Virat Kohli Marksheet : కోహ్లీకి టెన్త్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా? హయ్యెస్ట్, లోయెస్ట్ ఏ సబ్జెక్టుల్లో?

Published : Jun 23, 2026, 08:00 PM ISTUpdated : Jun 23, 2026, 08:01 PM IST

విరాట్ కోహ్లీ తన పదో తరగతి మార్కుల షీట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు... అదిప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ లెక్కల్లో కోహ్లీకి ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా? ఆ మార్క్‌షీట్ చూస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు!

PREV
15
విరాట్ కోహ్లీ టెన్త్ మార్క్‌షీట్ వైరల్..

ఆధునిక క్రికెట్లో విరాట్ కోహ్లీని కింగ్ గా పేర్కోంటారు. తన బ్యాట్ తో పరుగుల వరద పారిస్తూ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో అయితే అత్యధిక పరుగుల రికార్డు కోహ్లీ పేరిటే ఉంది. ఇలా క్రికెట్ పరుగుల సునామీ సృష్టిస్తున్న కోహ్లీ స్కూల్ డేస్ లో మార్కుల సునామీ సృష్టించలేకపోయాడు. విరాట్ కోహ్లీ పదో తరగతి మార్క్‌షీట్ ఈ విషయం చెబుతోంది.  

25
కోహ్లీ మార్కుల లిస్ట్ ఇదే

విరాట్ కోహ్లీ పదో తరగతి మార్క్‌షీట్ ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. 2023లో కోహ్లీ తన మార్క్‌షీట్‌ను 'కూ' అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పంచుకున్నాడు. అప్పుడు షేర్ చేసిన ఆ మార్క్‌షీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పదో తరగతి పరీక్షల్లో వివిధ సబ్జెక్టులలో కోహ్లీకి వచ్చిన మార్కులు ఇందులో ఉన్నాయి. ఈ మార్క్‌షీట్‌ను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. "అరె…! కోహ్లీకి లెక్కల్లో ఇంత తక్కువ మార్కులా? అచ్చం మనలాగే..!" అంటూ కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

35
కోహ్లీకి ఏ సబ్జెక్ట్ లో ఎన్ని మార్కులు

విరాట్ కోహ్లీకి ఇంగ్లీష్‌లో 83, హిందీలో 75, గణితంలో 51, సైన్స్‌లో 55, సోషల్ సైన్స్‌లో 81, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 74 మార్కులు వచ్చాయి. మొత్తం 69.8 శాతం మార్కులు సాధించాడు. మొత్తానికి హయ్యెస్ట్ మార్కులు ఇంగ్లీష్ లో వస్తే లోయెస్ట్ మార్కులు మ్యాథ్స్ లో వచ్చాయి.

"కోహ్లీకి మంచి మార్కులు రాకపోయినా, తను ఎంచుకున్న రంగంలో నంబర్ 1 అయ్యాడు. మార్కులు ముఖ్యం కాదు, పట్టుదల, కఠోర శ్రమ అతన్ని ఈ స్థాయికి తీసుకొచ్చాయి" అని అభిమానులు అంటున్నారు.

45
కింగ్ కోహ్లీ ఎలా ఉంటాడు?

సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత క్రికెట్ ప్రపంచాన్ని విరాట్ కోహ్లీ శాసిస్తున్నాడు. ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా ఉండే విరాట్, వ్యక్తిగత జీవితంలో చాలా ఓపెన్‌గా ఉంటాడు. ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ వంటి అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చురుకుగా ఉంటాడు. కుటుంబంతో గడిపిన క్షణాలు, జిమ్ వర్కౌట్ ఫోటోలు, వీడియోలను పంచుకుంటాడు.

55
కోహ్లీ రికార్డులు

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ వరుస రికార్డులు సృష్టిస్తున్నాడు. టీ20 క్రికెట్‌లో 13,000 పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా కోహ్లీ ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో 1,000 బౌండరీలు కొట్టిన తొలి ఆటగాడు కూడా అతనే. అంతేకాదు టీ20 క్రికెట్‌లో 100 హాఫ్ సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు.  

Read more Photos on
click me!

Recommended Stories