SRH Top 5 Dangerous Batsmen in IPL 2026 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ఇక ఎక్కువ సమయం లేదు… T20 ప్రపంచ కప్ 2026 ముగిసిన వెంటనే ఐపీఎల్ మహాసంగ్రామం మొదలవుతుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి కూడా అత్యంత ప్రమాదకరమైన జట్టును సిద్ధం చేసింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో డేంజర్ బ్యాటర్లు వీళ్ళే..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 (IPL) లోని అత్యంత ప్రమాదకరమైన జట్లతో మన సన్ రైజర్స్ హైదరాబాద్ ఒకటి. తనదైన రోజులు ఈ టీం అతి సునాయాసంగా 300 పరుగులు చేయగలదు… ఈ స్థాయి విధ్వంసం సృష్టించే బ్యాటర్లు ఈ జట్టులో ఉన్నారు. ఇలా అత్యంత ప్రమాదకరమైన బ్యాటింగ్ లైనప్‌ను కలిగిన హైదరాబాద్ టీంను చూసి ప్రత్యర్థి బౌలర్లు భయపడిపోతుంటారు.
అయితే ఈసారి సన్ రైజర్స్ టీం మరింత డేంజరస్‌గా కనిపిస్తోంది. గత రెండు సీజన్లలో SRH బ్యాటింగ్ ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయించింది. కొత్త సీజన్‌లో కూడా సత్తా చాటేందుకు ఈ జట్టు బ్యాటర్లు సిద్ధంగా ఉన్నారు. ఈసారి బ్యాట్‌తో పరుగుల వర్షం కురిపించే అవకాశాలున్న ఐదుగురు బ్యాటర్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
26
1. అభిషేక్ శర్మ
ఈ జాబితాలో మొదటి స్థానంలో ప్రపంచ నంబర్ వన్ T20 బ్యాటర్ అభిషేక్ శర్మ ఉన్నాడు. అతను ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు. SRHకు ఇతని కంటే పెద్ద మ్యాచ్ విన్నర్ మరొకరు ఉండకపోవచ్చు. ఐపీఎల్‌లో 77 మ్యాచ్‌లలో 1816 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 163.02. ఇతడి ఖాతాలో ఇప్పటికే ఒక ఐపిఎల్ సెంచరీ కూడా ఉంది.
36
2. ఇషాన్ కిషన్
రెండో స్థానంలో మరో ఎడమచేతి వాటం విధ్వంసక బ్యాటర్ ఇషాన్ కిషన్ ఉన్నాడు. అతను అంతర్జాతీయ క్రికెట్‌లో అదరగొడుతున్నాడు. ఐపీఎల్ 2026లో బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది.
2025లో SRH ఇతడిని భారీ డబ్బులతో కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో 13 ఇన్నింగ్స్‌లలో 354 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ తరపున ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఇషాన్ సెంచరీ బాదాడు. ఈ సీజన్‌లో అతను పెద్ద మ్యాచ్ విన్నర్ కాగలడు.
ఈ జాబితాలో మూడో స్థానంలో ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఉన్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటికే తన ముద్ర వేశాడు హెడ్. 37 ఐపీఎల్ ఇన్నింగ్స్‌లలో 170.03 స్ట్రైక్ రేట్‌తో 1146 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 8 అర్ధ సెంచరీలు ఉన్నాయి. క్రీజులో ఉన్నంత సేపు బౌలర్లకు చుక్కలు చూపిస్తాడు. SRH తరఫున మరోసారి విధ్వంసం సృష్టించే అవకాశాలు ఉన్నాయి.
56
4. హెన్రిచ్ క్లాసెన్
ఈ జాబితాలో నాలుగో స్థానంలో దక్షిణాఫ్రికా డేంజరస్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు. అతను 2023 నుంచి SRH తరఫున ఆడుతున్నాడు. ఇతడు కేవలం 5 ఓవర్లు క్రీజులో ఉన్నా మ్యాచ్‌ను మలుపు తిప్పగలడు. గత సీజన్‌లో 13 ఇన్నింగ్స్‌లలో 172.70 స్ట్రైక్ రేట్‌తో 487 పరుగులు చేశాడు. చివరి మ్యాచ్‌లో సెంచరీ కూడా బాదాడు. ఇతని భయం బౌలర్లలో కచ్చితంగా ఉంటుంది.
66
5. నితీశ్ కుమార్ రెడ్డి
ఈ జాబితాలో ఐదో స్థానంలో టీమిండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. తెలుగు టీంలో ఆడుతున్న తెలుగు కుర్రాడు నితీష్. ఇతను మరోసారి SRH తరఫున ఆడనున్నాడు. ఫినిషింగ్ బాధ్యత అతనిపై ఉంటుంది. ఐపీఎల్‌లో 28 మ్యాచ్‌లలో 485 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 76. స్ట్రైక్ రేట్ 130కి పైగా ఉంది. ఒక్కసారి ఫామ్ అందుకుంటే భారీ ఇన్నింగ్స్ ఆడగలడు. ఇతని బ్యాట్ పవర్ బౌలర్లకు బాగా తెలుసు.