Shubman Gill: శుభ్‌మన్ గిల్ సూపర్ రికార్డు.. ఐపీఎల్ హిస్టరీలో తొలి ప్లేయర్ గా ఘనత

Shubman Gill: ఐపీఎల్ 2025లో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ 90 ప‌రుగులు, సాయి సుదర్శన్ 52 ప‌రుగులు, జోస్ బట్లర్ అజేయంగా 41 పరుగుల ఇన్నింగ్స్ ల‌తో గుజ‌రాత్ టైటాన్స్ మ‌రో సూప‌ర్ విక్ట‌రీ సాధించింది. ఈ మ్యాచ్ లో జీటీ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మ‌రో అద్భుత‌మైన రికార్డుతో ప్ర‌పంచంలోనే తొలి ప్లేయ‌ర్ గా ఘ‌న‌త సాధించాడు. 
 

Shubman Gill's Record-Breaking IPL Milestones: Most Centuries and Fifty-Plus Scores at Age 25 in telugu rma
Shubman Gill IPL Records

Shubman Gill: గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో సూపర్ రికార్డు సాధించాడు. తన సూపర్ నాక్ తో తన జట్టుకు విజయాన్ని అందించి ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో జీటీని టాప్ లోకి తీసుకువచ్చాడు. 

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్ 2025 39వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్(GT) తో కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) తలపడింది. ఈ మ్యాచ్ లో కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానె టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. 

Shubman Gill Becomes Youngest Player to Reach 3500 IPL Runs at Age 25

దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జట్టుకు శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్ లు 112 పరుగుల భాగస్వామ్యంతో మంచి శుభారంభం అందించారు. ఈ జోడీకి ఇది 6వ సెంచరీ భాగస్వామ్యం. ఇది IPL చరిత్రలో సంయుక్తంగా మూడవ అత్యధిక భాగస్వామ్యం. సాయి సుదర్శన్ మరో హాఫ్ సెంచరీ కొట్టాడు. కేవలం 36 బంతుల్లో 52 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను తిరిగి దక్కించుకున్నాడు.

గిల్ 55 బంతుల్లో 90 పరుగులతో మరోసారి తన బ్యాట్ పవర్ చూపించాడు. చివరలో జోస్ బట్లర్ కేవలం 23 బంతుల్లో 41 పరుగులు చేయడంతో జీటీ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 198 పరుగులు చేసింది.  ఆ తర్వాత కేకేఆర్ 159/8 పరుగులు మాత్రమే చేసి 39 పరుగుల తేడాతో ఓడిపోయింది. 


Shubman Gill's Record-Breaking IPL Milestones: Most Centuries and Fifty-Plus Scores at Age 25 in telugu rma

చరిత్ర సృష్టించిన శుభ్‌మాన్ గిల్

90 పరుగులు తన ఇన్నింగ్స్ తో గిల్ తన ఐపీఎల్ కెరీర్‌లో 3500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 25 ఏళ్ల గిల్ 2018లో కేకేఆర్ తరఫున 58 మ్యాచ్‌ల్లో 1417 పరుగులు చేశాడు. ఆ తర్వాత 2022లో గుజరాత్ టీమ్ లో చేరాడు. అప్పటి నుంచి అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. 

ఐపీఎల్ చరిత్రలో 3500 పరుగులు పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడు గిల్ రికార్డు సాధించాడు. అలాగే, 25 ఏళ్ల వయస్సులో ఈ ఘనత సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో 26 ఏళ్లు నిండే ముందు ఏ ఆటగాడు కూడా 3000 పరుగులు పూర్తి చేయలేదు. గిల్ ఇప్పుడు ఈ కొత్త రికార్డును సాధించాడు.

Gujarat Titans' Dominant Batting Performance Sets High Score Against Kolkata Knight Riders​

25 ఏళ్ల వయసులో ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు

శుభ్‌మన్ గిల్    111 మ్యాచ్‌లు 3511 పరుగులు 
రిషబ్ పంత్    98 మ్యాచ్‌లు 2838 పరుగులు 
ఇషాన్ కిషన్    105 మ్యాచ్‌లు 2644 పరుగులు 
విరాట్ కోహ్లీ    107 మ్యాచ్‌లు    2632 పరుగులు 
సంజూ శాంసన్ 107 మ్యాచ్‌లు 2584 పరుగులు 

గిల్ (25 సంవత్సరాల 225 రోజులు) కంటే ముందు  విరాట్ కోహ్లీ2016 సీజన్‌లో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడు (27 సంవత్సరాలు, 171 రోజులు)గా రికార్డు సాధించాడు. ఆ తర్వాత సంజు శాంసన్ 27 సంవత్సరాలు, 197 రోజులు వయస్సులో ఈ రికార్డు సాధించాడు. ఇప్పుడు గిల్ వారందరీ రికార్డులను బ్రేక్ చేశాడు. 

Gujarat Titans' Opening Duo Shubman Gill and Sai Sudharsan Shine in IPL 2025

అలాగే, 25 ఏళ్ల వయస్సులో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సెంచరీలు (నాలుగు సెంచరీలు) సాధించిన ప్లేయర్ గా కూడా గిల్ రికార్డు సాధించాడు. అలాగే, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, డేవిడ్ వార్నర్ మాత్రమే 25 ఏళ్ల వయస్సులో సెంచరీలు కొట్టిన ప్లేయర్లు గా ఉన్నారు. 

గిల్ ఇప్పటివరకు తన ఐపీఎల్‌ కెరీర్‌లో 27కు పైగా హాఫ్ సెంచరీలు సాధించాడు. 25 ఏళ్ల వయస్సులో ఏ ప్లేయర్ కూడా 20కి పైగా 50+ స్కోర్లు సాధించలేకపోయారు. గిల్ తర్వాతి స్థానంలో ఉన్న రోహిత్ శర్మ ఆ వయస్సులో 19 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఆ తర్వాత లిస్టులో ఉన్న ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ,శ్రేయాస్ అయ్యర్ లు 16+ సార్లు హాఫ్ సెంచరీలు సాధించారు. 

గిల్ 108 ఇన్నింగ్స్‌లలోనే 3500 పరుగులు సాధించి ఐపీఎల్ లో ఐదవ వేగవంతమైన ప్లేయర్ గా నిలిచాడు. కేఎల్ రాహుల్ 91 ఇన్నింగ్స్‌ల తర్వాత భారతీయులలో రెండవ అత్యంత వేగవంతమైన రికార్డు ఇది. 

Latest Videos

vuukle one pixel image
click me!