Virat Kohli and Anushka Sharma dance video goes viral
భారత స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల జంట ఇంటర్నెట్‌లో మరోసారి వైరల్ అయ్యారు. ఈసారి షూటింగ్ సెట్‌లో వారి సరదా క్షణాలు అభిమానులను అలరించాయి. దుబాయ్‌లో ఓ యాడ్ షూట్ సమయంలో వీరిద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ వీడియో అభిమానులను ఆకట్టుకుంది. నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Virat Kohli and Anushka Sharma dance video goes viral
వైరల్ అవుతున్న వీడియోలో, బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్లతో అనుష్క స్టెప్పులేస్తుంటే, విరాట్ ఆమె దగ్గరికి వెళ్లి కలిసి డ్యాన్స్ చేశారు. ఇద్దరూ క్యాజువల్ దుస్తుల్లో ఉన్నారు. ఈ వీడియో అందమైన పూల్ సైడ్ లొకేషన్‌లో షూట్ చేశారు. హోటల్‌లో ఉన్నవారు ఈ అందమైన క్షణాన్ని తమ ఫోన్లలో బంధించారు.
Virat Kohli and Anushka Sharma dance video goes viral
విరాట్ కోహ్లీ - అనుష్క శర్మల అన్యోన్యత అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. వారు ఒకరినొకరు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అనేక సార్లు బహిరంగంగానే వారు మత ప్రేమను వ్యక్తం చేస్తుంటారు.
Virat Kohli and Anushka Sharma dance video goes viral
ఈ ఏడాది ప్రారంభంలో చాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలిచిన తర్వాత విరాట్, అనుష్క కలిసి ఉన్న క్షణాలు కూడా వైరల్ అయ్యాయి. భారత్ గెలిచిన తర్వాత, విరాట్ స్టాండ్స్‌లోకి వెళ్లి అనుష్కను కౌగిలించుకుని డాన్స్ తో సెలబ్రేట్ చేసుకున్నాడు.
Virat Kohli and Anushka Sharma dance video goes viral
కాగా, విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలు డిసెంబర్ 2017లో వివాహం చేసుకున్నారు. జనవరి 2021లో వారి కుమార్తె వామిక, ఫిబ్రవరి 2024లో కుమారుడు అకాయ్ రాకతో వారి కుటుంబం మరింత సంతోషంగా మారింది.
ఎప్పటిలాగే, విరాట్-అనుష్కలు తమ వ్యక్తిగత విజయాలతోనే కాకుండా, జంటగా వారి మధురమైన క్షణాల ద్వారా కూడా అందరి హృదయాలను గెలుచుకుంటున్నారు.