Virat Kohli: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇంగ్లాండ్‌పై ఇండియా సూపర్ విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేయడంతో పాటు ఇంగ్లాండ్ పై చరిత్ర సృష్టించాడు.
Virat Kohli: ఇంగ్లాండ్ తో జరిగిన మూడో మ్యాచ్ లో భారత్ 142 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 3 మ్యాచ్ ల వన్డే సిరీస్ ను భారత్ 3-0 తేడాతో గెలుచుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ విజయం భారత జట్టుకు సూపర్ బూస్ట్ అని చెప్పాలి.
అలాగే, స్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ ఓడిపోయిన తర్వాత రోహిత్ శర్మకు ఈ విజయం చాలా ముఖ్యమైనది. ఇక విరాట్ కోహ్లీ కూడా నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఫామ్ ను అందుకుంటూ హాఫ్ సెంచరీ కొట్టాడు. మరోసారి రికార్డుల మోత మోగించాడు.
26
Image Credit: Getty Images
ఇంగ్లాండ్ పై కొత్త రికార్డు సాధించిన కోహ్లీ
భారత స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ బుధవారం (ఫిబ్రవరి 12) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్‌పై హాఫ్ సెంచరీ కొట్టాడు. ఈ క్రమంలోనే అతను ఈ వన్డేలో మరో రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లో 4000 పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా కోహ్లీ ఘనత సాధించాడు. లెజెండరీ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బద్దలు కొట్టాడు.
36
Rohit Sharma-Virat Kohli
ఇంగ్లాండ్ పై చివరి వన్డేలో హాఫ్ సెంచరీ కొట్టిన కోహ్లీ
ఇంగ్లాండ్-భారత్ మూడో వన్డేలో విరాట్ 55 బంతుల్లో 52 పరుగులు చేసి అర్ధ సెంచరీ సాధించాడు. తన ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, ఒక సిక్సర్ బాదాడు. ఆ తర్వాత ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఫిలిప్ సాల్ట్ క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. విరాట్ బ్యాటింగ్ చేస్తున్న తీరు చూస్తుంటే, సెంచరీ కొట్టేలా కనిపించాడు కానీ ఆ మార్క్ ను అందుకోలేకపోయాడు.
46
Image Credit: Getty Images
టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ
ఇంగ్లాండ్ పై విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 4141 పరుగులు చేశాడు. ఈ విషయంలో సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇంగ్లాండ్ పై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. ఇక సచిన్ 69 మ్యాచ్‌ల్లో (90 ఇన్నింగ్స్‌లు) 3990 పరుగులు చేయగా, విరాట్ ఇంగ్లాండ్‌పై 87 మ్యాచ్‌ల్లో (109 ఇన్నింగ్స్‌లు) 4141 పరుగులు చేశాడు.
56
మొత్తంగా ఇంగ్లాండ్ పై అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ ఎవరు?
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ డాన్ బ్రాడ్‌మాన్ మూడు ఫార్మాట్లలోనూ ఇంగ్లాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ఉన్నాడు. ఇంగ్లాండ్‌పై 5000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ డాన్ బ్రాడ్‌మాన్. ఇంగ్లాండ్‌పై అతను 5028 పరుగులు సాధించాడు. ఇవన్నీ కూడా టెస్టు క్రికెట్ లో వచ్చినవే.
66
ఇంగ్లాండ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లు:
1 - డాన్ బ్రాడ్‌మాన్: 37 మ్యాచ్‌ల్లో 5028 పరుగులు
2 - అలన్ బోర్డర్: 90 మ్యాచ్‌ల్లో 4850 పరుగులు
3 - స్టీవ్ స్మిత్: 85 మ్యాచ్‌ల్లో 4815 పరుగులు
4 - వివ్ రిచర్డ్స్: 72 మ్యాచ్‌ల్లో 4488 పరుగులు
5 - రికీ పాంటింగ్: 77 మ్యాచ్‌ల్లో 4141 పరుగులు
6 - విరాట్ కోహ్లీ: 87 మ్యాచ్‌ల్లో 4036 పరుగులు
7 - సచిన్ టెండూల్కర్: 69 మ్యాచ్‌ల్లో 3990 పరుగులు