Sanju Samson: ధోనీ క్రికెట్ రోజర్ ఫెడరర్ అయితే కోహ్లీ అల్కరాజ్ లాంటోడు.. సంజూ శాంసన్ క్రేజీ కామెంట్స్

Published : Jun 23, 2026, 01:52 PM IST

Sanju Samson Viral Video : టీమిండియా క్రికెట్ స్టార్స్ ఎంఎస్. ధోనీ, విరాట్ కోహ్లీలను టెన్నిస్ లెజెండ్స్ ఫెడరర్, అల్కరాజ్‌లతో పోల్చుతూ సంజూ శాంసన్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

PREV
16
వింబుల్డన్ వేళ సంజూ శాంసన్ క్రేజీ ఇంటర్వ్యూ.. ధోనీ, కోహ్లీలపై క్రేజీ కామెంట్స్

టెన్నిస్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే వింబుల్డన్ టోర్నమెంట్‌కు సమయం దగ్గరపడింది. ఈ క్రమంలో భారత క్రికెట్ స్టార్, మలయాళీ క్రికెటర్ సంజూ శాంసన్ క్రికెట్, టెన్నిస్ లెజెండ్స్ మధ్య ఒక క్రేజీ కంపారిజన్ చేశాడు. జియో హాట్ స్టార్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంజూ మాట్లాడుతూ.. ఇండియన్ క్రికెట్ పిల్లర్స్ అయిన ఐకానిక్ ఎంఎస్ ధోనీని టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెడరర్‌తో, రన్ మెషిన్ విరాట్ కోహ్లీని యంగ్ సూపర్ స్టార్ కార్లోస్ అల్కరాజ్‌తో పోల్చాడు. ఇప్పుడు ఈ కామెంట్స్ స్పోర్ట్స్ సర్కిల్స్‌లో తెగ హల్చల్ చేస్తున్నాయి.

26
ధోనీ ఒక రోజర్ ఫెడరర్

క్రికెట్‌లో రోజర్ ఫెడరర్ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఎంఎస్ ధోనీ మాత్రమేనని సంజూ శాంసన్ అన్నాడు. గ్రౌండ్‌లో ధోనీ మెయింటైన్ చేసే ప్రశాంతత, ఒత్తిడి సమయాల్లో అస్సలు టెన్షన్ పడకుండా మ్యాచ్‌లను గెలిపించే తీరు అద్భుతమని కొనియాడాడు. ధోనీ బ్యాటింగ్ చేస్తుంటే చాలా ఈజీగా అనిపిస్తుందని, కానీ అందులో ఎంతో పవర్ ఉంటుందని చెప్పాడు. టెన్నిస్ కోర్టులో రోజర్ ఫెడరర్ ఆట కూడా సరిగ్గా ఇలాగే క్లాస్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంటుందని సంజూ గుర్తుచేశాడు.

36
అల్కరాజ్ లాంటి విరాట్ కోహ్లీ

మరోవైపు, విరాట్ కోహ్లీని స్పెయిన్ యంగ్ సెన్సేషన్ కార్లోస్ అల్కరాజ్‌తో పోల్చాడు సంజూ. అల్కరాజ్ ఆటతీరు ఎంతో దూకుడుగా, పేలుడుగా ఉంటుందని అన్నాడు. విరాట్ భాయ్ కెరీర్ కూడా సరిగ్గా ఇలాంటి అగ్రెసివ్ స్టైల్‌తోనే స్టార్ట్ అయిందని చెప్పాడు. గ్రౌండ్‌లో విరాట్ చూపించే ఎనర్జీ, పవర్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని, అందుకే అతడిని అల్కరాజ్‌తో హ్యాపీగా కంపేర్ చేయవచ్చని సంజూ శాంసన్ అన్నాడు.

46
గాయంతో అల్కరాజ్ దూరం

ఇదిలా ఉంటే, టెన్నిస్ అభిమానులకు ఒక బ్యాడ్ న్యూస్. 2023, 2024 లలో వింబుల్డన్ టైటిల్స్ గెలిచి గ్రాస్ కోర్టులో తన ముద్ర వేసిన కార్లోస్ అల్కరాజ్ ఈసారి టోర్నీలో ఆడటం లేదు. ఫిట్‌నెస్ సమస్యల వల్ల అతడు ఈసారి వింబుల్డన్‌కు దూరమయ్యాడు. అంతకుముందు జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌కు కూడా అల్కరాజ్ గాయం కారణంగానే దూరమవ్వాల్సి వచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్ లేకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.

56
సిన్నర్‌కు గోల్డెన్ ఛాన్స్

అల్కరాజ్ లేని లోటులో ప్రస్తుతం వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ యానిక్ సిన్నర్‌కు ఈసారి వింబుల్డన్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 2025లో అల్కరాజ్‌ను సిన్నర్ ఓడించిన సంగతి తెలిసిందే. సిన్నర్‌తో పాటు ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గి ఫుల్ ఫామ్‌లో ఉన్న అలెగ్జాండర్ జ్వెరెవ్ కూడా గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నాడు. వీరందరితో పాటు తన 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్‌పై కన్నేసిన లివింగ్ లెజెండ్ నోవాక్ జొకోవిచ్ కూడా రేసులో ఉన్నాడు.

66
ఉత్కంఠగా వింబుల్డన్ పోరు

ఏదేమైనా ఈసారి వింబుల్డన్ టోర్నీ చాలా రసవత్తరంగా సాగనుంది. అల్కరాజ్ లేకపోయినా జొకోవిచ్, సిన్నర్, జ్వెరెవ్ లాంటి టాప్ ప్లేయర్స్ మధ్య టైటిల్ పోరు గట్టిగానే ఉండబోతోంది. టెన్నిస్ ఫీవర్ పీక్స్‌కు చేరిన ఈ టైంలో సంజూ శాంసన్ చేసిన ధోనీ, కోహ్లీల కంపారిజన్ మాత్రం సోషల్ మీడియాలో క్రేజీగా ట్రెండ్ అవుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories