Virat Kohli: విరాట్ కోహ్లీకి బిగ్ షాక్.. టీ20ల‌కు గుడ్ బై చెప్పిన‌ట్టేనా?

First Published | Dec 1, 2023, 4:08 PM IST

ICC T20 World Cup: 2022 టీ20 వరల్డ్ క‌ప్ లో ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ టీ20లకు దూరమయ్యాడు. అప్పటి నుంచి ఈ స్టార్ బ్యాట‌ర్ భార‌త్ త‌ర‌ఫున ఏ టీ20 మ్యాచ్ ల్లోనూ ఆడటం లేదు.
 

Indian star batsman Virat Kohli:  టీమిండియా స్టార్ బ్యాట‌ర్, భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇక టీ20ల‌కు గుడ్ బై చెప్పిన‌ట్టేనా? అలాగే, వ‌న్డేల‌కు సైతం దూరం కానున్నాడా? అంటే క్రికెట్ వ‌ర్గాల్లో ఇదే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 
 

తాజాగా బీసీసీఐ స‌మావేశం నేప‌థ్యంలో ఒక వార్త వైర‌ల్ గా మారింది. ప‌లు మీడియా రిపోర్టుల ప్ర‌కారం.. భార‌త స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ ఇక టీ20ల‌కు దూరం కానున్నాడు. రాబోయే ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024లో తమ స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి సేవలను టీమ్ ఇండియా కోల్పోనుంద‌ని సంబంధిత రిపోర్టులు పేర్కొంటున్నాయి. 
 


వ‌చ్చే ఏడాది జూన్ లో కరేబియన్స్, యునైటెడ్ స్టేట్స్‌లో జరగనున్న ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ మెగా టోర్నమెంట్ కు విరాట్ కోహ్లీ దూరం కానున్నాడ‌ని స‌మాచారం. ఇది బిగ్ షాక్ అనే చెప్పాలి. రానున్న మేగా టోర్నీలో భార‌త జ‌ట్టుకు రోహిత్ శర్మ సార‌థ్యం వ‌హించ‌నున్నాడ‌ని స‌మాచారం.
 

2022 టీ20 వరల్డ్ క‌ప్ లో ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా ఓటమి తర్వాత విరాట్ కోహ్లీ టీ20లకు దూరమయ్యాడు. అప్పటి నుంచి ఈ స్టార్ బ్యాట‌ర్ భార‌త్ త‌ర‌ఫున ఏ టీ20 మ్యాచ్ ల్లోనూ ఆడటం లేదు.
 

అలాగే, రోహిత్ శర్మ కూడా 2022 టీ20 ప్రపంచ కప్ నుండి భార‌త్ త‌ర‌ఫున టీ20 మ్యాచ్ ల‌ను ఆడ‌లేదు. అయితే, రాబోయే టీ20 ప్రపంచ కప్‌కు రోహిత్ నాయకత్వ వ‌హించ‌నున్నాడ‌నీ, సెలక్టర్లు, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ అధికారులతో ఇటీవల జరిగిన బీసీసీఐ సమావేశంలో ఈ నిర్ణయం ఖరారైందని స‌మాచారం.
 

బీసీసీఐ అధికారులు, సెలెక్టర్లు శుభమాన్ గిల్, యశస్వి జైస్వాల్ వంటి యువ ప్రతిభావంతుల ప్రదర్శనతో సంతృప్తి చెందారని నివేదికలు సూచిస్తున్నాయి. దీని కార‌ణంగా విరాట్ కోహ్లీని టీ20 జ‌ట్టు నుంచి త‌ప్పించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. 
 

అలాగే, టీ20 ప్రపంచకప్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాలన్న రోహిత్‌ శర్మ కోరికను ఈ సమావేశంలో ప్రస్తావించిన‌ట్టు కూడా ప‌లు మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. రాబోయే మెగా ఈవెంట్‌కు రోహిత్‌ను లీడర్‌గా కొనసాగించాలని బీసీసీఐ అధికారులు, సెలెక్టర్లు ఏకగ్రీవంగా నిర్ణయించారు.
 

దీంతో కెప్టెన్సీ కార‌ణంగా రోహిత్ జ‌ట్టులో స్థానం పొంద‌నుండ‌గా, విరాట్ కోహ్లీ కోత్త ఆట‌గాళ్ల ఎంట్రీతో జ‌ట్టులో చోటు ద‌క్కించుకోవ‌టం క‌ష్ట‌మేన‌ని తెలుస్తోంది. వ‌న్డేల‌తో పాటు టీ20 అనేక మ్యాచ్ ల‌లో రికార్డు ప‌రుగులు చేసిన స్టార్ బ్యాట‌ర్ విరాట్ ను ప‌క్క‌న పెట్ట‌డ‌మేంట‌నే చ‌ర్చ మొద‌లైంది. 
 

తాజాగా ద‌క్షిణాఫ్రికా సిరీస్ కు బీసీసీఐ జ‌ట్ల‌ను ప్ర‌క‌టించ‌గా, వ‌న్డే, టీ20 జ‌ట్ల‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ ఇద్ద‌రికీ చోటు ద‌క్క‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే, టెస్ట్ సిరీస్ లో మాత్రం ఇద్ద‌రు స్టార్ బ్యాట‌ర్ల‌కు చోటు క‌ల్పించారు. 
 

Latest Videos

click me!