Sachin Tendulkar: కోహ్లీ కెరీర్‌ను ఎవరూ నిర్ణయించకూదు.. క్రికెట్ గాడ్ స‌చిన్ టెండూల్క‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

First Published | Dec 1, 2023, 5:06 PM IST

Virat Kohli: భారత్‌లో ఇటీవ‌ల ముగిసిన ఐసీసీ వ‌న్డే క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ లో అద‌ర‌గొట్టిన భార‌త స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ సిరీస్‌లో 765 పరుగులతో విరాట్ కోహ్లీ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.
 

Virat Kohli - Tendulkar: ఇటీవ‌ల ముగిసిన ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ లో భార‌త జ‌ట్టు వ‌రుస ప‌ది మ్యాచ్ లో విజ‌యాలు సాధించి ఫైన‌ల్ చేరుకుంది. అయితే, ఫైన‌ల్లో మాత్రం ఆస్ట్రేలియా చేతిలో ఓట‌మితో మెగా టోర్నీని ముగించింది. 

ఐసీసీ వ‌న్డే క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో అద‌ర‌గొట్టిన భార‌త స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ సిరీస్‌లో 765 పరుగులతో విరాట్ కోహ్లీ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.
 


అలాగే వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా విరాట్ కోహ్లీ బద్దలు కొట్టి సరికొత్త చ‌రిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో 50 సెంచరీలతో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా, 49 సెంచరీలతో సచిన్ రెండో స్థానంలో ఉన్నాడు.
 

అయితే, వ‌ర‌ల్డ్ క‌ప్ ముగిసిన త‌ర్వాత విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై వార్తులు వ‌స్తూనే ఉన్నాయి. ఇదే క్రమంలో ద‌క్షిణాఫ్రికాతో జ‌ర‌గ‌బోయ వ‌న్డే వ‌న్డే, టీ20 సిరీస్ కు విరాట్ ను బీసీసీఐ ప‌క్క‌న పెట్ట‌డంతో రిటైర్మెంట్ ఊహాగ‌నాలు మ‌రింత ఊపందుకున్నాయి. 
 

ఇక తాజాగా క్రికెట్ గాడ్, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశాడు. తన ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీకి క్రికెట్‌లో ఇంకా చాలా నైపుణ్యాలు ఉన్నాయనీ, తాను సాధించాల్సింది చాలా ఉంద‌ని చెప్పాడు.
 

2023 ప్రపంచకప్ లో భార‌త జ‌ట్టు ఓటమిని బట్టి విరాట్ కోహ్లీ కెరీర్‌ను ఎవరూ నిర్ణయించకూడదని స‌చిన్ పేర్కొన్నాడు. అత‌ని ప్ర‌యాణం ఇక్క‌డే ఆగిపోద‌ని చెప్పాడు. 
 

"విరాట్ కోహ్లీ 50వ సెంచరీ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. అతని ప్రయాణం ఇక్కడితో ఆగదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అతనికి ఇంకా చాలా క్రికెట్ ఆడాలి. అతనికి దేశం కోసం మెరుగ్గా ఆడి మరిన్ని విజయాలు, రికార్డులు సాధించాలనే కోరిక చాలా ఉంది. భారత్‌కు సంబంధించిన రికార్డు ఎప్పటికీ భారత్‌తోనే ఉంటుంది.. నేను అదే కోరుకుంటున్నాను" అని స‌చిన్ పేర్కొన్నారు.
 

Latest Videos

click me!