Indian Players With Most Ducks: పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. ఒక్క పరుగు కూడా చేయకుండా డక్ అయ్యాడు. చెత్త రికార్డును తన పేరుమీద రాసుకున్నాడు. రోహిత్ శర్మ, గంగూలీలను అధిగమించాడు.
చాలా కాలం తర్వాత భారత్ తరఫున గ్రౌండ్ లోకి దిగిన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపరిచాడు. ఆదివారం (అక్టోబర్ 19న) ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ తొలి మ్యాచ్‌లో కోహ్లీ ఎనిమిది బంతులు ఆడి ఒక్క పరుగు చేయకుండానే అవుట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు.
25
రోహిత్, గంగూలీలను దాటేసిన కోహ్లీ
ఈ అవుట్‌తో విరాట్ కోహ్లీ ఒక చెత్త రికార్డు జాబితాలోకి చేరాడు. వన్డేల్లో కోహ్లీ ఇప్పటివరకు 17 సార్లు డక్ అయ్యాడు. దీంతో రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ లను అధిగమించాడు. గంగూలీ 2008లో రిటైర్ అయ్యే సరికి 16 సార్లు డక్ అయ్యాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు 16 సార్లు డక్ అయ్యాడు. రోహిత్ కూడా పెర్త్ వన్డేలో కేవలం 8 పరుగులు మాత్రమే చేశాడు.
35
వన్డేల్లో అత్యధిక డక్స్- భారత ప్లేయర్లు
భారత జట్టులో అత్యధిక సార్లు వన్డేల్లో డక్ అయిన ప్లేయర్ సచిన్ టెండూల్కర్. 463 వన్డేల్లో 20 సార్లు ఆయన ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత స్థానంలో జవగల్ శ్రీనాథ్ ఉన్నాడు. ఆయన 19 సార్లు డక్ అయ్యాడు. మూడో స్థానంలో యూవరాజ్ సింగ్, అనిల్ కుంబ్లేలు 18 డక్స్‌తో ఉన్నారు. ఈ జాబితాలో ఇప్పుడు విరాట్ కోహ్లీ 17 డక్స్‌తో ఐదవ స్థానంలో ఉన్నాడు.
వన్డేల్లోనే కాదు, అన్ని ఫార్మాట్లలో కలిపి విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 39 సార్లు డక్ అయ్యాడు. ఈ జాబితాలో ఆయన మూడో స్థానంలో ఉన్నాడు. జహీర్ ఖాన్ 43 డక్స్‌తో టాప్ లో ఉండగా, ఇషాంత్ శర్మ 40 డక్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ తర్వాత హర్భజన్ సింగ్ (37), బుమ్రా (35), కుంబ్లే (35), రోహిత్ శర్మ (34), సచిన్ టెండూల్కర్ (34) ఉన్నారు.
భారత ఆటగాళ్లు – అన్ని ఫార్మాట్లలో అత్యధిక డక్స్
1. జహీర్ ఖాన్ – 43
2. ఇషాంత్ శర్మ – 40
3. విరాట్ కోహ్లీ – 39
4. హర్భజన్ సింగ్ – 37
5. బుమ్రా – 35
6. అనిల్ కుంబ్లే – 35
55
కోహ్లీకి ఆస్ట్రేలియాతో వన్డేల్లో మూడవ డక్
ఆస్ట్రేలియాతో వన్డేల్లో విరాట్ కోహ్లీకి ఇది మూడవ డక్. అలాగే, మిచెల్ స్టార్క్ ఇప్పుడు కోహ్లీని రెండు సార్లు డక్ అవుట్ చేసిన రెండవ బౌలర్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డ్ జేమ్స్ ఆండర్సన్ సాధించాడు. అతను కూడా రెండు సార్లు కోహ్లీని డకౌట్ చేశాడు.
224 రోజుల తర్వాత, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు భారత జట్టు తరపున రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి ఆటలోకి రావడంతో మస్తు జోష్ లో ఉన్నారు. చివరిసారి వీరిద్దరూ భారత్ తరఫున ఛాంపియన్స్ ట్రోఫీ లో ఆడారు. ఇద్దరూ టీ20, టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు.