Champions Trophy: భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌లో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా సందడి చేసింది. స్టేడియంలో డ్యాన్స్ చేసి అదరగొట్టింది. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో చూడండి.
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్‌లో భారత్ - పాకిస్తాన్ మధ్య సూపర్ సండే బ్లాక్‌బస్టర్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ లో అదరగొడుతూ పాక్ ను చిత్తు చేసింది. భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది.
ఈ హై వోల్టేజీ మ్యాచ్ ను చూడటానికి దుబాయ్ స్టేడియానికి చాలా మంది ప్రముఖులు వచ్చారు. భారత సినీ రంగానికి చెందిన చాలా మంది భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లో మెరిశారు. ఇందులో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా కూడా ఉన్నారు.
23
urvashi rautela's viral dance video at india vs pakistan match in dubai stadium champions trophy
ఊర్వశికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇంతకు ముందు కూడా భారత్ ఆడిన చాలా మ్యాచ్ లలో మెరిశారు. మ్యాచ్ సమయంలో మరోసారి హీరోయిన్ స్టాండ్స్‌లో కనిపించింది. ఆమె మ్యాచ్‌లో కనిపించడమే కాకుండా, కిక్కిరిసిన స్టేడియంలో డాన్స్ తో అదరగొట్టింది. ఈ క్రమంలోనే జరిగిన ఘతన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎందుకంటే ఊర్వశి రౌతేలాతో పాటు మరో వ్యక్తి కూడా డాన్స్ చేశారు. ఇద్దరు డాన్స్ చేస్తున్న సమయంలో ఆ వ్యక్తి ఊర్వశి రౌతేలాకు ముద్దు పెట్టేశాడు. దీంతో ఆమె కూడా షాక్ అయినట్టుగా తన ముఖంలో కనిపించింది. అయితే, ఇద్దరూ చాలా సరదాగా కనిపించారు.
ఊర్వశి రౌతేలా నటించిన డాకు మహారాజ్ చిత్రం ఇటీవల విడుదలైంది. బాలయ్య సరసన అదరగొట్టింది. ఇందులో హీరోయిన్ స్టైల్ చాలా గ్లామరస్ గా, హాట్ గా కనిపించింది. ఆ సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. బాబీ డియోల్ కూడా ఇందులో ఒక పాత్ర పోషించాడు. ఈ సినిమాలోని రౌతేలా ఐటెం సాంగ్ తో సంచలనం రేపిందిత. ఆమె అదే పాటలో స్టేడియంలో డాన్స్ చేస్తూ కనిపించింది.