IPL 2024: ముంబై ఇండియన్స్‌లో రోహిత్ స్థానం కోసం పోటీపడుతున్న ముగ్గురు యంగ్ ప్లేయ‌ర్స్ !

First Published | Dec 9, 2023, 8:12 PM IST

IPL 2024: రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుండి తొలగించే అవకాశం ఉందని క్రికెట్ వ‌ర్గాలు టాక్ న‌డుస్తోంది. హ‌ర్దిక్ పాండ్యా జ‌ట్టులోకి రావ‌డంతో అత‌నికి కెప్టెన్సీ ప‌గ్గాలు అప్ప‌గిస్తార‌ని టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు మ‌రో ప్లేయ‌ర్ పేరు తెర‌వీద‌కు వ‌చ్చింది. 
 

Rohit Sharma

Mumbai Indians-Rohit Sharma: ఐపీఎల్ 2024 వేలం సమీపిస్తుండటంతో జట్లు త‌మ‌కోసం ప్లేయ‌ర్ల జాబితాను సిద్ధం చేసుకుని మెరుగైన జట్టును నిర్మించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్సీ నుంచి త‌ప్పించే అంశాలు హాట్ టాపిక్ గా మారాయి. ముంబై కెప్టెన్ ఎవ‌రూ అనే చ‌ర్చ మ‌ధ్య మ‌రో క్రికెట‌ర్ పేరు వినిపిస్తోంది. 
 

Rohit Sharma

ఈ నేప‌థ్యంలోనే టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా తన కోరికను, కొత్త ఆలోచనలను పంచుకుంటూ.. ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ లేదా హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తారని చాలా మంది భావిస్తుండగా.. తాను మాత్రం మ‌రో క్రికెట‌ర్ పేరును తేర‌మీద‌కు తీసుకువ‌చ్చారు. సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా నియమించాలని అభిప్రాయ‌ప‌డ్డారు.
 

Latest Videos


Rohit Sharma

ఒకవేళ రోహిత్ శర్మ ఐపీఎల్ 2024 సీజన్ లో ఆడకపోతే సూర్యకుమార్ యాదవ్ ను ముంబై ఇండియన్స్ జట్టుకు కెప్టెన్ గా చేయాలని జడేజా సూచించాడు. 2024 టీ20 వరల్డ్ క‌ప్ లో ఆడే ఆటగాళ్లు ఐపీఎల్ సీజన్ మొత్తం ఆడకూడదనీ, లేకపోతే వారు అలసిపోతారని, గాయపడే అవకాశం ఉందని జడేజా హెచ్చరించాడు.
 

Rohit Sharma

ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. ఇక 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో పునరాగమనం చేసే అవకాశం ఉంది. ఐపీఎల్ 2024 రిటెన్షన్ గడువు ముగిసిన మరుసటి రోజే గుజరాత్ టైటాన్స్ అతడిని తమ జట్టు నుంచి తప్పించింది. అంటే ముంబై ఇండియన్స్ తో ఒప్పందం కుదిరిన‌ తర్వాత గుజరాత్ జట్టు నుంచి అతన్ని తప్పించారు.
 

Rohit Sharma, Hardik Pandya,

దీంతో తన తొలి ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ కు హార్దిక్ పాండ్యా తిరిగి వచ్చాడు. ప్రస్తుతం గాయపడ్డ అతడు జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. వచ్చే రెండేళ్ల పాటు భారత జట్టుకు అతను బాగా ఆడాల్సిన అవసరం ఉందనీ, పాండ్యా ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని బీసీసీఐ అతనిపై కన్నేసి ఉంచింది.

rohit sharma, Jasprit Bumrah

హార్దిక్ పాండ్యా కోసం బీసీసీఐ, ఎన్సీఏ 18 వారాల శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించాయి. మార్చి వరకు ప్రతిరోజూ పాండ్యా ఆరోగ్యం, శిక్ష‌ణ‌ అప్డేట్ అవుతుంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ అతడికి ఐపీఎల్ లో ఆడేందుకు అనుమతి ఇవ్వనుంది. మరో విషయం ఏంటంటే బుమ్రాకు కూడా ముంబై ఇండియన్స్ కెప్టెన్ కావాలనే కోరిక ఉంది. 

rohit sharma

అంటే ప్ర‌స్తుతం ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు కెప్టెన్సీ రేసులో హార్దిక్ పాండ్యాతో పాటు సూర్య‌కుమార్ యాద‌వ్, బుమ్రా కూడా రేసులో ఉన్నారు. అయితే, ఇక్క‌డ హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ ఏలా స్పందిస్తార‌ని ఆస‌క్తిక‌రంగా మారింది.  
 

click me!