Virat Kohli టెన్త్ క్లాస్ మార్కుల మెమో వైరల్.. ఇంతకూ కోహ్లీ ఏ సబ్జెక్ట్ లో తోపు, ఎందులో వీక్..?

Published : Jan 30, 2026, 02:40 PM IST

Virat Kohli Marksheet : టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎన్ని సెంచరీలు చేశాడు… ఎన్ని రికార్డులు సాధించాడు అనేవి అతడి అభిమానులకు తెలిసిన విషయాలే. కానీ అతడికి పదో తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా..? 

PREV
15
విరాట్ కోహ్లీకి మార్కుల్ లిస్ట్ వైరల్...

Virat Kohli SSC Marks : ఇంటర్నేషనల్ క్రికెట్లో వేలకొద్ది పరుగులు... వందలాది బౌండరీలు... వందకు మించి హాఫ్ సెంచరీలు... సెంచరీకి చేరువలో సెంచరీలు... ఇది టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ట్రాక్ రికార్డు. ఫార్మాట్ ఏదైనా సరే పరుగుల వరద పారించడం ఒక్కటే అతడికి తెలుసు... అతడు క్రీజులోకి వస్తున్నాడంటే చాలు ప్రత్యర్థుల్లో భయం మొదలవుతుంది. ఈ ఒక్కడిని ఔట్ చేస్తే చాల్రా బాబు.. దాదాపు మ్యాచ్ గెలిచినట్లే అని ఫీల్ అయిపోతుంటారు. అందుకే అతడికి అభిమానులు ముద్దుగా 'కింగ్ కోహ్లీ' అని పిలుచుకుంటారు.

విరాట్ కోహ్లీ ఆటకే కాదు స్టైలిష్ లుక్ కి కూడా చాలామంది ఫిదా అవుతుంటారు. ఇలా తమ మనసులు దోచిన ఆటగాడి వ్యక్తిగత విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కోహ్లీ పదో తరగతి (SSC) మార్కుల లిస్ట్ బయటకు వచ్చింది... ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

25
కోహ్లీ మార్క్స్ మెమో వైరల్... ఇది నిజమైందేనా..?

సోషల్ మీడియాలో కొందరు టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మార్కుల మెమో ఇదేనంటూ పోస్టులు చేస్తున్నారు. ఇందులో రోల్ నెంబర్ ఆధారంగా ఫ్యాక్ట్ చెక్ చేయగా అసలైందిగానే తేలింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్ సైట్ ఈ నెంబర్ తో రిజల్ట్ చెక్ చేస్తే కోహ్లీ వివరాలే వచ్చాయి. కాబట్టి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మార్క్స్ మెమో ఫేక్ కాదని అర్థమవుతోంది.

35
కోహ్లీకి ఏ సబ్జెక్ట్ లో ఎన్నిమార్కులు..?

కోహ్లీ న్యూడిల్లీలోని సేవియర్ కాన్వెంట్ సీనియర్ సెకండరీ స్కూల్ నుండి పదో తరగతి పూర్తిచేశాడు. 2004 నాటి అతడి మార్క్స్ మెమో బయటకు వచ్చింది... దీంతో అతడికి ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.

కోహ్లీకి హయ్యెస్ట్ మార్కులు ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో వచ్చాయి... 83 మార్కులతో A1 గ్రేడ్ వచ్చింది. ఆ తర్వాత సోషల్ సైన్స్ లో 81 మార్కులతో A2 గ్రేడ్ వచ్చింది. హిందీలో 75 మార్కులతో B1, ఇంట్రడక్టరీ ఐటీ లో 74 మార్కులతో C2 గ్రేడ్ వచ్చింది. ఇక అత్యల్పంగా సైన్స్ ఆండ్ టెక్నాలజీలో 55 మార్కులతో C1, మ్యాథ్స్ లో 51 మార్కులతో C2 గ్రేడ్ వచ్చింది. మొత్తంగా చూసుకుంటే కోహ్లీ ఇంగ్లీష్ లో తోపు, మ్యాథ్స్ లో వీక్ అని టెన్త్ మార్కులు చెబుతున్నాయి.

45
క్రికెట్ పై ఫోకస్ తోనే తక్కువ మార్కులు...

విరాట్ కోహ్లీ చిన్నప్పటి నుండి క్రికెట్ పై మక్కువ పెంచుకున్నాడు... అతడు మూడేళ్ల వయసులోనే బ్యాట్ పట్టినట్లు కుటుంబసభ్యులు చెబుతుంటారు. కోహ్లీకి క్రికెట్ పై ఇంట్రెస్ట్ ను పసిగట్టిన తల్లిదండ్రులు చదువు గురించి ఆందోళన పడకుండా ప్రోత్సహించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అటు చదువు, ఇటు క్రికెట్ ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగాడు కోహ్లీ. ఈ క్రమంలోనే అతడు మినిమం మార్కులతో పదో తరగతి పూర్తిచేసినట్లు మార్కుల మెమోను బట్టి అర్థమవుతోంది.

55
కోహ్లీ గణాంకాలివే...

విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 123 టెస్టులు, 311 వన్డేలు, 125 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడారు. టెస్టుల్లో 9230, వన్డేల్లో 14797, టీ20 లో 4188 పరుగులు చేశాడు... మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్లో 25 వేలకు పైగా పరుగులు చేశాడు. ఈ పరుగులు ప్రవాహంలో 30 టెస్ట్, 54 వన్డే, 1 టీ20 సెంచరీలున్నాయి.

కోహ్లీకి టెస్టుల్లో 254(నాటౌట్), వన్డేల్లో 183, టీ20 లో 122(నాటౌట్) బెస్ట్ స్కోర్స్. ఐపిఎల్ ఆరంభంనుండి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడుతున్నాడు. ఇప్పటివరకు ఐపిఎల్ లో 267 మ్యాచులు ఆడిన కోహ్లీ 8661 పరుగులు సాధించారు... ఇందులో 8 సెంచరీలు, 63 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇలా ఫార్మాట్ ఏదైనా పరుగులు వరద పారిస్తూ క్రికెట్ కింగ్ గా మారాడు విరాట్ కోహ్లీ.

Read more Photos on
click me!

Recommended Stories