CSK: చిన్న వయస్సులోనే తాను క్రికెట్‌లో అరంగేట్రం చేసి ఉంటే.. సచిన్ కంటే 5 వేల పరుగులు ఎక్కువ చేసేవాడినని ధోని మాజీ సహచర ఆటగాడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. మరి ఆ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా.. ఈ స్టోరీ చూసేయండి.
ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మెన్ మైఖేల్ హస్సీ ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశాడు. తాను చిన్న వయసులోనే కెరీర్ ప్రారంభించి ఉంటే, సచిన్ టెండూల్కర్ కంటే 5 వేలు ఎక్కువ పరుగులు చేసి ఉండేవాడినని చెప్పుకొచ్చాడు. హస్సీ 324 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లలో మొత్తం 12,398 పరుగులు చేశాడు. అందులో 22 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
25
దేశవాళీ క్రికెట్‌లో అరుదైన రికార్డు..
హస్సీకి దేశవాళీ క్రికెట్‌లో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 273 మ్యాచ్‌ల్లో అతడు దాదాపు 23,000 పరుగులు చేశాడు. అందులో 61 సెంచరీలు చేశాడు. అయితే ఆ సమయంలో ఆస్ట్రేలియా జట్టులో ఉన్న అద్భుతమైన ప్రతిభావంతులు కారణంగా.. మైఖేల్ హస్సీ 28 సంవత్సరాల వయస్సులో అంతర్జాతీయంగా అరంగేట్రం చేశాడు.
35
అంతర్జాతీయ కెరీర్, విజయాలు..
2004లో అరంగేట్రం చేసిన హస్సీ తనను తాను ఆస్ట్రేలియా జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. అతను ఆస్ట్రేలియా జట్టు 2007 ప్రపంచకప్, 2006, 2009లో ICC ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడంలో సహాయపడ్డాడు. హస్సీ ఎప్పుడూ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుతంగా ఆడేవాడు.
'నేను సచిన్ టెండూల్కర్‌ను 5,000 పరుగుల తేడాతో అధిగమించగలను. చిన్న వయస్సులోనే క్రికెట్‌లో అరంగేట్రం చేసి ఉంటే.. ఈ రికార్డు సాధ్యమయ్యేది. నాకు అవకాశం వచ్చినప్పుడు నా పూర్తి సామర్థ్యాన్ని చూపించాను' అని హస్సీ అన్నాడు. హస్సీ సచిన్ కంటే 450 తక్కువ ఇన్నింగ్స్‌లు ఆడగా.. 78 తక్కువ సెంచరీలు చేశాడు.
55
ధోని మాజీ సహచరుడు..
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున బరిలోకి దిగాడు మైఖేల్ హస్సీ. ఆ సమయంలో జట్టుకు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్‌గా వ్యవహరించాడు. మొత్తంగా 59 మ్యాచ్‌లు ఆడిన హస్సీ 15 అర్ధ సెంచరీలు, 1 సెంచరీతో 1977 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోర్ 116గా ఉంది.