పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్న కిదాంబి శ్రీకాంత్.. ఎవ‌రీ శ్రావ్య వర్మ?

First Published | Aug 11, 2024, 4:27 PM IST

Kidambi Srikanth Shravya Varma : అనేక అంతర్జాతీయ వేదికలపై భారత్ కు అద్భుత విజయాలు అందించి త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్. ఇప్పుడు శ్రావ్యవర్మతో మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నాడు. 
 

Kidambi Srikanth, Shravya Varma

Kidambi Srikanth Shravya Varma : భార‌త స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయ‌ర్ శ్రీకాంత్ కిదాంబి పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్నాడు. ఇటీవ‌ల‌ త‌న నిశ్చితార్థం జ‌రిగిన విష‌యాన్ని తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించాడు. త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. కిదంబి శ్రీకాంత్ శ్రావ్య‌వ‌ర్మ‌తో ఎంగేజ్‌మెంట్  చేసుకున్న ఫోటోను పంచుకోగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. దీంతో కిదంబి శ్రీకాంత్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవ‌రు? అనే చ‌ర్చ మొద‌లైంది. 

Kidambi Srikanth, Shravya Varma

అస‌లు ఎవ‌రీ శ్రావ్య‌వ‌ర్మ‌? వీరిద్ద‌రికి ఎలా ప‌రిచ‌యం?.. ఇప్పుడు ఆ విష‌యాలు తెలుసుకుందాం.. కిదంబి శ్రీకాంత్ నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి పేరు శ్రావ్య‌వ‌ర్మ‌. సినీ నిర్మాత‌, ప్రముఖ స్టైలిష్ క్యాస్టూమ్ డిజైన‌ర్ గా గుర్తింపు సాధించారు. వీరిద్ద‌రూ క‌లిసి ప‌లు ఈవెంట్ల‌లో పాల్గొన్న క్ర‌మంలో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే శ్రీకాంత్ ప్రేమ‌కు శ్రావ్య వ‌ర్మ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో పెళ్లిపీట‌లు ఎక్క‌బోతున్నారు.


shravyavarma

కిదంబి శ్రీకాంత్ కూడా ఇదే విష‌యాన్నిఫోటోను పంచుకుంటూ తెలిపాడు. "ఔను ఆమె ఒకే చెప్పింది.. ఇప్పుడు మేము ఎప్ప‌టికీ కలిసి వుంటే స్టోరీ రాయ‌డానికి సిద్ధంగా ఉన్నామ‌ని" శ్రీకాంత్ పేర్కొన్నాడు. శ్రావ్య వ‌ర్మ టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు, నిర్మాత  రామ్ గోపాల్ వ‌ర్మ మేన‌కోడ‌లు. ఆమె సినీ నిర్మాతగా, ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ ప్ర‌త్యేక గుర్తింపు సాధించారు.

shravyavarma

శ్రావ్య వర్మ  ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నివాసి. డిజైనర్‌తో పాటు నిర్మాత కూడా. దేవదాస్, కిల్లింగ్ వీరప్పన్, పొటుగాడు, మ్యాస్ట్రో, టాక్సీవాలా, చిలసౌ స‌హా ప‌లు తెలుగు సినిమాలకు క్యాస్టూమ్ డిజైనర్‌గా పనిచేశారు.

Kidambi Srikanth, Shravya Varma

సినిమాలకు క్యాస్టూమ్ డిజైనర్‌గా ప‌నిచేస్తూనే ఆమె నిర్మాత‌గా కూడా మారారు. ఇటీవల  విడుద‌లైన గుడ్ లక్ సఖి అనే సినిమాకు ఆమె నిర్మాత‌గా ఉన్నారు.  శ్రావ్య ఎంఎస్ ధోని అభిమాని కూడా. శ్రావ్య వ‌ర్మ‌, కిదంబి శ్రీకాంత్ లు గ‌త కొంత కాలంగా డేటింగ్ లో ఉన్నార‌ని కూడా ప‌లు మీడియా నివేదిక‌లు పేర్కొంటున్నాయి. వీరి నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, త్వ‌ర‌లోనే గ్రాండ్ గా వివాహం చేసుకోకున్నార‌ని స‌మాచారం. 

Latest Videos

click me!