Shubman Gill's century records: మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఇండియా సూపర్ విక్టరీ అందుకుంది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన శుభ్ మన్ గిల్ తన సెంచరీతో అనేక రికార్డులు సాధించాడు.
Shubman Gill's century records: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మూడో మ్యాచ్ లో భారత్ సూపర్ విక్టరీ అందుకుంది. ఈ విజయంలో భారత యంగ్ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ సిరీస్ మొత్తంగా సూపర్ బ్యాటింగ్ తో గిల్ అదరగొట్టాడు. అనేక రికార్డులు సాధించాడు.
25
సూపర్ ఫామ్ లో శుభ్‌మన్ గిల్
2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు వన్డేల్లో అతను వరుసగా 87, 60, 112 పరుగులు చేశాడు. ఐసీసీ మెగా టోర్నీకి ముందు ఇది భారత జట్టుకు గుడ్ న్యూస్ అని చెప్పాలి.
బుధవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో దూకుడుతో పాటు కూల్ నెస్ కూడా కనిపించింది. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్‌లతో కలిసి ముఖ్యమైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు. అద్భుతమైన సెంచరీ కొట్టాడు.
35
సెంచరీతో రికార్డుల మోత మోగించిన శుభ్ మన్ గిల్
ఇంగ్లాండ్ తో జరిగిన మూడో మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ 95 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. దీంతో తన 50వ వన్డేలో సెంచరీ చేసిన తొలి భారతీయ ఆటగాడిగా నిలిచాడు. అలాగే, 50 ఇన్నింగ్స్‌లలో ఏడు వన్డే సెంచరీలు చేసిన అత్యంత వేగవంతమైన ప్లేయర్ గా నిలిచాడు.
వీటితో పాటు మూడు ఫార్మాట్లలో ఒకే వేదికపై సెంచరీ చేసిన ఐదవ క్రికెటర్, మొదటి భారతీయ ప్లేయర్ గా గిల్ రికార్డు సాధించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలు కూడా ఇలాంటి రికార్డును సాధించలేకపోయారు.
45
Image Credit: Getty Images
మూడు ఫార్మాట్లలో ఒకే వేదికపై సెంచరీలు చేసిన టప్-5 ప్లేయర్లు
ఫాఫ్ డు ప్లెసిస్ (సౌతాఫ్రికా) - వాండరర్స్, జోహన్నెస్‌బర్గ్
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) - అడిలైడ్ ఓవల్
బాబర్ అజామ్ (పాకిస్తాన్) - నేషనల్ స్టేడియం, కరాచీ
క్వింటన్ డి కాక్ (సౌతాఫ్రికా) - సూపర్‌స్పోర్ట్ పార్క్, సెంచూరియన్
శుభ్‌మన్ గిల్ (ఇండియా) - నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
అహ్మదాబాద్‌లో గిల్ అనేక రికార్డులు సాధించాడు. ఇక్కడ ఆడిన 4 టెస్ట్ ఇన్నింగ్స్‌లలో గిల్ సగటు 51.33గా ఉంది. ఇక్కడ ఒక టెస్ట్‌లో సెంచరీ చేశాడు. వన్డేల్లో మూడు 3 ఇన్నింగ్స్‌లలో సెంచరీ చేశాడు. ఒక T20 ఇన్నింగ్స్‌లో ఒక సెంచరీ సాధించాడు.
గిల్ ఐపీఎల్‌లో నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా 18 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ సమయంలో 3 సెంచరీలు సాధించాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సూపర్ రికార్డులు కలిగిన గిల్ మరోసారి ఇంగ్లాండ్ పై సెంచరీ బాది భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.