అలా కాదు.. బ్యాట్‌తో చూపించు.. కోహ్లీపై విమర్శలు

First Published | Dec 26, 2024, 8:12 PM IST

virat Kohli: ఆస్ట్రేలియా యంగ్ ఓపెనర్, అరంగేట్రం ప్లేయర్ సామ్ కొన్‌స్టాస్‌తో ఘర్షణ పడిన తర్వాత భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీపై విమర్శలు వస్తున్నాయి.

virat kohli vs sam konstas

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియాలు ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను ఆడుతున్నాయి. మెల్ బోర్న్ లో బాక్సింగ్ డే టెస్టు ఆడుతున్నాయి. ఈ సిరీస్ లో నాల్గో టెస్టు అయిన ఈ మ్యాచ్ లో అనుకోని సంఘటనలు చోటుచేసుకున్నాయి. భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా అరంగేట్రం ప్లేయర్ సామ్ కొన్‌స్టాస్ లు హాట్ టాపిక్ గా మారారు.

అద్భుతమైన ఆటతో ఆసీస్ యంగ్ ప్లేయర్ సామ్ కొన్‌స్టాస్ అందరినీ తనవైపు తిప్పుకున్నాడు. తొలి రోజు ఆస్ట్రేలియా 6 వికెట్లకు 311 పరుగులు చేసింది. సామ్ కొన్‌స్టాస్ తన తొలి మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ (60) ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. కంగారు జట్టు ప్లేయర్లలో లబుషేన్ 72 పరుగులు, కవాజా 57 పరుగులు, స్మిత్ 62 పరుగులు చేశారు. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీసుకున్నాడు.

virat kohli vs sam konstas

సామ్ కొన్‌స్టాస్, విరాట్ కోహ్లీ మధ్య ఫైట్ 

అయితే, ఈ మ్యాచ్ లో సామ్ కొన్‌స్టాస్, విరాట్ కోహ్లీ మధ్య ఘర్షణ హాట్ టాపిక్ గా మారింది. మొదటి రోజు బ్యాట్ తో అదరగొట్టిన కొన్‌స్టాస్ ఓవర్ ముగిశాక మరో ఎండ్‌కు వెళ్తున్నాడు. అప్పుడు అతని వైపు వచ్చిన కోహ్లీ భుజానికి ఢీకొట్టాడు. దీంతో కొన్‌స్టాస్ కోహ్లీతో మాటా మాటా పెరిగింది. అంపైర్లు, ఇతర ఆటగాళ్ళు జోక్యం చేసుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు భారత స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీ విమర్శలకు టార్గెట్ గా మారాడు.


virat kohli vs sam konstas

కోహ్లీపై పాంటింగ్, మైకేల్ వాన్ ఫైర్ 

కోహ్లీ, కొన్‌స్టాస్ ఘర్షణ వీడియో వైరల్ అవుతోంది. కోహ్లీదే తప్పు అని ఆస్ట్రేలియాతో పాటు భారత అభిమానులు కొందరు పేర్కొంటున్నారు. కొన్‌స్టాస్ వెళ్తుంటే కోహ్లీ కావాలనే ఢీకొట్టాడని వీడియో చూస్తే అర్థమవుతుందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మాజీ క్రికెటర్ల నుంచి కూడా కోహ్లీ పై విమర్శలు వస్తున్నాయి. తన ఆవేశాన్ని గ్రౌండ్ లో బ్యాట్ తో చూపించాలని చురకలంటిస్తున్నారు. ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్లు రికీ పాంటింగ్ తో పాటు  మైకేల్ వాన్ కూడా విరాట్ కోహ్లీ విమర్శలు గుప్పించారు.

virat kohli vs sam konstas

మెల్ బోర్న్ గ్రౌండ్ లో జరిగిన ఘటనలో విరాట్ కోహ్లీదే తప్పు అని రికీ పాంటింగ్ అన్నారు. కోహ్లీ కావాలనే ఢీకొట్టాడని మైకేల్ వాన్ విమర్శించాడు. భారత మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా కోహ్లీ తీరును తప్పుపట్టాడు. ఆసీస్ యంగ్ ప్లేయర్  సామ్ కొన్‌స్టాస్ ను ఢీ కొట్టిన ఘటనలో విరాట్ కోహ్లీకి ఐసీసీ బిగ్ షాకిచ్చింది. కింగ్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది. అలాగే, ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చింది.

బాక్సింగ్ డే టెస్టు తొలి రోజు భారత్ కు దెబ్బ 

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ లో తొలి రోజు ఆసీస్ పై చేయి  సాధించింది. తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగింది. 19 ఏళ్ల అరంగేట్రం ఆటగాడు సామ్ కొన్‌స్టాస్, సీనియర్ ప్లేయర్ ఉస్మాన్ ఖవాజాలు అద్భుతమైన ఆరంభం అందించారు. సామ్ కొన్‌స్టాస్ తన తొలి మ్యాచ్‌లోనే అర్ధసెంచరీ (65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 పరుగులు) సాధించాడు. అతనితో పాటు ఉస్మాన్ ఖావాజా 57 పరుగులు, మార్నస్ లాబుస్చాగ్నే 72 పరుగులు, స్టీవెన్ స్మిత్ 68* ప‌రుగులు, అలెక్స్ కారీ 31 ప‌రుగులు చేశారు. మొత్తంగా ఆసీస్ తొలి రోజు 6 వికెట్లు కోల్పోయి 311 ప‌రుగులు చేసింది. బుమ్రా 3 వికెట్లు తీసుకున్నాడు. 

Latest Videos

click me!