Vaibhav Breaks Sachin Record: సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ

Published : Jun 07, 2026, 08:12 AM IST

Vaibhav Breaks Sachin Record: ఐపీఎల్ లో పరుగుల వరద పారించిన వైభవ్ సూర్యవంశీ.. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు ఆసియా గేమ్స్ కోసం ప్రకటించిన టీమిండియా టీ20 జట్టుకు ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు.

PREV
16
అరాచకం సామి.. సచిన్ రికార్డ్ బద్దలు కొట్టిన 15 ఏళ్ల బిహార్ యంగ్ స్టార్

భారత క్రికెట్‌లో ఒక సరికొత్త చరిత్ర నమోదైంది. కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ సీనియర్ మెన్స్ జాతీయ జట్టులోకి ఎంపికై అందరినీ షాక్‌కు గురిచేశాడు. రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 పర్యటనలతో పాటు జపాన్‌లో జరగనున్న 2026 ఆసియా గేమ్స్ కోసం బీసీసీఐ శనివారం భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టులో రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ వైభవ్‌ సూర్యవంశీకి చోటు దక్కింది.

26
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలుకొట్టిన వైభవ్ సూర్యవంశీ

కేవలం 15 ఏళ్ల 71 రోజుల వయసులోనే టీమిండియాకు ఎంపికైన వైభవ్, భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట 36 ఏళ్లుగా ఉన్న ఒక అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. 1989లో సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల వయసులో తొలిసారి పాకిస్తాన్ పర్యటనకు భారత జట్టులోకి ఎంపికయ్యాడు.

మూడు దశాబ్దాలుగా ఎవరికీ సాధ్యం కాని ఈ మైల్‌స్టోన్‌ను ఈ బిహార్ యువకుడు ఇప్పుడు అధిగమించాడు. ఒకవేళ ఐర్లాండ్ లేదా ఇంగ్లాండ్ టూర్‌లో వైభవ్‌కు ఆడే అవకాశం వస్తే, అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా సచిన్ పేరిట ఉన్న మరో రికార్డును కూడా వైభవ్ బ్రేక్ చేస్తాడు.

36
ఐపీఎల్ 2026లో విధ్వంసం.. ఆరెంజ్ క్యాప్ విన్నర్

ఐపీఎల్ 2026 సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచి 'ఆరెంజ్ క్యాప్' సొంతం చేసుకున్నాడు. మొత్తం 16 మ్యాచ్‌ల్లో ఏకంగా 237.30 స్ట్రైక్ రేట్‌తో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీల సాయంతో 776 పరుగులు చేశాడు.

అంతేకాదు, ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ రికార్డును కూడా బద్దలు కొడుతూ ఏకంగా 72 సిక్సర్లు బాదాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గాను మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, సూపర్ స్ట్రైకర్, సూపర్ సిక్సెస్ అవార్డులను క్లీన్ స్వీప్ చేశాడు.

46
సమస్తీపూర్‌లో పండగ వాతావరణం.. బాణసంచా కాలుస్తూ సంబరాలు

వైభవ్ సూర్యవంశీ భారత జట్టుకు ఎంపికయ్యాడనే వార్త తెలియగానే బిహార్‌లోని అతని సొంత జిల్లా సమస్తీపూర్‌లో పండగ వాతావరణం నెలకొంది. వైభవ్ ఇంటి బయట బంధువులు, స్నేహితులు, స్థానికులు భారీగా చేరి బాణసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకున్నారు.

వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ మాట్లాడుతూ, "వాడు చిన్నప్పటి నుంచి రాత్రి పగలు కష్టపడ్డాడు. ఆ కష్టానికి ఈరోజు ప్రతిఫలం దక్కింది. దేశం కోసం ఆడే అవకాశం సంపాదించాడు. నా కొడుకు దేశం కోసం బాగా ఆడి ఎన్నో విజయాలు అందించాలని కోరుకుంటున్నాను. సెలెక్టర్లు నా కొడుకుపై నమ్మకం ఉంచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు" అని భావోద్వేగానికి గురయ్యారు. వైభవ్ బాబాయ్ రాజీవ్ సూర్యవంశీ, నానమ్మ కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వైభవ్‌ను ఆశీర్వదించారు.

56
రికార్డుల వేటలో వైభవ్.. అండర్-19 వరల్డ్ కప్ హీరో

వైభవ్ సూర్యవంశీకి రికార్డులు బద్దలు కొట్టడం కొత్తేమీ కాదు. ఇంతకుముందే అతను అత్యంత పిన్న వయసులో ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న ప్లేయర్‌గా, ఐపీఎల్ మ్యాచ్ ఆడిన అతి చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా, లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేసి, సెంచరీ కొట్టిన రికార్డు కూడా అతని పేరిటే ఉంది.

అండర్-19 టెస్టుల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల జరిగిన అండర్-19 వరల్డ్ కప్ 2026ను భారత్ గెలవడంలో వైభవ్ కీలక పాత్ర పోషించాడు. అతను అండర్-19 క్రికెట్‌లో 25 వన్డేల్లో 1412 పరుగులు చేశాడు. ప్రస్తుతం శ్రీలంకలో ట్రై సిరీస్ ఆడుతున్న ఇండియా-ఎ జట్టులోనూ అతను సభ్యుడిగా ఉన్నాడు.

66
టీమిండియా షెడ్యూల్.. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్

బీసీసీఐ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ఈ పర్యటనలకు టీ20 వరల్డ్ కప్ 2026 విజేత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా నియమించింది. ఐపీఎల్‌లో కేకేఆర్ (2024), పంజాబ్ కింగ్స్ (2025) జట్లను విజయవంతంగా నడిపించినందుకు శ్రేయాస్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు.

తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున రాణించిన పేసర్ ప్రిన్స్ యాదవ్‌కు కూడా జట్టులో చోటు దక్కింది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లాంటి ఓపెనర్లు ఉన్న నేపథ్యంలో వైభవ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎలా ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Read more Photos on
click me!

Recommended Stories