Published : May 22, 2026, 07:35 PM ISTUpdated : May 22, 2026, 07:41 PM IST
ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో రాణించిన ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్న విజయ్, ఐపీఎల్, డొమెస్టిక్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు.
Vijay Shankar Retirement : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 నుండి చెన్నై సూపర్ కింగ్స్ ఇలా నిష్క్రమించగానే అలా ఓ టీమిండియా క్రికెటర్ ఐపిఎల్ కు వీడ్కోలు పలికాడు. టీమిండియా తరఫున వన్డే, టీ20ల్లో ఆడిన ఆల్‌రౌండర్ విజయ్ శంకర్.. దేశవాళీ, ఐపీఎల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. CSK, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ వంటి జట్లకు ఆడిన విజయ్, అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు.
25
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన విజయ్
గత ఐపీఎల్ సీజన్‌లో విజయ్ శంకర్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. కానీ ఈసారి వేలంలో అతడు అమ్ముడుపోలేదు… దీంతో ఈ ఐపిఎల్ సీజన్ కు దూరంగా ఉన్నాడు. అయితే వేలంలో అమ్ముడుపోకపోయినా మౌనంగానే ఉన్నాడు… కానీ ఇప్పుడు అనూహ్యంగా ఐపీఎల్, దేశవాళీ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు విజయ్ ప్రకటించాడు.
35
విదేశీ లీగ్ టోర్నీలపై దృష్టి..
ఈసారి ఐపీఎల్ నుంచి CSK నిష్క్రమించిన వెంటనే విజయ్ శంకర్ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. విదేశీ లీగ్ టోర్నీల్లో తన కెరీర్‌ను కొనసాగించే లక్ష్యంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అభిమానులు భావిస్తున్నారు.
విజయ్ శంకర్ టీమిండియా తరఫున 12 వన్డేలు, 9 టీ20 మ్యాచ్‌లు ఆడారు. 2019 ప్రపంచకప్ టోర్నీలో ఆల్‌రౌండర్ కోటాలో నెం.4 స్థానం కోసం విజయ్‌ను ఎంపిక చేశారు. మంచి ఫామ్ లో ఉన్న అంబటి రాయుడు, సురేశ్ రైనా వంటివారిని కాదని విజయ్ ని వరల్డ్ కప్ కు ఎంపికచేయడం వివాదాస్పదం అయ్యింది. ఇలా అనూహ్యంగా జట్టులో చోటు దక్కించుకున్నా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు… దీంతో టీమిండియాలో చోటు కోల్పోయాడు.
55
CSKతో మొదలై CSKతో ముగింపు
విజయ్ శంకర్ తన ఐపీఎల్ ప్రయాణాన్ని 2013లో CSKతో ప్రారంభించాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు ఆడి, మళ్లీ CSKకే తిరిగి వచ్చాడు. గుజరాత్ టైటాన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులోనూ విజయ్ సభ్యుడిగా ఉన్నాడు.