Team India: టీమిండియాకు కొత్త కెప్టెన్.. వ‌న్డే జ‌ట్టులోకి యువ‌ సంచలనం

First Published | Dec 1, 2023, 12:01 PM IST

India vs South Africa: డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా పర్యటనకు భారత క్రికెట్ టెస్టు జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించనుండ‌గా, టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్, వన్డే జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్ గా కొన‌సాగ‌నున్నారు. 
 

India tour of South Africa, 2023-24: దక్షిణాఫ్రికా సిరీస్ కోసం భార‌త టెస్ట్ జ‌ట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్ర‌క‌టించింది. అయితే, టెస్ట్, వ‌న్డే, టీ20 మూడు ఫార్మ‌ట్ ల‌కు ముగ్గురు కెప్టెన్ల‌ను బీసీసీఐ ప్ర‌క‌టించ‌డం విశేషం. 
 

భారత క్రికెట్ జట్టు వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో మూడు టీ20లు, మూడు వన్డేలు, ఆ తర్వాత రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా పర్యటనకు భారత క్రికెట్ టెస్టు జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించనున్నాడు.
 


ఇక టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్, వన్డే జట్టుకు కేఎల్ రాహుల్ సారథ్యం వ‌హించ‌నున్నారు. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచ‌క‌ప్ లో హార్దిక్ పాండ్యా గాయం టోర్నీకి దూర‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలోనే కేఎల్ రాహుల్  వైస్ కెప్టెన్ గా కొన‌సాగాడు. 
 

వ‌న్డే కెప్టెన్ గా ఇదివ‌ర‌కు కేఎల్ రాహుల్ సేవలు అందించాడు. గతంలో దక్షిణాఫ్రికా గడ్డపై కెప్టెన్ గా టీమిండియాను ముందుకు న‌డిపించిన అనుభ‌వం ఉంది. అందుకే బీసీసీఐ కేఎల్ రాహుల్ గాను భార‌త వ‌న్డే జ‌ట్టు కెప్టెన్ గా ఎంపిక చేసింది. 

వన్డే క్రికెట్ ప్రస్తుతం అతి ముఖ్యమైన ఫార్మాట్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని పరిశీలిస్తే, రాహుల్ నేతృత్వంలోని కొత్త జట్టు 50 ఓవర్ల మ్యాచ్లు ఆడనుంది. అద్భుతమైన లిస్ట్ ఎ రికార్డులతో రజత్ పాటిదార్, బి సాయి సుదర్శన్, రింకు సింగ్ వన్డే జట్టులో ఉన్నారు.
 

టెస్టు జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన కుల్దీప్ యాదవ్ వైట్ బాల్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ప్రపంచకప్ కు దూరమైన యజువేంద్ర చాహల్ ఇప్పుడు 50 ఓవర్ల ఫార్మాట్లో తిరిగి రాగా, రవి బిష్ణోయ్ టీ20 జట్టులో ఉన్నాడు.

దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న తమిళనాడు యవ సంచలనం సాయి సుదర్శన్‌కు కూడా భారత వన్డే జట్టులో చోటు దక్కింది. అలాగే, సంజూ శాంసన్‌, రజిత్‌ పాటిదర్ కూడా జ‌ట్టులో వ‌న్డే జ‌ట్టులో చోటు సంపాదించుకున్నారు.
 

Shreyas Iyer

భారత వన్డే జట్టు: 

రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కులదీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ , అర్ష్దీప్ సింగ్, దీపక్ చాహర్.
 

Latest Videos

click me!