Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 లో దుమ్మురేపే ఆటలో పరుగుల వర్షం కురిపించిన రాజస్థాన్ రాయల్స్ యంగ్ స్టార్ వైభవ్ సూర్యవంశీని టీమిండియా ప్లేయింగ్ XIలోకి తీసుకోవాలని సునీల్ గవాస్కర్ అన్నారు. అయితే, వైభవ్ రాకతో సంజూ, అభిషేక్ లలో ఒకరికి షాక్ తగలనుంది.
సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన 15 ఏళ్ల కుర్రాడు.. టీమ్ ఇండియాలోకి ఎంట్రీ
ఐపీఎల్ 2026లో తన తుపాన్ బ్యాటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ నిరీక్షణకు తెరపడింది. ఈ యంగ్ స్టార్ అద్భుతమైన ఆటతీరు సెలెక్టర్లను బాగా ఆకట్టుకుంది. దీనితో వైభవ్‌ను మూడు వేర్వేరు టీ20 సిరీస్‌ల కోసం టీమ్ ఇండియా స్క్వాడ్‌కు ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు ఈ యంగ్ బ్యాటర్‌ను టీమ్ ఇండియా ప్లేయింగ్-XIలోకి ఎలా తీసుకోవాలో లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఒక అదిరిపోయే ప్లాన్ చెప్పారు.
25
సచిన్ టెండూల్కర్ రికార్డ్ బద్దలుకొట్టిన వైభవ్
వైభవ్ సూర్యవంశీ కేవలం భారత జట్టులోకి రావడం మాత్రమే కాదు, ఒక చరిత్రను సృష్టించాడు. ఎన్నో ఏళ్ల క్రితం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన ఒక అరుదైన రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ భారత జట్టులో చోటు దక్కించుకున్న అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు.
ఇప్పుడు సచిన్ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. టీమ్‌లోకి అయితే వచ్చేసాడు కానీ, ఇంతకీ అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎక్కడ అవకాశం దక్కుతుందనేదే ఇప్పుడు అందరి మైండ్‌లో ఉన్న పెద్ద ప్రశ్న.
35
గవాస్కర్ డిమాండ్ ఇదే
ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ బ్యాటింగ్ విన్యాసాలు చూసిన తర్వాత, చాలా మంది క్రికెట్ దిగ్గజాలు అతడిని టీమ్ ఇండియాలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో టాప్ బౌలర్లను సైతం ఏమాత్రం భయం లేకుండా వైభవ్ ఎదుర్కొన్న తీరు అందరినీ ఫిదా చేసింది.
ఇప్పుడు సునీల్ గవాస్కర్ కూడా వైభవ్‌ను వీలైనంత త్వరగా ప్లేయింగ్-XIలో చేర్చాలని గట్టిగా కోరుతున్నారు. ఐర్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో వైభవ్ బ్యాటింగ్‌ను చూడటానికి తాను ఎంతో ఆసక్తిగా ఉన్నానని గవాస్కర్ చెప్పారు.
సునీల్ గవాస్కర్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "నేను వైభవ్‌ను ఐర్లాండ్ టి20 సిరీస్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే అతడు ఆడుతుంటే చూడాలని నాకు ఉంది. సంజూ శాంసన్ లేదా అభిషేక్ శర్మ కంటే ముందే వైభవ్‌కు అవకాశం ఇవ్వాలి. బహుశా ఒక మ్యాచ్‌లో వైభవ్ కోసం సంజూ లేదా అభిషేక్ బెంచ్‌కు పరిమితం కాక తప్పదు" అని గవాస్కర్ అన్నారు. ః
వైభవ్ రీసెంట్ ఫామ్, అతడు చేసిన పరుగుల వరద చూశాక, అతడిని జట్టు వెలుపల ఉంచడం సాధ్యం కాదని, సెలెక్టర్లు సరైన నిర్ణయమే తీసుకున్నారని గవాస్కర్ అన్నారు.
55
జూన్ 26 నుంచి అసలైన పోరు
భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జూన్ 26 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో గవాస్కర్ మాట్లాడుతూ.. "వైభవ్‌కు మ్యాచ్ ఆడే అవకాశం వచ్చినా, రాకపోయినా మేము అతని కోసం ఎదురుచూస్తాం. ఏది ఏమైనా, భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో గడపడం అనేది వైభవ్‌కు ఒక గొప్ప అనుభవం అవుతుంది. సీనియర్ల మధ్య నేర్చుకునే విషయాలు అతని కెరీర్‌కు ఫ్యూచర్‌లో బాగా ప్లస్ అవుతాయి" అని చెప్పారు. ఈ టీమ్‌ను ప్రకటించే సమయంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా వైభవ్‌పై ప్రశంసల జల్లు కురిపించడం విశేషం.