Virat Kohli: 2027 వన్డే ప్రపంచకప్ కోహ్లీ ఆడటం పక్కా.. వైరల్ ట్వీట్ ఇదిగో

Published : Oct 18, 2025, 11:23 AM IST

Virat Kohli: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు మొదలయ్యాయి. 2027 ప్రపంచకప్‌లో కోహ్లీ ఆడతాడా.? లేదా.? అనే ఉత్కంఠ మొదలైంది. తాజాగా అతడు చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటంటే.? 

PREV
15
కోహ్లీ వన్డే కెరీర్‌పై డైలమా

టెస్ట్, టీ20 ఫార్మాట్‌ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్ కోసం సిద్ధమయ్యాడు. పెర్త్ స్టేడియం వేదికగా 2025 అక్టోబర్ 19న జరిగే తొలి వన్డే కో అతడు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకోగా.. అక్కడ నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టిస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కోహ్లీ వన్డే ప్రపంచకప్ 2027లో ఆడతాడా..? లేదా.? వన్డేలకు రిటైర్మెంట్‌ ఇస్తాడా అనే దానిపై సోషల్ మీడియాలో విస్తృతంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

25
కోహ్లీ వన్డేలకూ వీడ్కోలు.?

టెస్ట్, టీ20 ఫార్మాట్‌లకు గుడ్‌బై చెప్పిన కోహ్లీ వన్డేలకూ వీడ్కోలు పలుకుతాడని.. ప్రస్తుత ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ అతని కెరీర్‌లో చివరిదని ప్రచారం జరుగుతోంది. కోహ్లీ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడటం డౌటేనని వార్తలు రావడంతో అభిమానులు గందరగోళానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో తన రిటైర్మెంట్ పుకార్లపై విరాట్ కోహ్లీ ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

35
హింట్ ఇచ్చిన కోహ్లీ

'పోరాటం ఆపాలని ఎప్పుడైతే నిర్ణయించుకుంటామో అప్పుడే మనం ఓడిపోయినట్లు' అని ఆ ట్వీట్ సారాంశం. ఈ ట్వీట్ చూసిన కొందరు కోహ్లీ అభిమానులు రిటైర్ మెంట్‌పై ముందుగానే హింట్ ఇచ్చాడని అంటుంటే.. మరికొందరు ఇది కేవలం ప్రచారం మాత్రమేనని.. ఏదో యాడ్ కోసం కోహ్లీ పోస్ట్ చేసి ఉండొచ్చునని అనుమానాలు వ్యక్తం చేశారు.

45
2027 వరల్డ్ కప్ కోసం వెయిటింగ్

ఇక వారి అనుమానాలు నిజం చేస్తూ.. అది ఒక యాడ్ కు సంబంధించినదిగా తెలుస్తోంది. దీంతో కోహ్లీ అభిమానుల్లో సంతోషంలో మునిగి తేలారు. కోహ్లీ వన్డేలకు ఇప్పుడే రిటైర్మెంట్ ఇవ్వడని, 2027 వరల్డ్ కప్ వరకు కొనసాగుతాడని కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా పరోక్షంగా చెప్పాడని వారు అభిప్రాయపడుతున్నారు.

55
టీమిండియా జట్టులో తీవ్ర పోటీ

టీమిండియా జట్టులో తీవ్ర పోటీ నెలకొనడం, యువ ఆటగాళ్ల రాకతో 2027 వన్డే వరల్డ్ కప్ జట్టులో కోహ్లీకి, రోహిత్‌కు చోటు కష్టమేనని క్రీడా వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇక "గివ్ అప్ ఇచ్చే ప్రసక్తే లేదు" అనే విధంగా కోహ్లీ పరోక్షంగా వ్యాఖ్యానించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే.. ఆదివారం మొదలు కాబోయే ఫస్ట్ వన్డేకు టీం ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories