rohit sharma and virat kohli
T20 World Cup-Team India: ఐసీసీ మరో మెగా టోర్నీ టీ20 వరల్డ్ కప్ కు సమయం దగ్గరపడుతున్న ఎలాగైన కప్పు కొట్టాలని బీసీసీ ప్రాణాళికలు రచిస్తోంది. ఈ క్రమంలోనే జట్టుకూర్పుపై సమాలోచనలు చేస్తోంది. అయితే, టీమిండియా స్టార్ బ్యాటర్లకు జట్టులో చోటుదక్కకపోవచ్చునని టాక్ వినిపిస్తోంది.
rohit sharma and virat kohli
2024లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆడతారా లేదా అనే దానిపై అనేక సందేహాలు ఉన్నాయి. టీమ్ ఇండియాకు చెందిన ఈ ఇద్దరు బలమైన బ్యాట్స్‌మెన్ ఉంటే మెగా టోర్నీ కప్పు కొట్టడం తేలికవుతుందని క్రికెట్ ప్రియులు పేర్కొంటున్నారు.
rohit sharma and virat kohli
అయితే, వీరిద్దరూ కొంత కాలంగా టీ20 ఫార్మాట్‌కు దూరంగా ఉన్నారు. దక్షిణాఫ్రికాతో వైట్ బాల్ క్రికెట్ టీ20లు, వన్డేలకు కూడా ఆడడం లేదు. డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే 'బాక్సింగ్ డే టెస్ట్'లో కింగ్ కోహ్లీ, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మలు ఆడనున్నారు.
rohit sharma and virat kohli
అయితే, ఇటీవల ముగిసిన ఐసీసీ వన్డే ప్రపంచ కప్ 2023లో ఆడిన ఈ ఇద్దరు ప్లేయర్లు తమ బ్యాటింగ్ తో అదరగొట్టారు. తమదైన అద్భుత ప్రదర్శనతో మెరిపించిన స్టార్ ప్లేయర్లు విరాట్, రోహిత్ లు ఇప్పుడు టీ20 ప్రపంచ కప్ 2024 లో ఆడతారా లేదా అనే పెద్ద ప్రశ్న.. కానీ, భారత జట్టు మెగా టోర్నీ కప్పు కొట్టాలంటే స్టార్ ప్లేయర్లకు జట్టులో చోటుకల్పించాలని పలువురు క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
rohit sharma and virat kohli
ఎందుకంటే, విరాట్ కోహ్లీ 115 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో, అతను 52.73 సగటుతో, 137.96 స్ట్రైక్ రేట్‌తో 4008 పరుగులు చేశాడు. విశేషమేమిటంటే అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ. ఈ ఫార్మాట్‌లో విరాట్ పేరిట 1 సెంచరీ, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
rohit sharma and virat kohli
మరో స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మకు కూడా టీ20ల్లో మంచి రికార్డు ఉంది. రోహిత్ 148 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 31.32 సగటుతో మరియు 139.24 స్ట్రైక్ రేట్‌తో 3853 పరుగులు చేశాడు. అంటే వీరిద్దరూ ఈ ఫార్మాట్‌లో ఆడాల్సిన అవసరం ఏముందో ఈ రికార్డు నుండే అర్థం చేసుకోవచ్చు.
rohit sharma and virat kohli
అలాగే, ఫామ్ విషయానికి వస్తే.. 2023 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ బ్యాట్ తో గర్జించాడు. 11 మ్యాచ్‌ల్లో 765 పరుగులు చేసి కొత్త ప్రపంచకప్ రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్‌లోనే వన్డేల్లో 50 సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్కోరింగ్ పరంగా రోహిత్ విరాట్ కంటే వెనుకబడి ఉండగా, రోహిత్ 11 మ్యాచ్‌లలో 54.27 సగటు, 125.94 స్ట్రైక్ రేట్‌తో 597 పరుగులు చేశాడు. అంటే టీ20 ప్రపంచకప్‌లో కూడా ఆటను మార్చే సత్తా ఈ స్టార్ ప్లేయర్ జోడీకి ఉందన్నమాట.