IPL: విరాట్ కోహ్లీ రికార్డును బ‌ద్ద‌లుకొట్టిన శుభ్‌మన్ గిల్

Shubman Gill breaks Virat Kohli's record: ఐపీఎల్ లో గిల్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. 25 ఏళ్ల వయస్సులో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సెంచరీలు, హాఫ్ సెంచ‌రీలు కొట్టిన ప్లేయ‌ర్  గా శుభ్‌మన్ గిల్ రికార్డు సాధించాడు. 25 సంవత్సరాల 225 రోజులు వ‌య‌స్సులో గిల్ 4 ఐపీఎల్ సెంచరీలు, 27కు పైగా హాఫ్ సెంచరీలు సాధించాడు. అలాగే, విరాట్ కోహ్లీ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. 
 

Shubman Gill breaks Virat Kohli's record, wins most Player of the Match awards at 25 in t20s IPL in telugu rma
Shubman Gill breaks Virat Kohli's record

Shubman Gill breaks Virat Kohli's record: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఐపీఎల్ 2025 39వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్(GT) - కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) తలపడ్డాయి. గుజరాత్ టీమ్ మ‌రోసారి త‌న ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించి కోల్‌కతాపై  ఏకపక్ష విజ‌యం సాధించింది. 

ఈ మ్యాచ్ లో మొద‌ట బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్ టైటాన్స్ 198 పరుగులు చేసింది. సెకండ్ బ్యాటింగ్ లో కేకేఆర్ 159 ప‌రుగులు మాత్ర‌మే చేసి 39 ప‌రుగ‌ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో గుజ‌రాగ్ కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ సూపర్ బ్యాటింగ్ తో అద‌ర‌గొట్టాడు. జీటీ కెప్టెన్ గిల్ 90 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

Shubman Gill wins most Player of the Match awards at 25 in t20s

తన సంచలనాత్మక ఇన్నింగ్స్‌తో గిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. దీంతో భార‌త మాజీ కెప్టెన్, ర‌న్ మిష‌న్ విరాట్ కోహ్లీ రికార్డును గిల్ బ‌ద్ద‌లు కొట్టాడు.

గిల్ తన కెరీర్‌లో అన్ని టీ20 మ్యాచ్‌లలో కలిపి 12 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. 25 ఏళ్ల వయసులో ఒక భార‌త ప్లేయ‌ర్ గెలుచుకున్న అత్య‌ధిక ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల రికార్డు ఇది. 


Shubman Gill

విరాట్ కోహ్లీ గతంలో 25 ఏళ్ల వయసులో T20ల్లో 11 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల‌ను గెలుచుకున్నాడు. ఇప్పుడు గిల్ కోహ్లీ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుల రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. 

టీ20ల్లో 25 ఏళ్ల వ‌య‌స్సులో అత్య‌ధిక ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్న భార‌త ప్లేయ‌ర్లు

12 – శుభ్‌మన్ గిల్ (153 మ్యాచ్‌లు)
11 – విరాట్ కోహ్లీ (157 మ్యాచ్‌లు)
10 – సురేష్ రైనా (129 మ్యాచ్‌లు)
9 – అభిషేక్ శర్మ (139 మ్యాచ్‌లు)
9 – రోహిత్ శర్మ (149 మ్యాచ్‌లు)

Shubman Gill

అలాగే, ఈ మ్యాచ్ లో 90 పరుగుల తన ఇన్నింగ్స్ తో గిల్ ఐపీఎల్ కెరీర్‌లో 3500 పరుగులు పూర్తి చేసుకున్నాడు. త‌న‌ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. 

ఐపీఎల్ చరిత్రలో 3500 పరుగులు పూర్తి చేసిన అతి పిన్న వయస్కుడు గిల్ రికార్డు సాధించాడు. అలాగే, 25 ఏళ్ల వయస్సులో ఈ ఘనత సాధించిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో 26 ఏళ్లు నిండే ముందు ఏ ఆటగాడు కూడా 3000 పరుగులు పూర్తి చేయలేదు. గిల్ ఇప్పుడు ఈ కొత్త రికార్డును సాధించాడు.

Shubman Gill. (Photo- IPL)

25 ఏళ్ల వయస్సులో ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక సెంచరీలు, హాఫ్ సెంచ‌రీలు కొట్టిన ప్లేయ‌ర్  గా కూడా శుభ్‌మన్ గిల్ రికార్డు సాధించాడు. 25 సంవత్సరాల 225 రోజులు వ‌య‌స్సులో గిల్ 4 ఐపీఎల్ సెంచరీలు, 27కు పైగా హాఫ్ సెంచరీలు సాధించాడు. 

Latest Videos

vuukle one pixel image
click me!