చెప్పింది.. ఇప్పుడు మేము ఎప్ప‌టికీ కలిసి వుంటే స్టోరీ రాయ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని" శ్రీకాంత్ పేర్కొన్నాడు.


shravyavarma

కిదంబి శ్రీకాంత్ తో పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్న శ్రావ్య వ‌ర్మ టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు, నిర్మాత  రామ్ గోపాల్ వ‌ర్మ మేన‌కోడ‌లు. ఆమె సినీ నిర్మాతగా, ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ ప్ర‌త్యేక గుర్తింపు సాధించాడు.

Some of the top Indian badminton players are in Bangkok, participating in the BWF Thailand Open. However, the tournament is off to a shocking start.

శ్రావ్య వ‌ర్మ కూడా కిందంబి శ్రీకాంత్, తాను శ‌నివారం ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదిక‌గా ఫోటోను పంచుకుంటూ వెల్ల‌డించారు. ఈ క్రమంలోనే ఈ జంటకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

shravyavarma

శ్రావ్య వర్మ  ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నివాసి. డిజైనర్‌తో పాటు నిర్మాత కూడా.  పలు సినిమాలకు క్యాస్టూమ్ డిజైనర్ గా పనిచేశారు. అలాగే, పలు సినిమాలకు నిర్మాతగా ఉన్నారు. శ్రావ్య ఎంఎస్ ధోని అభిమాని కూడా. బ్యాడ్మింటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్, శ్రావ్య వర్మ నిశ్చితార్థం చేసుకున్న వీరు తొందరలోనే వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

భారతదేశ విజయవంతమైన బ్యాడ్మింటన్ క్రీడాకారులలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కిదాంబి శ్రీకాంత్ ఒకరు. ఎన్నో పెద్ద టోర్నీల్లో దేశానికి పతకాలు సాధించాడు. 2015 స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్‌లో కిదాంబి 21-15, 12-21, 21-14తో విక్టర్ అక్సెల్‌సెన్‌ను ఓడించి బంగారు పతకాన్ని గెలిచిన తొలి భారతీయుడిగా నిలిచాడు. 2022 థామస్ కప్‌లో శ్రీకాంత్ స్వర్ణం సాధించాడు. 

Latest Videos

click me!