వరల్డ్ కప్ 2027 ప్లాన్స్.. హార్దిక్ ఫిట్‌నెస్‌పై బీసీసీఐ డౌట్స్
ఐపీఎల్ వివాదాలు ఒకవైపు ఉంటే, హార్దిక్ పాండ్యాకు టీమిండియా పరంగానూ పెద్ద షాక్ తగిలేలా ఉంది. బీసీసీఐ ఇటీవల నిర్వహించిన ఒక మీటింగ్‌లో వన్డే వరల్డ్ కప్ 2027 రోడ్‌మ్యాప్ గురించి చర్చించారు. ఈ క్రమంలో హార్దిక్ ఫిట్‌నెస్‌పై బోర్డు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఐపీఎల్ మధ్యలో గాయం కారణంగా హార్దిక్ 3-4 మ్యాచ్‌లకు దూరమయ్యాడు. త్వరలో అఫ్గానిస్థాన్‌తో జరగబోయే వన్డే సిరీస్‌కు హార్దిక్‌ను ఎంపిక చేసినప్పటికీ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఒక కండిషన్ పెట్టారు. హార్దిక్ జట్టులోకి రావాలంటే ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అవ్వాల్సిందే. వన్డే మ్యాచ్‌ల్లో హార్దిక్ పూర్తి స్థాయిలో 10 ఓవర్లు బౌలింగ్ చేయగలడా లేదా అనేదానిపై సెలెక్టర్లకు నమ్మకం లేదు.
చెన్నైతో మ్యాచ్ ముగిసిన తర్వాత హార్దిక్ వెన్నునొప్పితో ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుతం రిలయన్స్ ఫెసిలిటీ, వాంఖడే స్టేడియంలో ట్రైనింగ్ తీసుకుంటున్నా, వన్డేల్లో 10 ఓవర్లు వేసే ఫిట్‌నెస్ అతనికి ఉందా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
జనవరిలో కూడా 10 ఓవర్లు వేసే ఫిట్‌నెస్ లేకపోవడంతో న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు అతడిని దూరం పెట్టారు. ఒకవేళ హార్దిక్ ఫిట్‌నెస్ నిరూపించుకోకపోతే, అతని స్థానంలో నితీష్ కుమార్ రెడ్డి లేదా హర్షిత్ రాణా వంటి యంగ్ ప్లేయర్లను వన్డే వరల్డ్ కప్ 2027 ప్లాన్స్‌లోకి తీసుకునే యోచనలో బీసీసీఐ ఉందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.