విరాట్ కోహ్లీతో గొడ‌వ‌.. అరంగేట్రంలో అద‌ర‌గొట్టిన ఆసీస్ యంగ్ ప్లేయ‌ర్ సామ్ కొన్‌స్టాస్‌

First Published | Dec 26, 2024, 6:53 PM IST

AUS vs IND: మెల్‌బోర్న్ వేదిక‌గా భార‌త్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న బాక్సిండ్ డే టెస్టులో విరాట్ కోహ్లీ-ఆసీస్ అరంగేట్రం ప్లేయ‌ర్ సామ్ కొన్‌స్టాస్ మధ్య ఫైట్ జ‌రిగింది. 
 

Sam Konstas

AUS vs IND - Virat Kohli: భార‌త్-ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో ప‌లు ఉత్కంఠ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీకి ఐసీసీ బిగ్ షాక్ ఇవ్వ‌గా, ఆస్ట్రేలియా అరంగేట్రం ప్లేయ‌ర్ సామ్ కొన్‌స్టాస్ అద్భుత‌మైన బ్యాటింగ్ తో మెరిశాడు. టాపార్డ‌ర్ బ్యాట‌ర్లు రాణించ‌డంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో తొలి రోజు 6 వికెట్లు కోల్పోయి 311 ప‌రుగులు చేసింది.

Sam Konstas

ఆసీస్ అరంగేట్రం ప్లేయ‌ర్ సామ్ కొన్‌స్టాస్ సూప‌ర్ ఇన్నింగ్స్

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ జ‌రుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్ లో భార‌త్-ఆస్ట్రేలియా జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో ఇది 4వ మ్యాచ్. టాస్ గెలిచిన కంగారుల టీమ్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. ఆసీస్ త‌ర‌ఫున సామ్ కొన్‌స్టాస్ అరంగేట్రం చేశాడు. ఈ ఒపెనింగ్ యంగ్ బ్యాట్స్ మెన్ అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. సామ్ కొన్‌స్టాస్-ఉస్మాన్ ఖావాజాలు హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ల‌తో ఆసీస్ కు బ‌ల‌మైన పునాది వేశారు.


భార‌త స్టార్ బౌల‌ర్ల‌ను ఎదుర్కొన్న తీరుపై ప్ర‌శంస‌లు 

బాక్సింగ్ డే రోజున అరంగేట్రం చేసిన 19 ఏళ్ల‌ ఆసీస్ ప్లేయ‌ర్ సామ్ కొన్‌స్టాస్.. త‌న తొలి మ్యాచ్ లో అద్భుత‌మైన బ్యాటింత్ తీరును ఆక‌ట్టుకున్నాడు. భారత ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొన్న తీరుతో అత‌నిపై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. రవీంద్ర జడేజా బౌలింగ్ లో ఔట్ అయిన ఈ యంగ్ ప్లేయ‌ర్ 65 బంతుల్లో 60 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. భార‌త స్టార్ బౌల‌ర్లు బుమ్రా, జ‌డేజాతో పాటు ఇత‌రుల బౌలింగ్ ను ఎదుర్కొవ‌డానికి తాను వ్యూహాలు సిద్ధం చేసుకున్నాన‌ని చెప్పిన సామ్ కొన్‌స్టాస్ అందుకు త‌గ్గ‌ట్టుగానే బ్యాటింగ్ ను కొన‌సాగించాడు.

రివర్స్ స్కూప్‌లతో బుమ్రా బౌలింగ్ లో సామ్ కొన్‌స్టాస్ సిక్స‌ర్లు

టీమిండియా స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా బౌలింగ్ ను ఎదుర్కొన్న తీరు సామ్ కొన్‌స్టాస్ ఇన్నింగ్స్ లో హైలైట్ గా  నిలిచింది. రివర్స్ స్కూప్‌లతో బుమ్రా బౌలింగ్ లో అద్భుత‌మైన షాట్స్ కొట్టాడు. సంబంధిత వీడియో దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. అత‌ను గాలిలో బంతిని కొట్టడానికి భయపడకుండా, మిడ్-వికెట్ మీదుగా ఆడుతూ ప‌రుగులు సాధించాడు. కేవలం 52 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ కొట్టి కోన్‌స్టాస్ ఆస్ట్రేలియా రెండవ అతి పిన్న వయస్కుడైన టెస్ట్ మ్యాచ్ హాఫ్ సెంచరీ కొట్టిన ప్లేయ‌ర్ గా ఘ‌న‌త సాధించాడు. 

విరాట్ కోహ్లీ - సామ్ కొన్‌స్టాస్ ఫైట్ 

ఆస్ట్రేలియా అరంగేట్రం ప్లేయ‌ర్ సామ్ కొన్‌స్టాస్‌, విరాట్ కోహ్లీ మ‌ధ్య జ‌రిగిన సంఘ‌ట‌న క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ మ్యాచ్ లో 10వ ఓవర్ ముగిసిన తర్వాత  ఆస్ట్రేలియన్ ఓపెనర్ కొన్‌స్టాస్‌ను కోహ్లీ భూజంతో ఢీకొట్టాడు. ఇది ఇద్దరు ఆటగాళ్ల మధ్య కొద్దిసేపు మాటల యుద్ధానికి దారి తీసింది. ఉస్మాన్ ఖవాజా అడుగు పెట్టిన త‌ర్వాత కూడా ఇది త‌గ్గ‌లేదు. చివ‌ర‌కు అంపైర్లు జోక్యం చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఐసీసీ కోహ్లీకి షాక్ ఇచ్చింది. కింగ్ కోహ్లీకి మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తూ ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చింది. 

Latest Videos

click me!