Virat Kohli-Rohit Sharma
Virat Kohli-Rohit Sharma : రాబోయే టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టు కోసం బీసీసీఐ కసరత్తులు మొదలు పెట్టింది. పొట్టి ఫార్మట్ ను దృష్టింలో ఉంచుకుని ఆటగాళ్లను ఏంపిక చేయనున్నారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల విషయం హాట్ టాపిక్ గా మారింది.
Virat Kohli-Rohit Sharma
ఇటీవల ముగిసిన ప్రపంచకప్ లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యంలో భారత క్రికెట్ జట్టు వరుస విజయాలతో ఫైనల్లో చోటు దక్కించుకోవడంతో రాబోయే టీ20 వరల్డ్ కప్ కూడా అతడిని కెప్టెన్ గా చేయాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది.
Virat Kohli-Rohit Sharma
ఇదే సమయంలో విరాట్ కోహ్లీకి జట్టులో చోటుదక్కకపోవడమనేది హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో రోహిత్ శర్మను లాగుతూ బీసీసీఐ పై విమర్శలు చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. అలాగే, దీనిని సమర్థించే వారు కూడా ఉన్నారు.
Rohit Sharma, Virat Kohli
వాస్తవానికి గత ఏడాది టీ20 ప్రపంచకప్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ తమ చివరి టీ20 మ్యాచ్ ఆడారు. ఆ తర్వాత ఇద్దరూ ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే ఇప్పుడు ఈ హిట్ మ్యాన్ రోహిత్ ను 2023 వరల్డ్ కప్ లోకి తన బలమైన బ్యాటింగ్ ఆధారంగా టీ20 జట్టులోకి తిరిగి రావడానికి పూర్తి సన్నాహాలు చేశాడు. కానీ తన స్నేహితుడి కారణంగా విరాట్ కోహ్లీకి అవకాశం రావడం చాలా కష్టంగా మారింది. దీంతో అభిమానులంతా రోహిత్ ను తప్పుబడుతున్నారు.
Virat Kohli-Rohit Sharma
మనం మాట్లాడుకుంటున్న ఆ ప్లేయర్ మరెవరో కాదు రోహిత్ శర్మ స్నేహితుడు.. అతని ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్. 2024 టీ20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయబోతున్నారు? దీని గురించి సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్ పేరు వినిపిస్తోంది.
Virat Kohli
మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం రాబోయే టీ20 వరల్డ్ కప్ కు ఎలాంటి జట్టును ఎంపిక చేయాలనే దానిపై టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. ఇందులో విరాట్ కోహ్లీని చేర్చుకోవడం చాలా కష్టమని, అందుకే ఇషాన్ కిషన్ కు చోటు కల్పించాలని మేనేజ్మెంట్ నిర్ణయించిందని సమాచారం.
Ishan Kishan
అయితే ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే రాబోయే టీ20 ప్రపంచకప్ కోసం పటిష్టమైన జట్టును సిద్ధం చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఈ కారణంగా విరాట్ కోహ్లీకి జట్టులో చోటు దొరకడం కష్టమని టాక్. చూడాలి మరి మున్ముందు బీసీసీఐ భారత్ స్టార్ ప్లేయర్ కు టీంలో చోటుకల్పిస్తుందో లేదో.. !