India vs Australia : పెర్త్ మ్యాచ్ తో భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటనలో అనేక రికార్డులను బ్రేక్ చేయనున్నాడు. సచిన్, సంగక్కర రికార్డులను బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది.
ఆస్ట్రేలియా పర్యటనలో కంగారు టీమ్ తో భారత జట్టు మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను ఆడనుంది. తొలి మ్యాచ్ పెర్త్ స్టేడియంలో ఆదివారం జరగనుంది. చాలా రోజుల తర్వాత టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ భారత జట్టు తరఫున ఆడనున్నాడు. మళ్లీ రంగంలోకి దిగుతున్న కోహ్లీ.. ఈ పర్యటనలో రికార్డులతో కొత్త చరిత్ర రాయడానికి సిద్ధంగా ఉన్నాడు. 36 ఏళ్ల కోహ్లీ, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజయం తర్వాత తొలిసారి ఆడనున్నారు.
26
ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ
ఈ ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఐదు మ్యాచ్‌లలో 218 పరుగులు సాధించారు. అందులో పాకిస్తాన్‌పై ఒక సెంచరీ, ఆస్ట్రేలియాపై సెమీఫైనల్‌లో 84 పరుగుల కీలక ఇన్నింగ్స్ లు ఉన్నాయి. ఈ ఫామ్‌తోనే ఆయన ఇప్పుడు ఆస్ట్రేలియాలో మరోసారి తన బ్యాట్ పవర్ చూపించాలనుకుంటున్నాడు.
36
విరాట్ కోహ్లీ: వన్డే క్రికెట్లో రెండో అత్యధిక పరుగుల రికార్డు
ప్రస్తుతం విరాట్ కోహ్లీ 302 వన్డే మ్యాచ్‌లలో 290 ఇన్నింగ్స్‌లలో 14,181 పరుగులు చేశారు. ఆయన బ్యాటింగ్ సగటు 57.88. తన వన్డే కెరీర్ లో ఇప్పటివరకు 51 సెంచరీలు, 74 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఈ పరుగులతో ప్రస్తుతం మూడవ స్థానంలో ఉన్నారు.
విరాట్ కోహ్లీ మరో 54 పరుగులు చేస్తే, శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర (14,234 పరుగులు, 404 మ్యాచ్‌లు)ను అధిగమించి రెండో అత్యధిక వన్డే పరుగులు చేసిన ప్లేయర్ గా రికార్డు సాధిస్తాడు.
సచిన్ టెండుల్కర్ మొత్తం పరిమిత ఓవర్ల (ODI + T20I) క్రికెట్ లో 18,436 పరుగులు చేశారు. అందులో 18,426 పరుగులు వన్డేల్లో, 10 పరుగులు ఒక టీ20 మ్యాచ్‌లో సాధించారు.
విరాట్ కోహ్లీ ప్రస్తుతం 14,181 వన్డే పరుగులు, 4,188 టీ20 పరుగులతో కలిపి 18,369 పరుగులు సాధించారు.
ఇంకా 68 పరుగులు చేస్తే, ఆయన సచిన్ రికార్డును అధిగమించి పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా రికార్డు సాధిస్తారు.
56
విరాట్ కోహ్లీ : విదేశీ గడ్డపై 30వ సెంచరీ రికార్డు
విరాట్ కోహ్లీ విదేశీ గడ్డపై ఇప్పటివరకు 29 సెంచరీలు సాధించాడు. ఇంకా ఒక సెంచరీ సాధిస్తే, ఆయన 30వ విదేశీ సెంచరీ నమోదు చేసి ఆసియా బ్యాటర్లలో టాప్ లో నిలుస్తారు. ప్రస్తుతం ఈ రికార్డును సచిన్ టెండుల్కర్ (29 సెంచరీలు) పేరిట ఉంది.
66
2027 ప్రపంచకప్ : ఆస్ట్రేలియా పర్యటన కీలకం
ఆస్ట్రేలియా పర్యటనతో విరాట్ కోహ్లీ 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు ముందుగా తన సన్నద్ధతను ప్రారంభిస్తున్నారు. పెర్త్ లో జరగబోయే తొలి వన్డేలో ఆయన రీఎంట్రీతో పాటు అనేక చరిత్రాత్మక క్షణాలు సాక్ష్యమవవచ్చు. ఆస్ట్రేలియా పై అద్భుతమైన రికార్డులు కలిగి ఉన్న కోహ్లీ ఈ టూర్ లో కూడా పరుగుల సునామీ తీసుకొస్తారని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ పర్యటనలో కోహ్లీ బ్యాట్ పనిచేస్తే రికార్డుల మోత ఉంటుంది.