Kohli: 17 ఏళ్ల తర్వాత మొదటిసారి.. వరుసగా 2 వన్డేల్లో కోహ్లీ డకౌట్.. ఏమైంది బాసూ !

Published : Oct 23, 2025, 10:26 AM ISTUpdated : Oct 23, 2025, 01:47 PM IST

Virat Kohli consecutive duck: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో మ్యాచ్ లోనూ విరాట్ కోహ్లీ నిరాశపరిచాడు. అడిలైడ్ వన్డేలో విరాట్ కోహ్లీ మరోసారి డక్ అవుట్ అయ్యాడు. తన కెరీర్‌లో తొలిసారి వరుసగా రెండు వన్డేల్లో పరుగులు లేకుండా వెనుదిరిగాడు.

PREV
16
వరుసగా రెండు వన్డేల్లో కోహ్లీ డక్

భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ గురువారం (అక్టోబర్ 23) అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో  ఒక్కపరుగు కూడా చేయకుండానే పెవిలియన్ కు చేరాడు. ఈ మ్యాచ్‌లో ఆయన నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి, కేవలం నాలుగు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. 

జేవియర్ బార్ట్‌లెట్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ గా వెనుదిరిగాడు. దీంతో వరుసగా రెండో వన్డేలో కూడా కోహ్లీ నుంచి పరుగులు రాలేదు. ఇది అతని వన్డే కెరీర్‌లో మొదటిసారి. మొదటి వన్డేలోనూ కోహ్లీ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఎనిమిది బంతులు ఆడి పరుగుల ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు.

26
కోహ్లీ అవుట్ పై అభిమానుల నిరాశ

అడిలైడ్ ఓవల్ విరాట్ కోహ్లీకి కలిసొచ్చిన వేదికగా గుర్తింపు ఉంది. ఇక్కడ ఆయన రెండు వన్డే సెంచరీలు సాధించాడు. 2015లో పాకిస్తాన్‌పై 107 పరుగుల నాక్, 2019లో ఆస్ట్రేలియాపై 104 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. కానీ ఈసారి మాత్రం అదే వేదికపై ఒక్క పరుగు లేకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.

కోహ్లీ అవుట్ అయిన క్షణం అభిమానులు షాక్ అయ్యారు. ఆయన బయటకు వస్తున్నప్పుడు స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు నిలబడి చప్పట్లు కొట్టారు. తనకు ఇది అడిలైడ్‌లో చివరి వన్డే కావొచ్చనే కామెంట్స్ వస్తున్నాయి. ఈ వేదికపై ఆయన మొత్తం 976 పరుగులు చేశారు.

36
డక్‌ల జాబితాలో కోహ్లీ

వన్డేల్లో కోహ్లీకి ఇది 18వ డకౌట్. భారత ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ (20 డక్స్), జవగల్ శ్రీనాథ్ (19 డక్స్) తర్వాత ఇప్పుడు కోహ్లీ కూడా 18 డక్‌లతో యూవరాజ్ సింగ్, అనిల్ కుంబ్లే సరసన చేరాడు.

భారత ఆటగాళ్ల డక్స్ రికార్డులు

  1. సచిన్ టెండూల్కర్ 463 మ్యాచ్ లు 20 డకౌట్లు 
  2. జవగల్ శ్రీనాథ్ 229 మ్యాచ్ లు 19 డకౌట్లు 
  3. అనిల్ కుంబ్లే 269 మ్యాచ్ లు 18 డకౌట్లు
  4. యువరాజ్ సింగ్ 301 మ్యాచ్ లు 18 డకౌట్లు
  5. విరాట్ కోహ్లీ 304 మ్యాచ్ లు 18 డకౌట్లు 

ప్రపంచవ్యాప్తంగా వన్డేల్లో అత్యధిక డక్‌ల రికార్డు శ్రీలంక మాజీ కెప్టెన్ సనత్ జయసూర్య పేరిట ఉంది. 445 వన్డేల్లో 34 సార్లు డకౌట్ అయ్యాడు. ఆయన తరువాత పాకిస్తాన్ స్టార్ షాహిద్ అఫ్రిది 398 వన్డేల్లో 30 డక్‌లతో ఉన్నాడు.

46
రీఎంట్రీలో కోహ్లీకి నిరాశాజనక ఆరంభం

మార్చిలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కోహ్లీ ఇది తొలి అంతర్జాతీయ సిరీస్. దాదాపు ఏడు నెలల తర్వాత వన్డేల్లో తిరిగి అడుగుపెట్టిన ఆయన మొదటి రెండు మ్యాచ్‌ల్లో పరుగులు సాధించకపోవడం అభిమానులను నిరాశపరిచింది.

పెర్త్ లో ఆయన వైడ్ బాల్‌పై డ్రైవ్ ఆడే ప్రయత్నంలో అవుట్ కాగా, అడిలైడ్‌లో జేవియర్ బార్ట్‌లెట్ ఇన్స్వింగ్ బంతిని అంచనా వేయలేక ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. డీఆర్‌ఎస్ తీసుకోవాలా అని ఆలోచించినప్పటికీ, రోహిత్ శర్మ సూచనతో రివ్యూ తీసుకోలేదు.

56
కోహ్లీ వన్డే రికార్డులు

వన్డేల్లో కోహ్లీ ఇప్పటివరకు 304 మ్యాచ్‌ల్లో 14,181 పరుగులు సాధించాడు. 51 సెంచరీలు, 74 హాఫ్ సెంచరీలు సాధించి 57.41 సగటుతో పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై ఆయన రికార్డూ అద్భుతంగా ఉందిత. 52 వన్డేల్లో 2,451 పరుగులు, 8 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు సాధించాడు.

66
అడిలైడ్ ఓవల్ లో కోహ్లీ రికార్డులు
  • వన్డేలు: 5 మ్యాచ్‌లు, 244 పరుగులు, 2 సెంచరీలు
  • టెస్టులు: 5 మ్యాచ్‌లు, 527 పరుగులు
  • టీ20లు: 3 మ్యాచ్‌లు, 204 పరుగులు

అయితే ఈసారి అదే వేదిక కోహ్లీకి నిరాశను మిగిల్చింది. వరుసగా రెండు వన్డేల్లో డక్ అవ్వడం, ఆయన వన్డే కెరీర్‌లో అరుదైన సంఘటనగా నిలిచింది. అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో “ది కింగ్ ఈజ్ రస్టీ” అంటూ స్పందిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories