Published : Oct 23, 2025, 09:34 AM ISTUpdated : Oct 23, 2025, 01:49 PM IST
Rohit Sharma : ఇండియా vs ఆస్ట్రేలియా రెండో వన్డే అడిలైడ్ లో జరుగుతోంది. సిరీస్ ను కోల్పోకుండా ఉండాలంటే భారత్ కు ఈ మ్యాచ్ గెలుపు చాలా కీలకం. ఇక్కడ రోహిత్ శర్మ ఐదు చారిత్రాత్మక రికార్డులపై కన్నేశాడు.
భారత జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో జరిగే రెండో వన్డేలో చరిత్ర సృష్టించే ఛాన్స్ ఉంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా పెర్త్ లో జరిగిన తొలి వన్డేలో కేవలం 8 పరుగులకే అవుట్ అయిన రోహిత్, ఇప్పుడు రెండో వన్డేలో తన బ్యాట్ పవర్ చూపించడానికి గ్రౌండ్ లో అగుడుపెట్టాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 0-1తో వెనుకబడి ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ గెలుపు భారత్‌కు కీలకం. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ రికార్డులు గమనిస్తే..
26
ఆస్ట్రేలియాలో 1000 వన్డే పరుగులు పూర్తి చేసే తొలి భారత ఆటగాడు రోహిత్
కంగారూ నేలపై ఆడిన 11 వన్డేల్లో రోహిత్ ఇప్పటికే 998 పరుగులు చేశారు. అడిలైడ్ ఓవల్ లో 2 పరుగులు చేసి, ఆస్ట్రేలియాలో భారత్ తరఫున 1000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో ఆయన తర్వాత విరాట్ కోహ్లీ (802 పరుగులు), సచిన్ టెండుల్కర్ (740 పరుగులు) ఉన్నారు.
36
అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సెంచరీల రికార్డు
అడిలైడ్ ఓవల్ వేదికగా రోహిత్ శర్మ సెంచరీ సాధిస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో 50 సెంచరీలు పూర్తి చేసిన మూడవ భారత బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు. ఇప్పటివరకు ఈ ఘనతను సాధించిన వారిలో లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండుల్కర్ (100 సెంచరీలు), విరాట్ కోహ్లీ (82 సెంచరీలు) మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 49 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. ఈ వన్డేలో సెంచరీ సాధిస్తే, ఆయన పేరు క్రికెట్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలుస్తుంది.
రోహిత్ శర్మ వన్డేల్లో ఇప్పటివరకు 274 మ్యాచ్‌ల్లో 344 సిక్సులు కొట్టారు. అడిలైడ్ లో వన్డేలో మరో 8 సిక్సులు కొడితే, ఆయన మొత్తం 352 సిక్సులకు చేరుకుంటారు. దీంతో పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ ఆఫ్రిది (351 సిక్సులు) రికార్డును అధిగమించి వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా నిలుస్తారు.
56
భారత వన్డే చరిత్రలో మూడో అత్యధిక రన్ స్కోరర్‌గా రోహిత్
రోహిత్ శర్మ ఇప్పటివరకు భారత్ తరఫున 274 వన్డేల్లో 48.59 సగటుతో 11,176 పరుగులు సాధించారు. మరో 46 పరుగులు చేస్తే, ఆయన సౌరవ్ గంగూలీ (11,221 పరుగులు) రికార్డును అధిగమించి భారత వన్డే చరిత్రలో మూడవ అత్యధిక రన్ స్కోరర్‌గా నిలుస్తారు. రోహిత్ ఇప్పటికే మూడు డబుల్ సెంచరీలు, 32 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలు సాధించాడు.
66
ఆస్ట్రేలియాపై 100 సిక్సులు కొట్టే చారిత్రాత్మక ఘనత
రోహిత్ శర్మ ఇప్పటివరకు ఆస్ట్రేలియాపై ఆడిన 47 వన్డేల్లో 88 సిక్సులు కొట్టారు. అడిలైడ్ లో 12 సిక్సులు కొడితే, ఆయన ఆస్ట్రేలియాపై వన్డేల్లో 100 సిక్సులు కొట్టిన తొలి ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం ఆయన తర్వాత ఇయాన్ మోర్గన్ (48 సిక్సులు), సచిన్ టెండుల్కర్ (35 సిక్సులు) ఉన్నారు.