Vaibhav Suryavanshi: టీమిండియాలోకి వైభవ్.. ఒక్క మ్యాచ్‌కి ఎంత సంపాదిస్తాడో తెలుసా.?

Published : Jun 07, 2026, 06:33 PM IST

Vaibhav Suryavanshi: 15 ఏళ్ల వయసులోనే భారత క్రికెట్‌లో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు. 2026 ఆసియా క్రీడలు, ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం ప్రకటించిన భారత జట్టులో అతనికి చోటు దక్కింది. 

PREV
15
టీ20 జట్టులో ఎంపికతో భారీ అవకాశం

టీమిండియా సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కులలో ఒకరిగా రికార్డు సృష్టించాడు వైభ‌వ్‌. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యువ బ్యాటర్ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. భారత సీనియర్ టీ20 జట్టులో చోటు దక్కడంతో వైభవ్ సూర్యవంశీకి కొత్త అవకాశాలు తెరుచుకున్నాయి. బీసీసీఐ నిబంధనల ప్రకారం జాతీయ జట్టు తరఫున ఆడే ప్రతి ఆటగాడికి మ్యాచ్ ఫీజు చెల్లిస్తుంది. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో తుది జట్టులో ఆడితే ఒక్కో మ్యాచ్‌కు రూ.3 లక్షల మ్యాచ్ ఫీజు అందుతుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ లేదా ఇతర ప్రోత్సాహకాలతో సంబంధం లేకుండా ఈ మొత్తం ప్రత్యేకంగా చెల్లిస్తారు. ప్రస్తుతం వైభవ్ ప్రధానంగా టీ20 ఫార్మాట్ కోసం ఎంపిక కావడంతో అతని ఆదాయం ఈ స్థాయి నుంచి ప్రారంభమవుతుంది.

25
వన్డే జట్టులోకి వస్తే ఆదాయం రెట్టింపు

భవిష్యత్తులో వైభవ్ సూర్యవంశీ భారత వన్డే జట్టులో కూడా స్థానం సంపాదిస్తే అతని మ్యాచ్ ఫీజు మరింత పెరుగుతుంది. ప్రస్తుతం బీసీసీఐ చెల్లింపు విధానం ప్రకారం భారత ఆటగాళ్లు ఒక్కో వన్డే మ్యాచ్‌కు రూ.6 లక్షలు పొందుతున్నారు. అంటే టీ20తో పోలిస్తే వన్డే మ్యాచ్ ఆడితే రెండింతల ఆదాయం వస్తుంది. అతని ప్రదర్శన ఇదే స్థాయిలో కొనసాగితే త్వరలోనే వన్డే జట్టులో కూడా అవకాశం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

35
టెస్టు క్రికెట్‌లో అత్యధిక పారితోషికం

భారత క్రికెట్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫార్మాట్ టెస్టు క్రికెట్. ఈ ఫార్మాట్‌లో ఆడే ఆటగాళ్లకు కూడా అత్యధిక మ్యాచ్ ఫీజు లభిస్తుంది. ప్రస్తుతం భారత టెస్టు జట్టులో ఆడే ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్‌కు రూ.15 లక్షలు చెల్లిస్తున్నారు. ఒకవేళ వైభవ్ భవిష్యత్తులో టెస్టు జట్టులో స్థానం సంపాదిస్తే ప్రస్తుతం టీ20 మ్యాచ్‌కు లభించే మొత్తానికి ఐదు రెట్లు ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

45
అండర్-19 స్థాయి నుంచి భారీ ఎదుగుదల

వైభవ్ సూర్యవంశీ ఇటీవల వరకు భారత అండర్-19 జట్టులో ఆడుతున్నాడు. ఆ స్థాయిలో ఆటగాళ్లకు బీసీసీఐ రోజుకు సుమారు రూ.20 వేల భత్యం చెల్లిస్తుంది. ఇప్పుడు సీనియర్ జట్టులోకి రావడంతో అతని ఆదాయం ఒక్కసారిగా భారీగా పెరిగింది. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ఆడితే రూ.3 లక్షలు అందుకోనున్నాడు. అంటే అండర్-19 స్థాయితో పోలిస్తే అతని మ్యాచ్ ఆదాయం దాదాపు 15 రెట్లు పెరిగినట్లే.

55
ఐపీఎల్ నుంచి టీమిండియా వరకు అద్భుత ప్రయాణం

చిన్న వయసులోనే ఐపీఎల్ లో తన ప్రతిభను నిరూపించుకున్న వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు భారత జట్టులో స్థానం సంపాదించడం ద్వారా మరో మైలురాయి చేరుకున్నాడు. సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలు నెలకొల్పిన రికార్డులను సవాలు చేసే స్థాయిలో అతని ప్రయాణం కొనసాగుతోంది. ప్రస్తుతం అతని ముందు ఉన్న లక్ష్యం భారత జట్టులో స్థిరమైన స్థానం సంపాదించి అన్ని ఫార్మాట్లలో రాణించడం. అదే జరిగితే అతని ఆదాయం మాత్రమే కాదు, భారత క్రికెట్‌లో అతని స్థానం కూడా మరింత బలపడే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories