ఐసీసీ క్రికెట్ నిబంధనల ప్రకారం.. విరాట్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో కోత విధిస్తూ ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చారు. క్రికెట్ నాన్-కాంటాక్ట్ స్పోర్ట్ కావడంతో ఆటగాళ్ల మధ్య ఫిజికల్ కాంటక్ట్ కు సంబంధించి కఠినమైన నిబంధనలు ఉన్నాయి. ICC ప్రవర్తనా నియమావళి (CoC), ఆర్టికల్ 2.12 ప్రకారం ఉద్దేశపూర్వకంగా, నిర్లక్ష్యంగా లేదా కావాలనే ఉద్దేశాలు కనిపించేలా ప్రత్యర్థి ప్లేయర్లను తాకితే ఉల్లంఘనగా పరిగణిస్తారు.
ఆన్‌ఫీల్డ్ అంపైర్లు జోయెల్ విల్సన్, మైఖేల్ గోఫ్, థర్డ్ అంపైర్ షర్ఫుద్దౌలా ఇబ్నే షాహిద్, ఫోర్త్ అంపైర్ షాన్ క్రెయిగ్‌లు అభియోగాన్ని మోపగా, కోహ్లీ చేసిన తప్పును అంగీకరించాడనీ, మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ ప్రతిపాదించిన అనుమతిని అంగీకరించాడు. దీంతో అధికారిక విచారణ అవసరం లేదని సమాచారం.